icwa
-
ఆటోడ్రైవర్ కుమార్తెకు ఆలిండియా ర్యాంకు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆటోడ్రైవర్ కుమార్తె ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీడబ్ల్యూఏ)లో ఆలిండియా ర్యాంకు సాధించింది. కోల్‌కతాలోని ఐసీడబ్ల్యూఏ ఛాప్టర్ ప్రకటించిన 2018 డిసెంబర్లో జరిగిన ఫైనల్ పరీక్షా ఫలితాల్లో విజయవాడ కానూరుకు చెందిన ఆటోడ్రైవర్ కుమార్తె బొల్లా మనీషా ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు సాధించింది. శ్రీకాకుళం జిల్లా మరకపేటకు చెందిన గెంబలి సురేంద్ర ఆలిండియా 3వ ర్యాంకు సాధించగా, బొల్లా మనీషా ఆలిండియా 11వ ర్యాంకు, పశ్చిమగోదావరిజిల్లా వడాలికి చెందిన ఎం.ప్రవీణ్‌కుమార్ ఆలిండియా 12వ ర్యాంకు సాధించారు. విజయవాడ సూపర్‌విజ్ సంస్థలో శిక్షణ పొందిన వారు 3, 11, 12 ర్యాంకులతో సత్తా చాటినట్లు ఆ సంస్థ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది నాన్న ఆటోడ్రైవర్. నన్ను ఎలాగైనా ఉన్నత స్థాయిలో చూడాలని రాత్రి, పగలు ఆటో నడిపి రూపాయి రూపాయి కూడబెట్టి సీఏ కోర్సులో చేర్చారు. నాన్న కష్టానికి ఫలితంగా నేను ఈరోజు ఐసీడబ్ల్యూఏలో ఆలిండియా 11వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉంది. – బొల్లా మనీష, కానూరు, విజయవాడ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం శ్రీకాకుళం జిల్లాలోని కుగ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను నేడు ఆలిండియా ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చలించి పోయేవాడిని. కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుకి మంచి భవిష్యత్తు ఉందని తెలిసి శిక్షణ పొందాను. ఆలిండియా 3వ ర్యాంకు సాధించడంతో నా తల్లిదండ్రుల కష్టానికి గొప్ప ప్రతిఫలం అందించినట్లయింది.– సురేంద్ర, ఆలిండియా మూడో ర్యాంక -
రైతు కుటుంబంలో విద్యాకుసుమం
► ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు ► పట్టుదల..ఆశయమే నడిపింది! క్రమశిక్షణ.. పట్టుదల.. అంకితభావం.. లక్ష్యసాధనకు తపన.. ఇవి ఉంటే చాలు మనిషిని అత్యంత ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతాడనడానికి నిదర్శనంగా నిలిచాడు జిల్లాలోని తొట్టంబేడు మండలం చోడవరం గ్రామానికి చెందిన రైతుబిడ్డ మోహన్‌కుమార్. జీవితంలో ఉన్నతస్థాయి చేరుకోవాలన్నదే అతడి లక్ష్యం.. సిద్ధాంతం. అతడు నమ్మిన ఆ సిద్ధాంతమే ఆ రైతుబిడ్డను పల్లె నుంచి ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) విభాగంలో జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. చోడవరం గ్రామానికి చెందిన రైతు దంపతులు నాగరాజరెడ్డి, మంజుల సంతానం మోహన్‌కుమార్ ఈ నెల 3వ తేదీన విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) ఫైనల్ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించాడు. ఈ సందర్భంగా అతడితో ముఖాముఖి. ప్రశ్న: సీఏ చేయాలన్న కోరిక ఎలా కలిగింది? జవాబు: నా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ నన్ను కష్టపడి చదివించారు. వారి కష్టాన్ని ప్రత్యక్షంగా చూడడంతో ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచన నాలో కలిగింది. పదో తరగతి వరకు చిత్తూరు జిల్లాలోనే చదివాను. ఆ తరువాత ఒంగోలులో నా బంధువుల ఇంట్లో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ చదివే సమయంలో సీఏ చేయాలన్న కోరిక నా లో కలిగింది. నేను సీఏ చేయడానికి నా తల్లిదండ్రుల కష్టం, ప్రోత్సాహం ఎనలేనిది. ప్ర: సీఏ కోర్సును ఎందుకు ఎంచుకున్నారు? కోర్సుకు ఖర్చును ఎలా భరించారు? జ: ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నా గమ్యాన్ని ఎంచుకున్నాను. అప్పట్లో నాకు ఇంజినీరింగ్ చదవాలన్న మక్కువ ఉండేది. అయితే ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ భూమ్ అంతగా లేకపోవడంతో నేను సీఏ పూర్తి చేయాలనుకున్నాను. నా కుటుంబానికి ఆర్థిక స్థోమత లేనప్పటికీ కష్టపడి చదివితే మార్గం దొరుకుతుందన్న ఆలోచనతో ముందుకెళ్లాను. పై చదువులు పూర్తి చేసుకుని బెంగళూరులోని విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. అక్కడ వచ్చే జీతంతో కోర్సు పూర్తి చేశాను. ప్ర: జాతీయ స్థాయి మొదటి ర్యాంకు సాధనకు మీరు రూపొందించుకున్న ప్రణాళికలేవి? జ: ఏకాగ్రత ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మొదట్లో సరైన అవగాహన లేకపోయినా కోర్సు ప్రాధాన్యత, భవిష్యత్ గురించి ఆలోచించి చదివాను. సోషల్ మా ధ్యమాలు, ఇతర ఎటువంటి ప్రలోభాల మాయలో పడకుండా కష్టపడి చదివాను. మెయిన్ పరీక్షలు రాసే ముందు రెండు సార్లు ప్రాక్టీస్ టెస్టులను పూర్తి చేయడం వలన జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించగలిగాను. ప్ర: చాలా మంది సీఏ అంటేనే భయపడుతుంటారు.. ఆ భయం తొలగడానికి మీరిచ్చే సలహా ఏమిటి? జ: సామాన్యంగా సీఏ చాలా మంది భయపడడం వాస్తవమే. ఒక పాఠ్యాంశం ఫెయిల్ అయితే తిరిగి అన్నీ సబ్జెక్టులు రాయాలన్నా భయంతో చాలా మంది విద్యార్థులు సీఏ వైపు ఆసక్తి చూపడం లేదు. భయంతో చది వితే దేనినీ సాధించలేం. సీఏ అంటే భయపడాల్సినంత పనేమీ ఉండదు. మొదట్లో కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ రానురాను ఆ కోర్సుపై మక్కువ పెంచుకోవచ్చు. సీఏ చేయడం వలన మంచి భవిష్యత్ ఉంటుందన్నదే నా అభిప్రాయం. ప్ర: మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? జ: ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం ఇంకా ఒక సంవత్సరం వరకు కొనసాగిస్తాను. ఆ తరువాత నేను సొంతంగా చా ర్టెడ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలను కుం టున్నాను. -
ఐసిడబ్ల్యూఏలో సూపర్ విజ్‌కు ర్యాంకుల పంట
-
పులకించిన పున్నవల్లి
ఐసీడబ్ల్యూఏలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన పున్నవల్లి విద్యార్థి పున్నవల్లి(చందర్లపాడు) : మండలంలోని పున్నవల్లి గ్రామానికి చెందిన ఉడత వెంకట సాయికిరణ్ ఐసీడబ్ల్యూఏ ఫైనల్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వెంకట సాయికిరణ్‌కు అభినందనలు తెలిపారు. వెంకటసాయి కిరణ్ సీఏ–సీపీటీలో జాతియ స్థాయిలో 6వ ర్యాంకు, ఐపీసీసీలో 12వ ర్యాంకు, ఐసీడబ్ల్యూఏ ఫౌండేషన్‌లో ప్రథమ ర్యాంకు, ఇంటర్లో 5వ ర్యాంకు సాధించాడు. మారుమూల గ్రామానికి చెందిన వెంకట సాయికిరణ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని స్థానిక ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి వంశీ పేర్కొన్నారు. -
సత్తా చాటిన తెలుగు తేజాలు
ఐసీడబ్ల్యూఏ ఫౌండేషన్ పరీక్షల్లో ర్యాంకుల పంట ఫస్ట్ ర్యాంకర్ సాయిరామ్ విజయవాడ (లబ్బీపేట): కోల్‌కత్తాలోని ఐసీడబ్ల్యూఏ చాప్టర్ వారు బుధవారం ప్రకటించిన డిసెంబర్-2014, జూన్-2015 ఫౌండేషన్ పరీక్ష ఫలితాల్లో తెలుగుతేజాలు సత్తాచాటాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఏఎన్వీ సాయిరామ్ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు, విజయవాడకు చెందిన పి.ప్రశాంత్, గుంటూరుకు చెందిన పరిశ లక్ష్మి ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. వీరంతా విజయవాడలోని సూపర్‌విజ్‌లో శిక్షణ పొందిన విద్యార్థులే. ర్యాంకర్లను విజయవాడలోని సూపర్ విజ్ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు అభినందించారు. ఇప్పటి వరకూ సూపర్‌విజ్ విద్యార్థులు 47 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఐఏఎస్ నా లక్ష్యం.. మా నాన్న వస్త్ర దుకాణంలో గుమస్తా. ఎంతో కష్టపడుతూ నన్ను ఉన్నతంగా చూడాలనుకుంటున్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నా. ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు వస్తుందని ఊహిం చలేదు. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి, సివిల్స్ సాధిస్తా. ప్రస్తుతం సీఏ సీపీటీ, ఐపీసీసీ పూర్తి చేసి ఫైనల్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఐఏఎస్ అవ్వాలనేదే నా లక్ష్యం. - ఏఎన్వీ సాయిరామ్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తా నాన్న లేడు. అమ్మ విజయ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం, సూపర్‌విజ్ శిక్షణతో నేడు ఐసీడబ్ల్యూఏలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించా. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం సాధించడం నా లక్ష్యం. - పి.ప్రశాంత్, ఆలిండియా రెండో ర్యాంకర్ నాన్న కష్టానికి ఫలితం.. నాన్న రాంబాబు వ్యవసాయం చేస్తుంటారు. పదోవతరగతి తర్వాత సీఏ చేస్తానని అడిగితే కాదనలేదు. కోరుకున్న కోర్సు ఇష్టంగా చదవమని చెప్పారు. నాన్న కష్టానికి ఫలితంగా నేడు ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించగలిగాను. దీన్ని నాన్నకు అంకితమిస్తున్నా. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేస్తా. - పి.లక్ష్మి, రెండో ర్యాంకర్ -
సూపర్ స్టూడెంట్స్
ఐసీడబ్ల్యూఏలో ఆలిండియా ర్యాంకులు సాధించిన సూపర్‌విజ్ విద్యార్థులు ఫైనల్లో 47వ ర్యాంకు సాధించిన నగరానికి చెందిన అంధుడు నాగరవితేజ కలలు అందరూ కంటారు.. వాటిని సాకారం చేసుకునే వారే నిజమైన విజేతలవుతారు. ఒకరు ప్రపంచాన్ని చూడలేని అంధుడు.. మరొకరు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.. ఇంకొకరు తల్లిదండ్రుల ఆశలనే ఊపిరిగా భావించి ముందుకు కదులుతున్నారు.. దారులు వేరైనా వీరి గమ్యం మాత్రం ఒక్కటే. అదే ఐసీడబ్ల్యూఏ. నిరంతర కృషి, సత్తా ఉంటే గానీ సాధించలేని లక్ష్యాన్ని ఈ ముగ్గురు అలవోకగా ఛేదించారు. నగరంలోని సూపర్‌విజ్‌లో చదువుకుంటున్న ఈ విద్యార్థులు ఐసీ డబ్ల్యూఏలో ఆలిండియా స్థాయిలో ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. తల్లిదండ్రుల సహకారం, సూపర్‌విజ్ కృషితోనే తాము ఈ విజయం సాధించామని చెబుతున్న ఈ ‘సూపర్’ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే.. - లబ్బీపేట కళ్లు లేకపోయినా అందరి ప్రోత్సాహంతో.. నేను లయోల కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు సూపర్‌విజ్ టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. ఆ టెస్ట్‌లో నన్ను చూసిన గుప్తాగారు (సూపర్‌విజ్ ఎండీ) అంధత్వం మనిషికే కానీ మనసుకు కాదని, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా నిరాశపడకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పిన మాటలకు ఆకర్షితుడనై సీఏ చేయాలని నిర్ణయించుకున్నా. సీఏ సీపీటీ శిక్షణలో చేరినపుడు మొదట్లో కొంత ఇబ్బందే ఎదురైనా గుప్తాగారు ప్రత్యేకంగా రీసెర్చి చేసి రూపొందించిన బ్లైండ్ టెక్నిక్స్ నాలో నూతనోత్సాహాన్ని నింపాయి. దీంతో సీఏ, సీపీటీ, ఐపీసీసీ పూర్తిచేసి ఫైనల్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఐసీడబ్ల్యూఏ కోర్సును పూర్తిచేసి ఫైనల్లో ఆలిండియా స్థాయిలో 47వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ర్యాంకు సాధించడానికి సూపర్విజ్తో పాటు మా అమ్మానాన్న, సోదరి కృషి కూడా ఎంతో ఉంది. నాన్న సాంబశివరావు ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. అమ్మ గృహణి, సోదరి ప్రస్తుతం ఎంటెక్ చేస్తోంది. నాకు చూపు లేకపోయినా వారి ప్రోత్సాహంతో ముందుకుసాగుతున్నా. ఇదే స్ఫూర్తితో సీఏ పూర్తిచేసి మంచి ఉద్యోగం చేయాలనేదే నా ఆకాంక్ష. అందుకు నిరంతరం కృషిచేస్తా. అమ్మానాన్న, గుప్తాగారు, ఇతర అధ్యాపకులకు కృతజ్ఞతలు. - కంచర్లపల్లి నాగరవితేజ, ఐసీడబ్ల్యూఏ ఫైనల్ 47వ ర్యాంకర్, విజయవాడ, అంధుడు కన్నవారి కల నెరవేరింది.. ప్రకాశం జిల్లా వేములపాడుకు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నపుడు సీఏ చేయాలన్న ఆకాంక్ష కలిగింది. నాన్న కృష్ణయ్య వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ రమణమ్మ గృహిణి. ఈ విషయాన్ని వారికి చెప్పగా, నువ్వేమి కోరుకుంటున్నావో దానినే కష్టపడి సాధించాలని ఆశీర్వదించి పంపించారు. వారి ఆకాంక్షను ఎన్నడూ విస్మరించలేదు. అమ్మానాన్న పడిన కష్టాల నుంచి పొందిన స్ఫూర్తితో, సూపర్‌విజ్ టెక్నిక్స్‌తో నేడు ఐసీడబ్ల్యూఏ ఇంటర్లో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాను. ఈ విషయాన్ని అమ్మానాన్నకు ఫోన్‌చేసి చెప్పాను. వారి ఆనందానికి అవధుల్లేవు. నాకు తగిన ప్రేరణ ఇచ్చి ఎలాగైనా పాస్ అవ్వాలనే పట్టుదల కలిగించిన గుప్తాగారి కృషిని నేను జీవితాంతం మరిచిపోలేను. గుప్తాగారు చెప్పిన టెక్నిక్స్ ఎవరు పాటించినా కచ్చితంగా ర్యాంకులు సాధించగలరు. ఈ ఫస్ట్ ర్యాంకును అమ్మానాన్నకు బహు మతిగా ఇవ్వడంతో నా కల నెరవేరింది. సీఏ ఫైనల్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం. - మద్దినేని లక్ష్మీనారాయణ, ఐసీడబ్ల్యూఏ ఇంటర్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ మంచి ఉద్యోగం సాధిస్తా.. మాది ఉయ్యూరు. మా నాన్న ధనరాజ్ చిరు వ్యాపారం చేస్తుంటారు. నన్ను చార్టెడ్ అకౌంటెంట్‌గా చూడాలనేది మా అమ్మానాన్న ఆకాంక్ష. అందుకే నగరంలోని సూపర్‌విజ్‌లో చేర్చారు. ఇక్కడ ఇస్తున్న శిక్షణ, వారు చెప్పే టెక్నిక్స్ పాటిస్తూ ప్రతి పరీక్షలో విజయం సాధించా. ప్రస్తుతం సీఏ సీపీటీ, ఐపీసీసీ పూర్తిచేశాను. ఐపీసీసీలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించా. ఇప్పుడు ఐసీడబ్ల్యూఏ ఇంటర్లో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం ద్వారా నా తల్లిదండ్రుల కలలను నిజం చేశా. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ ఫైనల్స్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధిస్తా. సూపర్‌విజ్‌లో చేరిన సాధారణ విద్యార్థులు సైతం ర్యాంకులు సాధించగలరని నేను నిరూపించాను. ఈ ర్యాంకు సాధించడానికి తోడ్పాటునిచ్చిన అమ్మానాన్న, సూపర్‌విజ్ అధ్యాపకులకు నా కృతజ్ఞతలు. - కంతేటి ఉపేంద్ర, ఐసీడబ్ల్యూఏ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్, ఉయ్యూరు రోజుకు 13 గంటలు చదివా.. మధురానగర్‌లోని పసుపుతోటలో ఉంటున్న సాధారణ కుటుంబానికి చెందిన తాపీమేస్త్రి కుమార్తె ముక్కామల స్వాతి ఐసీ డబ్ల్యూఏలో జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించింది. దీంతో తండ్రి శ్రీనివాసరావు, తల్లి విజయలక్ష్మి ఆనందంతో మంగళవారం పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వాతి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థానానికి చేరుకుంటానన్నారు. ఈ ర్యాంకు రావటానికి తాను రోజుకు 13 గంటల చదివానని, సూపర్‌విజ్ డెరైక్టర్ గుప్తా టెక్కిక్స్, తల్లిదండ్రుల పోత్సాహంతోనే ఈ ఘనత సాధించానని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకుంటానని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా స్వాతిని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తన నియోజకవర్గంలో ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమెకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహ కారాలు అందజేస్తానని బొండా ఉమా హామీ ఇచ్చారు. - మధురానగర్ -
కష్టమే అయినా.. ఇష్టపడి చదివా..
interview ‘సాక్షి’తో ఐసీడబ్ల్యూఏ ఆలిండియా మూడో ర్యాంకర్ తులజ భవానీ ‘కష్టే ఫలి..’ అన్నారు పెద్దలు. ఇష్టపడి చదివితే కొంచెం కష్టమనిపించినా లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకోవచ్చని నిరూపించారు నగరానికి చెందిన తులజ భవానీ. ఏం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్న ఆలోచనధోరణే ఆమెను శిఖరాగ్రాన నిలబెట్టింది. 2013లో ఐసీడబ్ల్యూఏ కొత్త సిలబస్‌లో ఆలిండియా మూడో ర్యాంక్, మహిళా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన తులజ జాతీయస్థారుులో నగరఖ్యాతిని ఇనుమడింపజేశారు. మార్చిలో కోల్‌కతాలో జరిగే స్నాతకోత్సవంలో ఐసీఎంఏ నుంచి నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా తులజ భవానీ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ.. - భవానీపురం సాక్షి : ఐసీడబ్ల్యూఏలో దేశంలోనే మూడో ర్యాంక్ సాధించిన మీకు అభినందనలు. తులజ : ధన్యవాదాలు సాక్షి : మీ కుటుంబ నేపథ్యం.. తులజ : మాది గుంటూరు జిల్లా తెనాలి. అక్కడి మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లోనే చదువుకున్నాను. వ్యాపారవేత్త అరుున నాన్న చంద్రశేఖర్(బాచి) నా పదేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి గృహిణి అయిన అమ్మ తారావాణి అన్నీతానై పెంచింది. ఏనాడూ ఇది చదువు.. అది చదువు అంటూ నన్ను ఒత్తిడికి గురిచేయలేదు. అందుకేనేమో ఈ స్థాయికి చేరుకున్నా. సాక్షి : సీఏ ఎందుకు చదవాలనిపించింది? తులజ : పదో తరగతి పూర్తయ్యూక ఇంజినీరింగ్ లేదా డాక్టర్ చదివేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మొదటి నుంచి డాక్టర్ చదవాలనుకున్న నేను పదో తరగతి పూర్తయ్యూక అందరికంటే భిన్నమైన మార్గంలో వెళ్లాలనుకున్నాను. ఇంటర్లో ఏంఈసీ తీసుకున్నా. 2010లో విజయవాడ చేరుకుని మాస్టర్ మైండ్ కాలేజీలో చేరాను. సాక్షి : అక్కడి నుంచి మీ చదువు ఎలా సాగింది? తులజ : ఇష్టపడి చదివాను.. ఇంటర్లో 966 మార్కులతో ఎంఈసీలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాను. ఆ తరువాత సీఏ సీపీటీలో మంచి మార్కులు సాధించి అదే కళాశాలలో సీఏ పూర్తి చేశాను. సాక్షి : ఆ తరువాత... తులజ : సీఏ పూర్తయ్యాక ఐసీడబ్ల్యూఏ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఈ కోర్సును ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (ఐసీఎంఏ) వారు నిర్వహిస్తున్నారు. రెండూ వేర్వేరు కోర్సులు. ఒక్కోటి నాలుగేళ్లపాటు చదవాలి. సాక్షి : ఫలితాలొచ్చాక ఏమనిపించింది? తులజ : 2014 మార్చిలో ఫలితాలు వచ్చాయి. ఆలిండియా స్థారుులో మూడోస్థానం, మహిళల్లో మొదటి స్థానం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో కోల్‌కతాలో జరిగే స్నాతకోత్సవంలో ఐసీఎంఏ నుంచి నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నాను. సాక్షి : భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? తులజ : అనుకున్నది సాధించాను. అన్నీ అనుకూలిస్తే ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నా. సాక్షి : విష్ యూ బెస్టాఫ్ లక్. -
ఐసీడబ్ల్యూఏ టాపర్ మనోడే
ఐసీడబ్ల్యూఏ టాపర్ మనోడే మాస్టర్‌మైండ్స్ విద్యార్థికి ప్రథమ ర్యాంక్ గుంటూరు, న్యూస్‌లైన్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ-సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థి కోట లీలా నాగకుమార్ అఖిలభారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. మాస్టర్‌మైండ్స్‌లో చదివిన ఈ విద్యార్థి గుంటూరులోని ఏటీ అగ్రహారం వాసి. తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే మరణించగా, తల్లి సుభాషిణికిళ్లీషాపు నడుపుతూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. పదో తరగతి వరకూ గుంటూరులోని వేణుగోపాల్ నగర్‌లోని మున్సిపల్ పాఠశాలలో చదివిన నాగకుమార్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని మాస్టర్‌మైండ్స్ సంస్థలో చేరాడు. కాగా తమ విద్యార్థి అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల మాస్టర్‌మైండ్స్ సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ శుక్రవారం ఆనందం వెలిబుచ్చారు. మున్సిపల్ స్కూల్లో చదివిన విద్యార్థికి తాము జూనియర్ ఇంటర్ మొదలు ఎంఈసీ, సీఏ-సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ వరకూ ఉత్తమ శిక్షణతో క్వాలిఫైడ్ సీఏగా తీర్చిదిద్దామన్నారు. నాగకుమార్‌కు ఐసీఏఐ సంస్థ మూడు ప్రతిభా పురస్కారాలు ప్రకటించిందన్నారు. వి.శ్రీనివాసన్ స్మారక బంగారు పతకం, ఇందుమతి తలాటి రజత పతకం, సుభాష్ ఆధ్య స్మారక నగదు బహుమతులను ఏప్రిల్ 8న కోల్‌కతాలో బహూకరించనున్నారన్నారు. గతేడాది క్వాలిఫైడ్ సీఏగా బయటకు వెళ్లిన విద్యార్థి నాగకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో అకౌంటెంట్ ఇన్ ట్రైనీగా చేరాడన్నారు. శిక్షణ అనంతరం ఏడాదికి రూ. 6 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందన్నారు.