Idupalapaya
-
మహానేతకు వైఎస్ జగన్ ఘన నివాళి
* వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళి * ఓపెన్ చర్చిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలసి క్రిస్మస్ ప్రార్థనలు సాక్షి, కడప: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి కొద్దిసేపు మౌనంగా అక్కడే మోకరిల్లారు. సమీపంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ, బ్రదర్ అనిల్, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కూడా వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, భారతమ్మలు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఇడుపులపాయలోని ఓపెన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏటా క్రిస్మస్కు ముందురోజు వైఎస్సార్ కుటుంబసభ్యులు.. బంధుమిత్రులతో కలసి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి, వైఎస్ సోదరులు వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతమ్మ, జగన్మోహన్రెడ్డి మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ మేనత్త కమలమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దంపతులు, వైఎస్ భాస్కర్‌రెడ్డి దంపతులు, డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి దంపతులు, ఇతర కుటుంబసభ్యులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. రెవరెండ్ ఫాదర్ నరేష్, బెనహర్‌బాబు, మృత్యుంజయ తదితర ఫాస్టర్లు క్రిస్మస్ పర్వదిన విశిష్టతను వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని వారు ప్రార్థించారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన జగన్ ఇడుపులపాయలో ప్రార్థనల అనంతరం ప్రొద్దుటూరుకు వెళ్లిన వైఎస్ జగన్‌కు పట్టణ శివారులో వైఎస్సార్సీపీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకుడు ముక్తియార్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలందరికీ వైఎస్ జగన్.. మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల పరిధిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులున్నారు. -
వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్
వైఎస్సార్ జిల్లా: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటలో భాగంగా ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన వైఎస్ఆర్ జిల్లా ఇడుపలపాయలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి... నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్... తొలి రోజు పర్యటన (డిసెంబర్ 24, 2015) ► డిసెంబర్ 24 న ఉదయం 7.30 లకు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు ఆర్పిస్తారు. ► ఉదయం 9 గంటలకు ప్రార్థన సమావేశాల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. ► మధ్యాహ్నం 12.30 లకు ప్రొద్దుటూర్‌లోని ఎఫ్జీ ఫంక్షన్ హాల్లో పులివెందుల కౌన్సిలర్ కోళ్ల భాస్కర్ కూతురి వివాహానికి హాజరవుతారు. ► మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రొద్దుటూర్‌లో కొవ్వూరు రామసుబ్బారెడ్డి కల్యాణమండపంలో జరిగే వినోద్ కుమార్ రెడ్డి మ్యారెజ్ రిసెప్షన్ కు హాజరవుతారు. ► సాయంత్రం 4 గంటలకు కొండారెడ్డిపల్లికి చేరుకుని అక్కడి సర్పంచ్ శివ ప్రసాద్ రెడ్డి కుమారుడు నారాయణ రెడ్డిని వైఎస్ జగన్ అశ్వీరదీస్తారు. రెండో రోజు పర్యటన (డిసెంబర్ 25, 2015) ► ఉదయం 8.30 గంటలకు పులివెందుల చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు ►ఉదయం 11 గంటలకు పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకుంటారు ► సాయంత్రం 5.30 లకు పులివెందులలోని అంకాలమ్మ గుడి సమీపంలో ఉన్న దివంగత జయ లక్ష్మి టీచర్ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ► సాయంత్రం 6 గంటలకు పులివెందులలోని అంకాలమ్మ గుడి వద్ద పీరవళ్లి (తండ్రి గంట మస్తానాయ్య) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మూడో రోజు పర్యటన (డిసెంబర్ 26, 2015) ► ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని పాల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పెండ్లూరి ఈశ్వరరెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి వివాహానికి హాజరవుతారు. ► ఉదయం 9 గంటలకు తొందూరు శివాలయంలో జరిగే గంగరాజు వివాహానికి హాజరవుతారు. ► ఉదయం 10 గంలకు భద్రంపల్లికి చేరుకుని అక్కడి అరుణ్‌కాంత్ రెడ్డి, రామ్ మెహన్ రెడ్డి, చిన్న కేశవరెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు. ► ఉదయం 11 గంలకు లింగాల మండలంలోని అంకెవానిపల్లిలో శ్రీ వీరా చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు ► మధ్యాహ్నం 12 గంలకు పులివెందులలోని తన నివాసంలో వైఎస్ జగన్ భోజనం చేస్తారు. ► మధ్యాహ్నం 2 గంలకు చక్రాయపేట మండలం మారెళ్ల మాదాకలో ఇటీవల పెళ్లిచేసుకున్న రామాంజనేయ రెడ్డి నివాసానికి వెళ్లి అభినందిస్తారు. ► మధ్నాహ్నం 3 గంలకు సిద్ధారెడ్డిపల్లిలో చక్రాయపేట మండలంలో మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి ఇటీవల పెళ్లైన ఆయన కుమారుడు బయా రెడ్డిని అభినందిస్తారు. అనంతరం దివంగత లక్ష్మి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను, దివంగత రైతు శ్రీ మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాల్గో రోజు పర్యటన (డిసెంబర్ 27, 2015) ► ఉదయం 9 గంటలకు వెంపల్లిలో జెడ్పీటీసీ షబ్బీర్ వివాహానికి హాజరవుతారు.