iccc
-
ఐసీసీసీలోకి గుర్తుతెలియని వ్యక్తి.. అలా ఎలా వెళ్లాడబ్బా!
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)కు ఇటీవల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. ఇంతటి కీలకమైన ఐసీసీసీలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి.. టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ తిరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది.ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు (identity card) కూడా చూపించాలి. ఎవరిని కలవాలో చెప్పాలి. నకిలీ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఐసీసీసీలోకి మూడుసార్లు వెళ్లి రావడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపలికి ఎలా వచ్చాడు ఎవరిని కలిశాడు, ఏం చెప్పి వచ్చాడు అన్నదానిపై ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.కూకట్‌పల్లికి చెందిన జ్ఞాన సాయి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్‌లో కలుసుకున్న నకిలీ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్.. తన పేరు హరిజన గోవర్ధన్‌గా పరిచయం చేసుకొని హోటల్ బిజినెస్‌లో లాభాలు వస్తాయంటూ రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. మూడు విడతలుగా ఇదే హోటల్లో బాధితుడు చెల్లించడం జరిగింది. ఈ మూడుసార్లు నిందితుడు హరిజన గోవర్దన్ ఐసీసీసీ (ICCC) నుంచి బయటికి వచ్చి బాధితుడిని నమ్మించాడు. బాధితుడు కూడా నేరుగా కమాండ్ కంట్రోల్‌సెంటర్ (command and control centre) నుంచి సదరు వ్యక్తి వస్తుండటంతో అందులో పని చేస్తున్న వ్యక్తిగానే భావించాడు. ఇక్కడే బాధితుడు దెబ్బతిన్నాడు. అడిగినంత డబ్బు చెల్లించుకొని తీరా మోసపోయిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐసీసీసీలో సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుడు మూడుసార్లు రావడం పోలీసులు గుర్తించారు.చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండిఇంతటి కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి అది కూడా సీఎం రోజూ హాజరవుతున్న ప్రాంతంలోకి నకిలీ పోలీసు వెళ్ళడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికకారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. గతంలో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడి ఉంటాడా.. అనే కోణంలో కూడా పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న సచివాలయంలో నకిలీ అధికారులు సంచలనం సృష్టించగా తాజాగా సీఎం సమీక్షలకు వస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. -
భారత్‌లో ఐసీసీసీ సదస్సు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ద కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ (ఐసీసీసీ) సదస్సుకు భారత్ వేదిక కానుంది. 2027లో న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఐసీసీసీకి ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ, స్విట్జర్లాండ్ సైతం పోటీపడ్డాయి. దిగ్గజాలు, విద్యావేత్తలు, నిపుణులు ఈ రంగంలో పరిశోధన పురోగతిపై సదస్సులో చర్చిస్తారు. 1918 నుండి సాధారణంగా 4–6 ఏళ్ల వ్యవధిలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 16వ ఐసీసీసీ సెపె్టంబర్ 18–22 మధ్య బ్యాంకాక్‌లో జరుగుతోంది. -
Hyderabad: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు హెడ్–క్వార్టర్స్‌గా మారనుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ భవనంలోని ఏ–టవర్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంగా వినియోగంలో ఉన్న విషయం విదితమే. రాష్ట్రానికే తలమానికంగా, దేశానికే ఆదర్శంగా నిర్మితమైన ఈ ఐసీసీసీ ఆగస్టు మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అన్ని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకునే దీన్ని డిజైన్ చేశారు. డయల్–100, అంబులెన్స్, ఫైర్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంచనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాలను ఈ కమాండ్ సెంటర్‌ను అనుసంధానించనున్నారు. ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ఇతర టూల్స్ నేరాల నిరోధం తదితరాలకు ఐసీసీసీలోని బి–టవర్‌ను వాడనున్నారు. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్‌న్స్ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బి–టవర్‌ను పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు (పీసీఎస్) అప్పగించాలని నిర్ణయించారు. ఈ విభాగం ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో కొనసాగుతోంది. పీసీఎస్ అదనపు డీజీ నేతృత్వంలోనే బి–టవర్ పని చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మార్పు నేపథ్యంలో పీసీఎస్కు అదనంగా సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ప్రాథమిక అంచనా ప్రకారం అదనపు డీజీ నుంచి పరిపాలన సిబ్బంది వరకు కలిపి మొత్తం 350 మంది అవసరమని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పీసీఎస్లో ఉన్న వారికి అదనంగా మరో 200 మంది వరకు అవసరం. ఈ సిబ్బందిని ప్రస్తుతానికి ఇతర విభాగాల నుంచి సర్దుబాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. త్వరలో జరుగబోయే రిక్రూట్మెంట్ నుంచి శాశ్వత ప్రాతిపదికన వీరిని తీసుకోనున్నారు. సాంకేతిక విద్యనభ్యసించిన, ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. (క్లిక్ చేయండి: 153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్ కాలేజీల వినతి) -
టెక్నాలజీకి కేరాఫ్
రాష్ట్ర రాజధానిలోని పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ)ను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఉపయుక్తంగా ఉండేలా నిర్మించనున్న ఈ ట్విన్ టవర్స్‌లో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించనున్నారు. నగర ప్రజల భద్రతే లక్ష్యంగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ భవంతుల స్వరూపం, అందులోని వ్యవస్థలు ఇవీ.. - సాక్షి, హైదరాబాద్ పోలీసు సింగిల్ విండో నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకు రానున్నారు. ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా ఇలా సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రీకృత పరిపాలన విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో ఐసీసీసీలోని అన్ని విభాగాల అధిపతులు ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, తక్షణమే స్పందించేందుకు ఇది దోహదం చేయనుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం డయల్-100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ-టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే స్పందించేలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ వ్యవస్థ జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతోపాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమై ఉంటుంది. విభాగాల వారీగా ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయించే వీలుంటుంది. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మొబైల్ యాప్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. క్రిమినల్ ట్రాకింగ్ వ్యవస్థ ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మొదలైనవి ఇక్కడ్నుంచే చేపట్టవచ్చు. నిఘా నేత్రం.. ట్రాఫిక్ అధ్యయనం నగరంలోని సీసీ కెమెరాల్లో రికార్డవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. సెన్సర్ల ద్వారా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్-అనుమానిత వాహనాల డేటాబేస్లను అనుసంధానిస్తారు. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. టవర్స్ స్వరూపం ఇదీ... ఏ,బీ,సీడీలుగా నాలుగు బ్లాకులను 5.5 లక్షల చదరపు అడుగులో నిర్మిస్తారు. మొత్తం నిర్మాణ వ్యయం రూ.1,002 కోట్లు. బ్లాక్-ఏలో 24, బ్లాక్-బీలో 18 అంతస్తులు ఉంటాయి. బ్లాక్-సీలో జీ+2 ఫ్లోర్లు, బ్లాక్-డీలో జీ+1 ఫ్లోర్ ఉంటాయి. పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్‌తో నిర్మించే ఈ టవర్స్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ. భవనంపై హెలీప్యాడ్, 17వ అంతస్తులో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం ఉంటాయి. 900 మంది కూర్చునే సామర్థ్యంలో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి ఉంటుంది. 18వ అంతస్తులో నగర పోలీసు కమిషనర్ కార్యాలయం ఉంటుంది.