identity cards distribution
-
కళాకారులకు గుర్తింపు కార్డులు : మంత్రి రోజా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతోపాటు తెలుగు కళా రూపాలను పరిరక్షించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. సచివాలయంలో గురువారం సాంస్కృతికశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సాంస్కృతిక పోటీలను అధికారికంగా నిర్వహించి విజేతలకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. రాష్ట్రంలో తెలుగు కళాకారులను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. పల్లెల్లోని కళాకారులను గుర్తించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించు కోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా కళారూపాల జాబితాను సిద్ధం చేయాలని.. ఆడిటోరియాలను గుర్తించి కళారూపాల ఛాయాచిత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్‌భార్గవ, సాంస్కృతిక అకాడమీల చైర్పర్సన్లు, సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
గుర్తింపు కార్డులివ్వాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావును బుధవారం కలసి వినతిపత్రం సమర్పించా రు. ‘టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఎప్పుడు పిలుపు ఇచ్చినా ఉద్యమం చేశాం. కేసులు నమోదై జైళ్లకు వెళ్లాం. అయినా తెలంగాణ సాధించిన ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యమంలో కేసుల నమోదు, రిమాండ్, బెయిల్, కోర్టు కేసులు తదితర అంశాల ఆధారంగా పోలీసుల రికార్డుల ప్రకారం ఉద్యమకారులను గుర్తించి గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఉద్యమకారులందరినీ సమరయోధులుగా గుర్తించి నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలి. అర్హులైన విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని కోరారు. అన్ని అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేశవరావు ఉద్యమకారులకు తెలిపారు. నీరాను ప్రభుత్వమే విక్రయించాలి: గౌడ సంఘం ఔషధ గుణాలున్న కల్లును నీరాగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే బాటిలింగ్ చేసి విక్రయించాలని సర్వా యి పాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘం) టీఆర్ఎస్కు విజ్ఞప్తి చేసింది. కల్లు గీత కార్మికుల సంక్షేమంపై మేనిఫెస్టోలో చేర్చాలని కోరింది. గౌడ ఫెడరేషన్ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. గౌడ సంఘం నేతలు ఈడిగ ఆంజనేయులుగౌడ్, మల్లాగౌడ్, సునీల్‌గౌడ్ బుధవారం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో 80 లక్షల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారని, వీరికి 20% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో పది ఎకరాల స్థలం కేటాయించి హరితహారం కింద హైబ్రిడ్ చెట్లను నాటాలని పేర్కొన్నారు. -
బోగస్‌ల తొలగింపుపై సర్కారు కసరత్తు
-
ఐదు లక్షల పెన్షన్ల కోత!
-
ఐదు లక్షల పెన్షన్ల కోత!
బోగస్‌ల తొలగింపుపై సర్కారు కసరత్తు ఇప్పటికే అంచనాలను మించిన దరఖాస్తులు నిబంధనల ప్రకారం భారీగా వడపోతకు నిర్ణయం వచ్చే నెల 8 నుంచి గుర్తింపు కార్డుల పంపిణీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల పెన్షన్లకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న 31.67 లక్షల పెన్షన్లలో ఆ మేరకు బోగస్ పెన్షనర్లు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తాజా దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య ఇప్పటికే ప్రస్తుత పెన్షన్ల సంఖ్యను దాటిపోవడం గమనార్హం. అయితే కొత్త నిబంధనలతో చాలా మందిపై అనర్హత వేటు పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆధార్ కార్డుతోపాటు సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన అంశాలను ఆధారం చేసుకుని పెన్షన్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కారు భావిస్తోంది. పిల్లలు ఉద్యోగం చేస్తున్నా, ఇతర పెన్షన్లు పొందుతున్నా, వ్యాపారాలున్నా, నాలుగు చక్రాల వాహనాలున్నా, పరిమితిని మించి భూమి ఉన్నా.. అనర్హులుగా ప్రకటించే అవకాశముంది. భార్యాభర్తలిద్దరూ వృద్ధులైతే ప్రస్తుతమున్న విధంగా ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలన్న నిబంధనను కూడా కొనసాగించనున్నారు. అయితే ఒక ఇంట్లో వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నప్పటికీ వారందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డులు లేని కారణంగా ఇప్పటికే నాలుగున్నర లక్షల మందికి పెన్షన్లను ఆపేశారు. ఇలా ఎందుకు చేశారంటూ పెన్షన్లు కోల్పోయిన వారెవరూ తమను అడగడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగున్నర లక్షల బోగస్ పెన్షనర్లను గుర్తించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల పెన్షన్లను తొలగించిన విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. కాగా, కొత్త పెన్షన్లు, కార్డులను వచ్చే నెల 8 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెబిట్/క్రెడిట్ కార్డుల మాదిరిగా స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. లబ్ధిదారుల ఫొటోతోపాటు వారి వివరాలతో కూడిన చిప్‌ను అమర్చాలని భావిస్తున్నారు. అయితే వాటిని లబ్ధిదారులు సరిగా భద్రపరుచుకునే అవకాశం ఉండదని, అందువల్ల కార్డుల పరిమాణం కాస్త పెద్దగా ఉండాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నట్లు సమాచారం. దీంతో పాత తరహాలో పుస్తక రూపంలో, మడతపెట్టడానికి వీలుగా ఉన్న ప్రస్తుత కార్డులుగా, స్మార్ట్ కార్డు రూపంలో ఇలా మూడు రకాల కార్డుల నమూనాలను అధికారులు రూపొందించారు. వీటిలో ముఖ్యమంత్రి ఆమోదించిన తరహా కార్డులనే అధికారులు పంపిణీ చేయనున్నారు.