వచ్చే సంవత్సరం నుంచే ఏపీలో ఐఐఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఏపీతో పాటు ఒడిషా, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్తగా ఐఐఎంలను కేటాయించారు. ఈ అన్నిచోట్లా కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఐఐఎంలు ప్రారంభం కానున్నాయి.