టెక్నాలజీకి కేరాఫ్ | technology care off | Sakshi
Sakshi News home page

టెక్నాలజీకి కేరాఫ్

Published Mon, Nov 23 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

టెక్నాలజీకి కేరాఫ్

టెక్నాలజీకి కేరాఫ్

 రాష్ట్ర రాజధానిలోని పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ)ను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఉపయుక్తంగా ఉండేలా నిర్మించనున్న ఈ ట్విన్ టవర్స్‌లో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించనున్నారు. నగర ప్రజల భద్రతే లక్ష్యంగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ భవంతుల స్వరూపం, అందులోని వ్యవస్థలు ఇవీ..                  - సాక్షి, హైదరాబాద్
 
 పోలీసు సింగిల్ విండో
 నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకు రానున్నారు. ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా ఇలా సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


కేంద్రీకృత పరిపాలన
 విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో ఐసీసీసీలోని అన్ని విభాగాల అధిపతులు ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, తక్షణమే స్పందించేందుకు ఇది దోహదం చేయనుంది.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం
డయల్-100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ-టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే స్పందించేలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ వ్యవస్థ జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతోపాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమై ఉంటుంది.
 
 విభాగాల వారీగా ఫిర్యాదులు
 ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయించే వీలుంటుంది. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మొబైల్ యాప్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.

 క్రిమినల్ ట్రాకింగ్ వ్యవస్థ
 ఎఫ్‌ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మొదలైనవి ఇక్కడ్నుంచే చేపట్టవచ్చు.

 నిఘా నేత్రం.. ట్రాఫిక్ అధ్యయనం
 నగరంలోని సీసీ కెమెరాల్లో రికార్డవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. సెన్సర్ల ద్వారా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్-అనుమానిత వాహనాల డేటాబేస్‌లను అనుసంధానిస్తారు. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి.
 
 టవర్స్ స్వరూపం ఇదీ...

  •   ఏ,బీ,సీడీలుగా నాలుగు బ్లాకులను 5.5 లక్షల చదరపు అడుగులో నిర్మిస్తారు. మొత్తం నిర్మాణ వ్యయం రూ.1,002 కోట్లు.
  •  బ్లాక్-ఏలో 24, బ్లాక్-బీలో 18 అంతస్తులు ఉంటాయి. బ్లాక్-సీలో జీ+2 ఫ్లోర్లు, బ్లాక్-డీలో జీ+1 ఫ్లోర్ ఉంటాయి.
  •  పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్‌తో నిర్మించే ఈ టవర్స్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ.
  •  భవనంపై హెలీప్యాడ్, 17వ అంతస్తులో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం ఉంటాయి.
  •  900 మంది కూర్చునే సామర్థ్యంలో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి ఉంటుంది.
  •  18వ అంతస్తులో నగర పోలీసు కమిషనర్ కార్యాలయం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement