icet councelling
-
నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : ఏపీ ఐసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగియనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం , ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 850 మంది హాజరయ్యారు. గత నాలుగు రోజులు కంటే శుక్రవారం అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని ఎస్కేయూ హెల్ప్‌లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. -
ఐసెట్ కౌన్సెలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి ఐసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు గురువారం విద్యార్థులు పోటెత్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో 721 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో 411 మంది అభ్యర్థులు హాజరుకావడంతో గురువారం రాత్రి 10 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని క్యాంప్ ఆఫీసర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 15న ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తికానుంది. -
11 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్–2017 కౌన్సెలింగ్ ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 15న కౌన్సెలింగ్ ముగుస్తుందన్నారు. ఎస్కేయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ల కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు.