IIM Bangalore
-
ఎటు చూసినా జాబులే! 2రోజుల్లో క్యాంపస్ ఖాళీ..ప్లేస్మెంట్లో విద్యార్ధుల జాక్ పాట్!!
పెరిగిపోతున్నటెక్నాలజీ కారణంగా ఉద్యోగులు అవసరం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేందుకు క్యాంపస్ ప్లేస్ మెంట్ నిర్వహించి ఊహించిన దానికంటే ఎక్కువ జీతాలిచ్చి మరి ఫ్రెషర్స్ ను ఎంపిక చేసుకుంటున్నాయి. ►తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు (ఐఐఎం-బీ) రెండు రోజుల పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూల్లో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు జాక్ పాట్ కొట్టారు. ఏకంగా 662 మంది విద్యార్ధులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించినట్లు ఐఐఎం-బీ ప్రతినిధులు తెలిపారు. ►క్యాంపస్ సెలక్షన్లలో యాక్సెంచర్ కు 51, అమెజాన్31, బీసీజీ 30, కెర్నీలో 27 మంది విద్యార్ధులు ఉద్యోగం సంపాదించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉద్యోగం పొందడంలో 37 శాతం వృద్ధి సాధించారు. అందులో కన్సల్టింగ్, ప్రొడక్ట్ సంబంధిత రంగాలు ఉండగా..స్ట్రాటజీ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగం చేసేందుకు విద్యార్ధులు మక్కువ చూపుతున్నారు. ఆ తర్వాత ప్రొడక్ట్ నిర్వహణ, ఫైనాన్స్ విభాగాలు ఉన్నాయి. ►కన్సల్టింగ్ కంపెనీలు 248 ఆఫర్లను అందించాయి. యాక్సెంచర్,బీసీజీ, కెర్నీ కాకుండా, బైన్ అండ్ కో 26, మెకిన్సే అండ్ కో 22 , ఎఫై9, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ 9, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 9, ల్వారెజ్ అండ్ మార్సల్ 7, ఆర్థర్ డీ. లిటిల్ 7 మంది ఆయా కంపెనీల్లో ఉద్యోగం సంపాదించారు. ►ఐటీ, ప్రొడక్ట్ డొమైన్లో మైక్రోసాఫ్ట్ 15, ఓయో 11 ఉద్యోగాలతో పాటు మిగిలిన కంపెనీల్లో 141 మంది ఉద్యోగం పొందగా అమాగి ల్యాబ్స్ 7, ఒరాకిల్ 7, అట్లాసియన్ 6, గూగుల్ 6, ఇన్ఫో ఎడ్జ్ 6, రేజర్‌పే 6కు మంది ఎంపికయ్యారు. ►అమెజాన్ 37, పేటీఎం 16, ఫ్లిప్‌కార్ట్ 6, మిత్రా 6తో పాటు ఇతర ఈకామర్స్ కంపెనీల్లో 65 మంది ఎంపిక కాగా ఫైనాన్స్ డొమైన్లో 71 ఆఫర్లను అందుకున్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ గరిష్టంగా 22 ఆఫర్ అందుకోగా అవెండస్ క్యాపిటల్ 7, సిటీ బ్యాంక్ 5, డ్యుయిష్ బ్యాంక్ లో 5 మంది ఎంపికయ్యారు. చదవండి: బంపరాఫర్!! మీ కోసమే..ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఊహించని శాలరీలు!! -
బెస్ట్ బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్ గా స్థానం సంపాదించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగుళూరు ఉన్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ర్యాంకింగ్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాలు ఆసియాలోనే ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ యేడాది సర్వేలో మొత్తం 104 బిజినెస్ స్కూల్స్ పాల్గొన్నాయి. గత యేడాది అంతర్జాతీయంగా 28వ స్థానంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్స్ ఈ యేడాది కొంత మెరుగై ఐఐఎం అహ్మదాబాద్ 21వ ర్యాంకులోనూ, ఐఐఎం కలకత్తా 23 ర్యాంకులోనూ నిలిచాయి. ఎఫ్‌టి ర్యాంకింగ్ 2018 ఆసియాలోనే టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్... 1. షాంఘై జియాఓ టాంగ్ యూనివర్సిటీ, ఆంటాయ్ – చైనా 2. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ – ఇండియా 3. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా – ఇండియా 4.స్కేమ బిజినెస్ స్కూల్ – చైనా 5. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు – ఇండియా 6. టోంగ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ మనేజ్మెంట్ – చైనా 7. గ్రేనోబెల్ ఎకోల్ డి మేనేజ్మెంట్ – సింగపూర్ 8. ఐక్యూఎస్–ఎఫ్జెయు–యుఎస్ఎఫ్ – తైవాన్ 9. హల్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ – చైనా 10. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, లీ కాంగ్ చైనా– సింగపూర్. రెండు వేర్వేరు అధ్యయనాలను అనుసరించి బిజినెస్ స్కూల్స్‌కి ఈ ర్యాంకులు ఇచ్చారు. ఒకటి బిజినెస్ స్కూల్స్ నిర్వహించే అధ్యయనం అయితే, మరొకటి 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల అధ్యయనం ద్వారా కేటాయించే ర్యాంకులు. 2015 పూర్వ విద్యార్థుల సర్వే ప్రకారం వివిధ బిజినెస్ స్కూల్స్‌లో బోధించే సబ్జెక్టులఅనుసారం ఎకనామిక్స్ బోధనలో నంబర్ వన్ ర్యాంకునీ, ఫైనాన్స్ సబ్జెక్టు బోధనలో ఏడవ ర్యాంకునీ ఐఐఎం కలకత్తా కైవసం చేసుకుంది. టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్‌లో బోధించే వివిధ సబ్జెక్టుల ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు. విద్యాబోధన, వసతులు, స్పోర్ట్స్ తదితర అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం వల్ల అత్యధిక మంది విదేశీ విద్యార్థులను ఈ యూనివర్సిటీలు ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల కోసం (సెమ్స్, ఐఎస్‌సిపి(యూరప్)తో సంయుక్తంగా నిర్వహిస్తోన్న డబుల్ డిగ్రీ కార్యక్రమాలు విద్యాప్రమాణాలు పెంచడానికి దోహదపడుతున్నాయి. దీంతో పాటు ప్రపంచప్రసిద్ధ యూనివర్సిటీలతో కలిసి చేస్తోన్న స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రాం కూడా ఈ విజయానికి కారణం. ప్రస్తుతం ఐఐఎం కలకత్తా మరో 100 బిజినెస్ స్కూల్స్‌తో కలిసి స్టుడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమం ప్రతియేటా నిర్వహిస్తోంది. 2017–18లో ఐఐఎం కలకత్తా నుంచి 133 మంది విద్యార్థులు స్టూడెంట్ ఎక్చేంచ్ కార్యక్రమంలో భాగమయ్యారు. భాగస్వామ్య స్కూల్స్ నుంచి 87 మంది విద్యార్థులు ఐఐఎం కలకత్తా లో అధ్యయనం చేసినట్టు వెల్లడించారు. -
భారతీయుడికి ఆర్కిటెక్చర్ ‘నొబెల్ ’..!
నిర్మాణ, వాస్తు శాస్త్ర రంగం (ఆర్కిటెక్చర్) లో నోబెల్ బహుమతి అంత స్థాయిగా పరిగణించే ప్రిజ్కర్ అవార్డును ఇటీవల టోరొంటోలో 91 ఏళ్ల ప్రొ. బాల్కృష్ణ విఠల్దాస్ దోషి అందుకున్నారు. ఆర్కిటెక్టులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ గౌరవాన్ని సాధించిన తొలి భారతీయుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆర్కిటెక్చర్ రంగంలో కృషి చేస్తున్న ఆయన తనదైన సొంత శైలితో పొందిన గుర్తింపుతో దక్షిణాసియాలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్‌గా పేరుగడించారు. 1989లో ఇండోర్‌లోని ‘అరణ్య లోకాస్ట్ హౌసింగ్ డెవలప్మెంట్’ ప్రాజెక్టు’ కోసం జోషి రూపొందించిన డిజైన్‌కు ఆగాఖాన్ అవార్డ్ ఫర్ ఆర్కిటెక్చర్ అవార్డు లభించింది. వివిధ సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వచ్చేలా అల్పాదాయ వర్గాలు మొదలు ఇతర వర్గాల వారి కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల మంది లబ్దిపొందారు. రాయల్ ఇనిసిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెక్ట్స్ ఫెలోగా ఉన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిసిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) డిజైన్లు ఇప్పటికీ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, టెక్నాలజీ, టాగోర్ మెమోరియల్ హాల్, ద ఇనిసిట్యూట్ ఆఫ్ ఇండోలజీ డిజైన్లకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తాను ‘వాస్తు శిల్ప’ పేరిట అహ్మదాబాద్‌లో ప్రారంభించిన కన్సల్టెన్సీ సంస్థలో దోషి నేటికి చురుకుగా పనిచేస్తున్నారు. జీవనసాఫల్య పురస్కారం... ‘ఈ అవార్డును అందుకోవడం అత్యంత సంతృప్తి కలిగించింది. జీవితంలో ఇలాంటి పురస్కారం వస్తుందని ఊహించలేము. ఇంత కంటే ఇంకా ఏమి కోరుకోవాలి ?ఈ వయసులో ఇలాంటి అవార్డును స్వీకరించడం ఎంతో సాధించామన్న అనుభూతిని కలిగిస్తోంది’ అంటూ ఈ అవార్డును అందుకున్నారు. ‘ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో పట్టణీకరణ, ప్రణాళికలు, గ్రామీణాభివృద్ధి, ఆర్థికరంగం, ఉపాధి వంటి కీలక అంశాల గురించి చర్చిస్తున్నాం. వీటి గురించి ఇతర దేశాలు ఎప్పుడో ఆలోచించి, మార్గదర్శకత్వంతో ముందుకెళ్లాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు దేశీయ ఆర్కిటెక్టులను (అన్నింటికి విదే«శీ ఆర్కిటెక్టులపైన ఆధారపడకుండా) కూడా విశ్వాసంలోకి తీసుకుని, వారిని ప్రజల అవసరాల కోసం పనిచేసేలా చేయాలి’ అని దోషి సూచించారు. ఆ డిజైన్లు జ్ఞాపకాల దొంతరలు... 1927 ఆగస్టు 26న పుణెలో జన్మించారు. ఫర్నీచర్ తయారీ, అమ్మకం వ్యాపార కుటుంబానికి చెందిన ఆయన అనుకోకుండా ఆర్కిటెక్చర్ రంగంలోకి అడుగుపెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించిన కాలంలో జోషి ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సృజనాత్మక ఆర్కిటెక్ట్ చార్లస్ ఎడ్వర్డ్ జీనెరెట్ ( లే కోర్బుసియర్గా ప్రసిద్ధులు) ఆయన గురువుగా పరిగణిస్తారు. తన వినూత్న డిజైన్లతో ఆధునిక నగరాలుగా ఛండీగఢ్, అహ్మదాబాద్‌లను తీర్చిదిద్దిన కోర్బుసియర్కు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ‘ ఒకే కన్మని’ తమిళ సినిమా, ‘ఒకే జాను’ పేరిట తీసిన హిందీ రీమేక్‌లోనూ ఆయన నటించారు. దోషి ముఖ్యమైన భవనాల్లో కొన్ని... –1969–71లో హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) టౌన్షిప్ –1979–80 అహ్మదాబాద్‌లో బీవీ దోషి కార్యాలయం ‘సంగత్’ –1972లో అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్లానింగ్ టెక్నాలజీ –1962–74 మధ్యలో బెంగళూరులోని ఇండియన్ ఇనిసిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ –1989 ఢిల్లీలోని నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ –1990 అహ్మదాబాద్‌లో అమ్దావద్ ని గుఫా (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఐఐఎం బెంగళూర్‌కు ఆఫర్ల వెల్లువ
సాక్షి, బెంగళూర్ : ఐఐఎం బెంగళూర్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటింది. 2016-18 పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో అభ్యర్థులకు పలు కంపెనీల నుంచి హాట్ ఆఫర్లు అందాయి. 420 మంది గ్రాడ్యుయేట్లకు గాను 140కి పైగా దేశ, విదేశీ కంపెనీలు 462 ఆఫర్లతో ముంచెత్తాయి. ప్లేస్మెంట్సలో తొలిరోజు ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఆకర్షణీయ ప్యాకేజ్లతో కూడిన ఆఫర్లు లభించాయి. గోల్డ్‌మాన్ శాక్స్ 9 ఆఫర్లను అందచేయగా, డచ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, బ్లాక్‌స్టోన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజాలు పలు ఆఫర్లను అభ్యర్ధుల ముందుంచాయి. ఇక అంబిట్ కాపిటల్, అర్ప్వుడ్ కాపిటల్, మైంత్రా, 03 సెక్యూరిటీస్, సాబ్రే పార్టనర్స్, యైట్ కాపిటల్ వంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు పలువురిని రిక్రూట్ చేసుకున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లూ ప్లేస్‌మెంట్స్‌లో పలువురిని హైర్ చేశాయి. కన్సల్టింగ్ కంపెనీల నుంచి డెలాయిట్ 18 ఆఫర్లతో టాప్‌లో నిలవగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 17 ఆఫర్లు, యాక్సెంచర్ స్ర్టేటజీ 14 మంది అభ్యర్థులకు ఆఫర్లు అందించింది. టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థలు ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్, యాక్సెంచర్ టెక్నాలజీ, కాగ్నిజెంట్ కన్సల్టింగ్లు పలువురిని రిక్రూట్ చేసుకున్నాయి. -
బెంగళూరు ఐఐఎం కోర్సులకు టాప్ ర్యాంకు
బెంగళూరు: బెంగళూరు ఐఐఎం నిర్వహిస్తున్న మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మధ్య ఆసియాలో టాప్ ర్యాంకు దక్కింది. పారిస్ కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎడ్ యూనివర్సల్ నిర్వహించిన అధ్యయనంలో బెంగళూరు ఐఐఎం నిర్వహిస్తున్న మూడు కోర్సులు బెస్ట్ కోర్సులుగా ఎంపికయ్యాయి. మేనేజ్ మెంట్ లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, పబ్లిక్ పాలసీలో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఏడాది ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోర్సులు టాప్ ర్యాంకులో నిలిచాయి.