పూరీ ఐడియాకు కౌన్సిలర్ దర్శకత్వం!
షార్ట్‌ఫిల్మ్‌కు క్లాప్ కొట్టిన బేబీనాయన
బొబ్బిలి: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన స్టోరీ ఐడియాతో పట్టణ కౌన్సిలర్ కిరణ్‌కుమార్ లఘుచిత్రం రూపొందించనున్నారు. పూరీ ఇచ్చిన ఆరో ఐడియాతో సబ్జెక్టును రూపొందించుకుని బొబ్బిలి కోటలో సోమవారం షూటింగ్ నిర్వహించా రు. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభిం చారు. అందమైన గెస్టుహౌస్‌లో ప్రేమికుల కథ ను తీస్తున్నారు. ఇందులో వేదరామన్, సంజీవ్ యోగ, శిరీష, యువకిరణ్, సంతోష్‌లు నటిస్తున్నారు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుకొని బొ బ్బిలి 29వ వార్డుకు కౌన్సిలరుగా ఉంటున్న పొట్నూరు కిరణ్‌కుమార్ లఘుచిత్రాన్ని నిర్మిస్తున్నారు. పట్టణానికి చెందిన రాజు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.