సాక్షి, బెంగళూర్ : ఐఐఎం బెంగళూర్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటింది. 2016-18 పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో అభ్యర్థులకు పలు కంపెనీల నుంచి హాట్ ఆఫర్లు అందాయి. 420 మంది గ్రాడ్యుయేట్లకు గాను 140కి పైగా దేశ, విదేశీ కంపెనీలు 462 ఆఫర్లతో ముంచెత్తాయి. ప్లేస్‌మెంట్సలో తొలిరోజు ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఆకర్షణీయ ప్యాకేజ్‌లతో కూడిన ఆఫర్లు లభించాయి. గోల్డ్‌మాన్ శాక్స్ 9 ఆఫర్లను అందచేయగా, డచ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్, బ్లాక్‌స్టోన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజాలు పలు ఆఫర్లను అభ్యర్ధుల ముందుంచాయి.
ఇక అంబిట్ కాపిటల్, అర్ప్‌వుడ్ కాపిటల్, మైంత్రా, 03 సెక్యూరిటీస్, సాబ్రే పార్టనర్స్, యైట్ కాపిటల్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు పలువురిని రిక్రూట్ చేసుకున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లూ ప్లేస్‌మెంట్స్‌లో పలువురిని హైర్ చేశాయి. కన్సల్టింగ్ కంపెనీల నుంచి డెలాయిట్ 18 ఆఫర్లతో టాప్‌లో నిలవగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 17 ఆఫర్లు, యాక్సెంచర్ స్ర్టేటజీ 14 మంది అభ్యర్థులకు ఆఫర్లు అందించింది. టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థలు ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్, యాక్సెంచర్ టెక్నాలజీ, కాగ్నిజెంట్ కన్సల్టింగ్‌లు పలువురిని రిక్రూట్ చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment