IIT campus
-
సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఐఐటీ, ఢిల్లీ క్యాంపస్‌లు
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు సరిహద్దులు చెరిపేసేందుకు రెడీ అవుతున్నాయి. విదేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ రెండు దేశాలతో మొదలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ విదేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనుంది. ఈజిప్టు, సౌదీ అరేబియాలలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వాలతో దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొలిక్కి వస్తే త్వరలోనే ఆ రెండు దేశాల్లో ఐఐటీ క్యాంపస్‌లు అందుబాటులోకి రానున్నాయి. బాధ్యతలు ఇలా విదేశాల్లో నెలకొల్పే ఇంజనీరింగ్ క్యాంపస్‌లు పూర్తిగా ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు అందించే నిధులతోనే రన్ అవుతాయి. అయితే అఫిలియేషన్, సిలబస్, జాయినింగ్ తదితర విషయాల్లో ఐఐటీ ఢిల్లీ బాధ్యత తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న జేఈఈ కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులు మొదటి ఏడాది ఢిల్లీ క్యాంపస్‌లో చదివిన తర్వాత రెండో ఏడాది ఆయా దేశాల్లో ఉన్న క్యాంపస్‌లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంది. కొత్త పేరుతో మన దేశంలో ఇంజనీరింగ్ డిగ్రీ నాలుగేళ్ల కోర్సుగా ఉంది. బీఈ లేదా బిటెక్ పేరుతో పట్టాలు ఇస్తున్నారు. విదేశీ క్యాంపస్‌లో అందించే కోర్సు బీఈ/బీటెక్ కాకుండా మరో కొత్త పేరు పెట్టే యోచనలో ఉన్నారు. గతంలో మారిషస్‌లో క్యాంపస్ తెరిచేందుకు ప్రయత్నాలు కొనసాగినా చివరి నిమిషంలో విరమించుకున్నారు. విదేశాల్లో ఐఐటీ క్యాంపస్‌లకు సంబంధించిన సమాచారం ఓ జాతీయ మీడియాలో వచ్చింది. ఎన్నారైలకు లాభం యూరప్, అమెరికాలను మినహాయిస్తే మిగిలిన దేశాల్లో విద్యాప్రమాణాలు ఉన్నత స్థాయిలో లేవు. ఈజిప్టు, సౌదీ అరేబియాలలో క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తే ఆయా దేశాల్లో ఉన్న విద్యార్థులతో పాటు ఎన్నారైలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియాలో ప్రీమియం ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరున్న ఐఐటీలకు గ్లోబల్ గుర్తింపు తెచ్చే లక్ష్యంతో ఈ విదేశీ క్యాంపస్ ఐడియాను తెర మీదకు తెచ్చారు. చదవండి:ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులు.. -
తెలంగాణకు ఐఐఐటీ
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్ఆర్డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. వాస్తవానికి కర్ణాటకలోని బెంగళూరులో ఐఐఐటీ ఉంది. దీనికి అదనంగా ఆ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతమైన రాయచూర్‌కు కేంద్ర ప్రభుత్వం మరో ఐఐఐటీని మంజూరు చేసింది. అయితే అక్కడ ఐఐఐటీ విద్యా సంస్థకు భూమి కేటాయించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైంది. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామని హెచ్ఆర్డీశాఖ ముందే సమాచారం ఇచ్చినా కర్ణాటక సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అదునుగా తీసుకొని రెండో ఐఐఐటీకి వెంటనే స్థలం కేటాయిస్తే రాయచూర్‌కు మంజూరు చేసిన ఈ సంస్థను తెలంగాణకు తరలించే అవకాశం లేకపోలేదని హెచ్ఆర్డీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మంజూరు చేసిన ఐఐఐటీ ఏర్పాటుకు కర్ణాటక తగిన చర్యలు తీసుకోలేకపోయిందని, ఆ కారణంగానే ఈ క్యాంపస్‌ను సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణానికి తరలించాల్సి వచ్చిందని ఆ అధికారి చెప్పారు. అయితే తెలంగాణకు తరలించిన ఐఐఐటీని తాము వెనక్కి తెప్పించుకుంటామని కర్ణాటక బీజేపీ నేతలు అంటున్నారు. -
సాంకేతిక సొబగులు
సాక్షి, వనపర్తి : ఎన్నో దశాబ్దాలుగా విద్యాపర్తిగా కొనసాగుతున్న వనపర్తి కీర్తిసిగలో మరో నగ చేరనుంది. జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల నివేదిక సమర్పించినట్లు తెలిసింది. వనపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే సంకల్పంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయించింది. పరిశీలనకు కమిటీని నియమించగా వనపర్తిలో ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. గ్రామీణ విద్యార్థులకు వరం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో బాసరతో పాటు ఇడుపులపాయ, నూజివీడులో మూడు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు. 2017లో అనంతపురం జిల్లాలో మరొకటి నెలకొల్పారు. ఈ మేరకు తెలంగాణలో సైతం మరో మూడు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని భావించారు. ఈ క్రమంలోనే వనపర్తిలో ఒకటి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తిలో అనుకూల పరిస్థితులు ఉన్నత స్థాయి విద్యామండలి, సాంకేతిక విద్యామండలి, బాసరలోని ఐఐఐటీ కళాశాల బృందం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ కళాశాల ప్రిన్సిపాల్ సాయిబాబారెడ్డి, ఓయూ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించి ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సానుకూల పరిస్థితులను పరిశీలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని భావించింది. ఈ మేరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు ప్రాంతాలను రెండు పర్యాయాలు సందర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వనపర్తిలో 1951లో మొట్టమెదటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పగా విద్యాపరంగా ఈ ప్రాంతానికి మంచిపేరుంది. 44వ జాతీయ ప్రధాన రహదారికి 14 కి.మీ దూరంలో ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సానుకూల పరిస్థితులను పరిశీలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని భావించింది. ఈ మేరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు ప్రాంతాలను రెండు పర్యాయాలు సందర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వనపర్తిలో 1951లో మొట్టమెదటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పగా విద్యాపరంగా ఈ ప్రాంతానికి మంచిపేరుంది. 44వ జాతీయ ప్రధాన రహదారికి 14 కి.మీ దూరంలో ఉండి రోడ్డు సౌకర్యం బాగా ఉండటం, శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 120 కి.మీ దూరంలో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధ్యాపకులకు సులువుగా ఉంటుందని భావించి కమిటీ వనపర్తి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 50శాతం పూర్తయిన ప్రక్రియ తెలంగాణలోని తూర్పు జిల్లాలైన వరంగల్ లేదా ఖమ్మంలో మరొకటి, పశ్చిమ జిల్లాలైన మెదక్ లేదా నిజామాబాద్‌లో ఇంకొకటి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. వనపర్తిలో బాసర స్థాయిలో ట్రిపుల్ ఐటీని నిర్మించాలంటే సుమారు రూ.700కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడంతో 50శాతం ప్రక్రియ ముగిసినట్లయింది. రాష్ట్ర విద్యాశాఖ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇందతా జరగడానికి మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరమే నుంచే వనపర్తిలో తరగతులు ప్రారంభించాలని యోచించినా మొత్తం ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 2019– 2020 విద్యాసంవత్సరంలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థలసేకరణ పూర్తి ట్రిపుల్ టీ ఏర్పాటుకు పక్కా భవనాల నిర్మాణం జరగాలంటే రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, అప్పటివరకు పాలిటెక్నిక్ కళాశాలలోని గదులను పరిశీలించిన బృందం చిన్న చిన్న మరమ్మతులు చేపడితే పక్కా భవనాలు నిర్మించే వరకు ఇక్కడే తరగతులు కొనసాగించవచ్చనే భావనకు వచ్చింది. పక్కా భవనాల నిర్మాణం, క్యాంపస్ కోసం సుమారు 250ఎకరాల స్థలం అవసరం ఉంటుందని కమిటీ సూచించింది. ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత భవనం, ఎస్పీ కార్యాలయం సమీపంలోని సర్వేనంబర్ 200లో 200 ఎకరాల స్థలం ఉందని కలెక్టర్ శ్వేతామహంతి నివేదిక ఇచ్చారు. అవసరమైతే మరో 50ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించి ఇస్తామని ఆమె వెల్లడించారు. -
‘నారాయణ’ విద్యార్థుల తిరుగుబాటు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు మంగళవారం రాత్రి తిరుగుబాటు చేశారు. భోజనం, సౌకర్యాలు సరిగా లేవంటూ హాస్టల్ విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. భవనం కిటికీల అద్దాలు పగులగొట్టారు. తరగతి గదులతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. హాస్టల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటున్నట్లు సమాచారం. తమ విద్యార్థుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందని, ఎవరూ కలుగజేసుకోవద్దని యాజమాన్య ప్రతినిధులు పేర్కొనడంతో.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు సైతం బయటే గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. తమ తల్లిదండ్రులు రూ.వేలకువేలు ఫీజులు చెల్లిస్తున్నా యాజమాన్యం మాత్రం తమకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందంటూ విద్యార్థులు ఆగ్రహంతో పెద్దగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకోవడాన్ని గమనించిన యాజమాన్య ప్రతినిధులు విద్యార్థుల నోరు నొక్కేందుకు విఫలయత్నం చేశారు. టూ టౌన్ ఎస్సైలు కె.పార్థసారథి, నాగరాజు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్య ప్రతినిధులతో చర్చించారు. ఫిర్యాదు అందకపోవడంతో వారు కూడా వెనుదిరిగారు. ఈ ఘటనతో నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
ఖమ్మం నుంచి కాలిఫోర్నియాకు..
ఐఐటీల్లో చేరితే కార్పొరేట్ కొలువు ఖాయం. కళ్లు చెదిరే మొత్తాల్లో జీతాలు సొంతం. అనేది నిస్సందేహం. మరోసారి ఇదే నిరూపితమవుతోంది. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో విద్యార్థులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్న పే ప్యాకేజీలే ఇందుకు నిదర్శనం. ఇదే క్రమంలో ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో బీటెక్ సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న ఖమ్మంకు చెందిన ఊట్ల హరీశ్ చంద్ర కూడా 56 లక్షల వార్షిక ప్యాకేజ్‌తో సిస్కో సిస్టమ్స్ - కాలిఫోర్నియాలో కొలువు సొంతం చేసుకున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ సమయంలో ఐఐటీ క్యాంపస్‌లలో సందడి గురించి వివరాలు ఆయన మాటల్లోనే... లక్ష్యం నెరవేరింది సిస్కో సిస్టమ్స్‌లో కొలువు ఖాయం కావడం.. అందులోనూ అంతర్జాతీయ ఆఫర్‌తో కాలిఫోర్నియాలోని సంస్థ హెడ్ ఆఫీస్‌లో పనిచేసే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. నాలుగేళ్ల క్రితం ఐఐటీ-జేఈఈలో 487వ ర్యాంకుతో ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో బీటెక్ సీఎస్ఈలో చేరాను. ఆ లక్ష్యం నెరవేరినట్లు, మూడున్నరేళ్లపాటు పడిన శ్రమకు గుర్తింపుగా భావిస్తున్నాను. డే-1 ఈవెనింగ్.. హ్యాపీ హ్యాపెనింగ్ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో రిక్రూట్మెంట్ డ్రైవ్ మొదలైన తొలిరోజు 27 కంపెనీలు వచ్చాయి. వాటి గురించి సమాచారం, జాబ్ పోర్ట్‌ఫోలియో, అర్హతల వివరాలపై క్యాంపస్ వర్గాలు ముందుగానే తెలియజేస్తాయి. విద్యార్థులు తమకు అర్హతలు, ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేసుకుంటారు. నేను కూడా సిస్కో సిస్టమ్స్ సహా మరో నాలుగు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాను. కానీ మిగతా మూడింటిలో అవకాశం కొద్దిలో చేజారింది. ఇక.. టెన్షన్ మొదలైంది. అయితే డే-1 ఈవెనింగ్ సెషన్లో సిస్కో సిస్టమ్స్ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నేనిచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందిన ప్రతినిధులు పే ప్యాకేజ్‌తో సహా అపాయింట్మెంట్ ఆఫర్ ఖాయం చేశారు. దీంతో అంతకుముందు నాలుగైదు రోజులుగా పడిన టెన్షన్ నుంచి బయటపడ్డాను. మూడు రౌండ్లలో ఇంటర్వ్యూ సిస్కో సిస్టమ్స్ ఇంటర్వ్యూ మూడు రౌండ్లలో జరిగింది. తొలి రెండు రౌండ్లు టెక్నికల్. వీటిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి, కోర్ బ్రాంచ్‌లో లేటెస్ట్ డెవలప్మెంట్స్, నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్ వివరాలపై ప్రశ్నించారు. చివరిదైన హెచ్.ఆర్.రౌండ్లో వ్యక్తిగత వివరాలు, లక్ష్యాలు, తమ సంస్థలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు అడిగారు. వీటికి కూడా సంతృప్తికరంగా సమాధానం ఇవ్వడంతో కొలువు ఖాయం చేశారు. 56 లక్షల ప్యాకేజ్ అని చెప్పారు. మిగతా ఇన్సెంటివ్స్ గురించి ఇంకా తెలియలేదు. ఇవి కూడా కలిపితే ఈ మొత్తం పెరగొచ్చు. జాబ్ రోల్ చెప్పలేదు ఇంటర్వ్యూ సమయంలోనే ఏ విభాగంలో పని చేయాలని ఉంది? అని అడిగితే అప్లికేషన్ డెవలప్మెంట్ అని చెప్పాను. ఇంకా జాబ్ రోల్‌పై స్పష్టత ఇవ్వలేదు. ఎలాంటి విభాగంలో పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇంకా చదవాలనుంది బీటెక్ చివరి సంవత్సరంలోనే కొలువు ఖాయమైనప్పటికీ.. ఉన్నత చదువులు చదవాలనుంది. వాస్తవానికి క్యాంపస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులను ఎంపిక చేసిన కొన్ని కంపెనీలు ఆ వెసులుబాటు కల్పిస్తాయి. సంస్థలో కొద్దిరోజులు పని అనుభవం గడించాక స్టడీ వెకేషన్‌కు అనుమతినిస్తాయి. సిస్కోలో ఆ అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలి. వచ్చే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి సంస్థలో చేరాల్సి ఉంటుంది. ఈ లోపే దీనిపై స్పష్టత పొందుతాను. ఉద్యోగంలో చేరాల్సి వచ్చినా.. ఉన్నత విద్య లక్ష్యాన్ని మాత్రం వదలను. బీటెక్‌తోనే అకడమిక్స్‌కు ఫుల్స్టాప్ పెట్టడం మంచిది కాదు కూడా! ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్వంటి లక్ష్యాలు ప్రస్తుతానికైతే లేవు. ఐఐటీ క్యాంపస్ డ్రైవ్స్.. ఇలా ఐఐటీ క్యాంపస్‌లలో రిక్రూట్మెంట్ డ్రైవ్స్ సందడి జూలై నుంచే మొదలవుతుంది. ఈ డ్రైవ్స్‌లో పాల్గొనే సంస్థలు అప్పటి నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు కూడా ఎలాంటి కంపెనీలకు సిద్ధమవ్వాలనే విషయంలోనూ స్పష్టత లభిస్తుంది. ఇక రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ప్రారంభం కావడానికి వారం పది రోజుల ముందు నుంచి క్యాంపస్‌లలో నెలకొనే సందడి ఎంతో. క్యాంటీన్స్, క్యాంపస్ కారిడార్స్, లంచ్ రూమ్స్.. ఎక్కడ చూసినా వచ్చే కంపెనీల గురించిన ముచ్చట్లే. గతంలో ఆ కంపెనీలు డ్రైవ్స్ నిర్వహించిన తీరుతెన్నులు తెలుసుకునేందుకు, సీనియర్లు, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్స్‌ను వాకబు చేయడం వంటివి సాధారణం. అసలు ప్రక్రియ మొదలైనప్పుడైతే విద్యార్థుల్లో ఎంతో టెన్షన్ కనిపిస్తుంది. ఒకవైపు ఇంటర్వ్యూలలో విజయం సాధించిన విద్యార్థులను చూస్తూ.. మరోవైపు తమకెలాంటి ఫలితాలు ఎదురవుతాయో అనే ఆందోళనతో ఉంటారు. సీఎస్ఈ, సాఫ్ట్వేర్ సంబంధిత బ్రాంచ్‌ల విద్యార్థులు ఫర్వాలేదు కానీ మిగతా బ్రాంచ్‌ల విద్యార్థుల్లో ఈ ఆందోళన మరింత ఎక్కువే. కారణం ఆయా బ్రాంచ్‌లకు సంబంధించిన కంపెనీలు సంఖ్య తక్కువగా ఉండటం. వచ్చిన కంపెనీలు తొలి రెండు, మూడు రోజుల్లోనే తగినవారిని ఎంపిక చేసుకోవడం. డ్రెస్ కోడ్ కంపల్సరీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొనే విద్యార్థులకు డ్రెస్‌కోడ్ తప్పనిసరి. బ్లేజర్స్, నెక్-టై, ఫార్మల్ షూస్ ధరించడం తప్పనిసరి. ఈ విషయంలోనూ ముందు నుంచే సిద్ధం కావాలి. లేదంటే ఒక్కసారి అలాంటి డ్రెస్‌లో ఇమడలేక నెర్వస్‌గా ఫీలవుతారు. ఇది ఇంటర్వ్యూలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్టార్టప్స్ ఆఫర్స్‌ను అంగీకరించడానికి కారణం ఇప్పుడు చాలామంది ఐఐటీయన్స్ స్టార్టప్ ఆఫర్స్‌ను అంగీకరిస్తున్నారు. పే ప్యాకేజ్‌ల పరంగానూ రాజీ పడి స్టార్టప్స్వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా పెట్టిన కంపెనీల్లో చేరితే పనితీరు ఆధారంగా తొందరగా ఉన్నత స్థానాలకు చేరుకుంటామనే ఆలోచనే ఇందుకు కారణం. కొలువులు ఖాయమే.. కానీ ఐఐటీల్లో చేరితే కార్పొరేట్ కొలువు ఖాయం అనేది నిస్సందేహం. కానీ.. ఆ కొలువులు, పే ప్యాకేజ్‌లు ఉన్నతంగా ఉండాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే పరిష్కారం. బ్రాండ్-ఐఐటీ పేరుతోనే కళకళలాడే కొలువులు సొంతమవుతాయనుకోవడం పొరపాటు. ఐఐటీ స్థాయి ఇన్స్టిట్యూట్ అయినా.. సాధారణ ఇన్స్టిట్యూట్ అయినా వచ్చిన కంపెనీల్లో ఉన్నత స్థానం పొందాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో సంపూర్ణ అవగాహన సొంతం చేసుకోవాలి. ప్రొఫెసర్లు, మెంటార్ల గెడైన్స్ కొంత మేరే ఉంటుంది. వారు.. నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉన్న అవకాశాలు, మార్గాల గురించి చెబుతారు. వాటిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. ఐఐటీల్లో సీటు లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తించాలి. ఐఐటీలో సీటు సొంతమయ్యే ర్యాంకు సాధించడం కంటే.. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి అనుసరించే తీరే భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ సస్టెయినబిలిటీకి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలి. -
ఐఐటీల్లో బీటెక్..బెస్ట్ బ్రాంచ్‌లు.. బెటర్ క్యాంపస్‌లు
జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంకులు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి హాజరైన లక్షన్నర మంది అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు సమయం (జూన్ 20 నుంచి 24 వరకు) సమీపించింది. అందుబాటులోని సీట్ల సంఖ్యతో పోల్చితే తుది విజేతలుగా నిలిచేది కొందరే. ఆ కొందరిలోనూ ఎన్నో సందేహాలు. ఏ ఐఐటీలో చేరితే మంచిది? ఏ బ్రాంచ్‌కు ఏ ఐఐటీ బెస్ట్? తదితర సందేహాలు తలెత్తడం సహజం. ఈ నేపథ్యంలో.. గతేడాది (2013లో) ఇన్స్టిట్యూట్లు, బ్రాంచ్‌ల వారీగా క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుంటే కొంతమేర అవగాహన పొందొచ్చు. వివరాలు.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లలో అత్యధికుల ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. గత కొన్నేళ్లుగా టాప్ ర్యాంకర్ల ఛాయిస్‌గా సీఎస్ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గతేడాది జనరల్ సహా అన్ని కేటగిరీల ర్యాంకర్లలో టాప్-10లోపు విద్యార్థులు సీఎస్‌ఈకే మొగ్గు చూపారు. ఇక ఇన్స్టిట్యూట్ పరంగా సీఎస్ఈ బ్రాంచ్‌కు టాపర్ల బెస్ట్ క్యాంపస్‌గా నిలుస్తోంది ఐఐటీ-బాంబే. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఆర్ అండ్ డీ ఒప్పందాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిరంతరం సిలబస్‌లో మార్పులు, చేర్పులు, పూర్వ విద్యార్థుల విజయాలు వంటివి ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. బీటెక్ కోర్సులో చేరే విద్యార్థి తాను ఎంచుకున్న బ్రాంచ్‌కు సంబంధించి కోర్సు ముగిసే సమయానికి అంటే నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు అవకాశాలను అంచనా వేసి ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో భవిష్యత్తు అవకాశాల పరంగా ఆందోళన అనవసరం. కంప్యూటర్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, వాటి అనువర్తన చేయడం, పనిచేసే రంగాన్ని బట్టి తదనుగుణమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్, అప్లికేషన్స్ రూపొందించడం వంటివి కంప్యూటర్ సైన్స్ నిపుణులు చేస్తారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటరీకరణ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. అవకాశాలు కోకొల్లలు. ఈ విభాగంలో అన్ని ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 923. ఎలక్ట్రికల్.. ఎవర్గ్రీన్ ఆధునికీకరణ, మౌలికసదుపాయాల కల్పన, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు దిశగా తీసుకుంటున్న చర్యల కారణంగా.. కోర్ సెక్టార్లో క్రేజీ బ్రాంచ్‌గా నిలుస్తోంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎన్నో రకాల విద్యుత్ ఉత్పత్తి మార్గాలు ప్రధానంగా అణు విద్యుత్ ఉత్పత్తి, సౌర విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లదే కీలక పాత్ర. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీలోనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల ప్రమేయం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవకాశాల పరంగానూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవర్గ్రీన్ బ్రాంచ్ అని పేర్కొనొచ్చు. అందుకే జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లలో రెండో ఛాయిస్‌గా ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గత ఏడాది ఏడో ర్యాంకు అభ్యర్థి ఐఐటీ-బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. అదేవిధంగా ఇతర ఐఐటీల్లోనూ ఓపెనింగ్ ర్యాంకుల పరంగా తొలి వందలోపు ర్యాంకర్ల ఛాయిస్‌గా నిలిచింది ఎలక్ట్రికల్. ఇన్స్టిట్యూట్ పరంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు కూడా ఐఐటీ-బాంబేనే క్రేజీ క్యాంపస్. క్లోజింగ్ ర్యాంకులే ఇందుకు నిదర్శనం. మొత్తం ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్బాద్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1070. మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటీల్లో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల ఆధారంగా గత నాలుగైదేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే.. ర్యాంకర్ల మూడో ముఖ్య ఛాయిస్‌గా నిలుస్తున్న బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ విషయంలోనూ ఐఐటీ-బాంబేకే ర్యాంకర్ల ప్రాధాన్యం. గతేడాది ఈ క్యాంపస్‌లో ఓబీసీ మినహాయించి అన్ని కేటగిరీల్లోనూ 50లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఓపెనింగ్ ర్యాంకులు మొదలవగా.. క్లోజింగ్ ర్యాంకుల విషయంలోనూ ఐదొందల లోపు ర్యాంకులతో సీట్లు భర్తీ అయ్యాయి. దేశంలో ఉత్పత్తి రంగం, ఆర్ అండ్ డీ కార్యకలాపాల విస్తరణ, ఆటోమొబైల్-మెకానికల్ రంగాల వృద్ధి తదితర కారణాలతో ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉండటంతో విద్యార్థు లు ఈ బ్రాంచ్‌ను ఎంచుకుంటున్నారు. మొత్తం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1125. కెమికల్ ఇంజనీరింగ్ పదకొండు ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్‌బాద్‌లలో 800 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పట్ల కూడా టాప్ ర్యాంకర్స్ ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా ఆయా ఐఐటీల్లోని ఓపెనింగ్ ర్యాంకుల కోణంలో పరిశీలిస్తే.. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్‌ల తర్వాత స్థానంలో నిలుస్తున్న బ్రాంచ్ ఇది. పారిశ్రామిక అభివృద్ధి, వివిధ ఉత్పత్తుల తయారీ, అందులో కెమికల్ ఇంజనీర్ల ప్రమేయం తప్పనిసరైన నేపథ్యంలో అవకాశాల విషయంలోనూ ఢోకాలేని బ్రాంచ్.. కెమికల్ ఇంజనీరింగ్. ఫార్మాస్యూటికల్ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ విభాగాలు, ఇతర రసాయన పరిశోధన సంస్థల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు అవకాశాలు ఖాయం. ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు కంపెనీల దృష్టిలో హాట్‌కేక్‌లుగా నిలుస్తున్నారు. సగటున రూ. 20లక్షలకుపైగా వార్షిక వేతనం ఖరారవుతోంది. సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో ఏళ్లుగా ఐఐటీ బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ఆసక్తి చూపుతున్న మరో కోర్ బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. పన్నెండు ఐఐటీలు, ఐఎస్ఎం-ధన్బాద్లో అందుబాటులో ఉన్న 891 సీట్ల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఐఐటీ-బాంబేలో గతేడాది ఓపెన్ కేటగిరీలో 400 ర్యాంకుకు తొలి సీటు లభించగా.. ఇదే విభాగంలో క్లోజింగ్ ర్యాంకు 1688గా నమోదవడమే ఇందుకు నిదర్శనం. రిజర్వ్డ్ కేటగిరీల్లో ఇంతకంటే తక్కువ ర్యాంకులో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులు ఉండటం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుండటం, జాతీయ రహదారుల విస్తరణ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం తదితర కారణాలతో సివిల్ ఇంజనీరింగ్ ఆకర్షణీయ బ్రాంచ్‌గా నిలుస్తోంది. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు కేరాఫ్‌గా నిలవనుంది. ప్రధానంగా 12వ ప్రణాళిక కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక కేటాయింపులు చేయడంతో పలు పథకాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్సులో చేరి.. నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్ అందుకునే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వేతనాల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ప్రైవేటు సెక్టార్‌తోపాటు, వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల్లోనూ సివిల్ ఇంజనీర్లకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే ఇంజనీరింగ్ ఫిజిక్స్ బ్రాంచ్‌పై కూడా ర్యాంకర్లలో ఆసక్తి నెలకొంది. కేవలం ఆరు ఐఐటీ క్యాంపస్‌లు(బాంబే, హైదరాబాద్, గువహటి, చెన్నై, ఢిల్లీ, వారణాసి) మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి. మొత్తం 198 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీ ఐఐటీలో 63 సీట్లు ఉండగా.. అత్యల్పంగా హైదరాబాద్ ఐఐటీలో 10 సీట్లు లభిస్తున్నాయి. ఐఐటీ-వారణాసిలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు అందుబాటులో ఉంది. భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలు.. అదే విధంగా మ్యాథమెటికల్ న్యూమరిక్స్ ఆధారంగా ఇంజనీరింగ్ ఉత్పత్తుల ప్రక్రియకు సంబంధించి శిక్షణ కల్పించే ఈ కోర్సు సైన్స్ ఔత్సాహిక విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. ఇంజనీరింగ్‌లో ఆర్ అండ్ డీ దిశగా లక్ష్యాలు ఏర్పరచుకున్న వారికి బాగా సరితూగే కోర్సు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అని నిపుణుల అభిప్రాయం. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఇస్రో, బార్క్, డీఆర్డీఓ వంటి పరిశోధన సంస్థల్లో ఉపాధి గ్యారంటీ. ఆసక్తి ఉంటేనే కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటీల్లో ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చినా బంగారు భవిష్యత్తు ఖాయం అనేది నిస్సందేహం. అయితే కొన్ని కోర్ బ్రాంచ్‌ల విషయంలో విద్యార్థుల ఆసక్తి మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధికశాతం ఓర్పు, నేర్పుతో ప్రయోగశాలల్లో నిరంతర పరిశోధనల్లో గడపాల్సిన కెమికల్ ఇంజనీరింగ్‌లో ఇది ఎంతో ముఖ్యం. కాబట్టి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో కోర్సు, క్యాంపస్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ప్రాధమ్యాలు పేర్కొనాలి. ప్రస్తుతం ఐఐటీల్లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సగటున రూ. 15 నుంచి రూ. 20 లక్షల వరకు వార్షిక వేతనంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు లభిస్తున్నాయి. అయితే కెమికల్ ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు బీటెక్ సర్టిఫికెట్‌తోనే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరిన్ని సమున్నత స్థానాలు సొంతం చేసుకోవాలి. - ప్రొఫెసర్॥వి.ఆర్. పెద్దిరెడ్డి, డీన్ (కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్), ఐఐటీ-భువనేశ్వర్ కొత్త ఐఐటీల్లో ముందంజలో హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం 2008లో ఏర్పాటు చేసిన కొత్త ఐఐటీల్లో.. ఇతర ఇన్స్టిట్యూట్లతో పోల్చితే ఐఐటీ-హైదరాబాద్ అకడెమిక్స్, రీసెర్చ్ అన్ని కోణాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. పాత ఐఐటీలతో పోటీ పడుతోంది. అకడెమిక్స్ కోణంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ వంటి ప్యూర్ కోర్ బ్రాంచ్‌లను సైతం ప్రారంభించింది. అటు రీసెర్చ్ పరంగానూ పలు అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్లు, పరిశ్రమలతో ఒప్పందాల ద్వారా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే ఐఐటీ ప్రవేశాల్లో ప్రత్యేకంగా స్థానిక కోటా అమలులో లేనందున ఇక్కడి విద్యార్థులు.. ఈ ఇన్స్టిట్యూట్లో గతంలో లభించిన ర్యాంకుల ఆధారంగా ప్రాధమ్యాలను పేర్కొనడం మంచిది. ఒకసారి ఐఐటీలో అడుగుపెట్టిన విద్యార్థులు.. నిరంతర అభ్యసనం, అన్వేషణలతో ముందుకు కదిలితేనే మంచి భవిష్యత్తు లభిస్తుంది. - ప్రొఫెసర్ ఫయాజ్ అహ్మద్ ఖాన్, డీన్, అకడెమిక్స్, ఐఐటీ-హైదరాబాద్ ఎన్నటికీ వన్నె తగ్గని కోర్ బ్రాంచ్‌లు ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు ముందుగా గుర్తించాల్సింది కోర్ బ్రాంచ్‌ల ప్రాధాన్యం. నేటి పోటీ ప్రపంచంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త బ్రాంచ్‌లు రూపొందుతున్నప్పటికీ.. వాటికి మూలం కోర్ బ్రాంచ్‌ల నుంచే మొదలవుతుంది. కాబట్టి విద్యార్థులు.. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ తదితర కోర్ బ్రాంచ్‌లవైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో.. వారి ఆసక్తికి అనుగుణంగా అనుబంధ స్పెషలైజేషన్లలో పీజీ, పీహెచ్‌డీలు చేసే అవకాశాలు ఉన్నాయి. పదివేల లోపులోనే ఉండే సీట్ల ఎంపిక క్రమంలో.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అభ్యర్థులు తమకు నచ్చిన ఇన్స్టిట్యూట్, బ్రాంచ్‌లకు గతంలోని చివరి ర్యాంకులను పరిశీలించి వాటిని తమ ప్రస్తుత ర్యాంకుతో బేరీజు వేసుకుని ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు ఉపక్రమించాలి. ప్రాధమ్యాల ఎంపిక విషయంలో ఎలాంటి పరిమితులు లేనందున దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. - ప్రొఫెసర్॥అశోక్ ఝున్‌ఝున్‌వాలా ప్రొఫెసర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఐఐటీ-మద్రాస్), ఐఐఐటీ-హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు. విభిన్న దృక్పథంతో అడుగు పెట్టాలి ఐఐటీల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే తమ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు స్పూన్ ఫీడింగ్ ద్వారా అకడెమిక్స్ను ఔపోసన పట్టిన విద్యార్థులు.. ఐఐటీల్లో చేరాక స్వీయ అభ్యసనం, రెగ్యులర్ నాలెడ్జ్ అప్డేషన్ చేసుకుంటూ ముందుకు సాగితేనే సంబంధిత బ్రాంచ్‌పై పట్టు లభిస్తుంది. అంతేకాకుండా విభిన్న సంస్కృతుల నుంచి వచ్చే సహచర విద్యార్థులతో, అదే విధంగా ఫ్యాకల్టీ సభ్యులతో మమేకమయ్యేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ఐఐటీల్లో నియమ నిబంధనలు.. తొలినాళ్లలో తాజా విద్యార్థులను కొంత ఆందోళనకు గురి చేస్తాయి. కానీ వాటికి భయపడకూడదు. తాము ఐఐటీలో చేరిన లక్ష్యాన్ని నిరంతరం స్ఫురించుకుంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇట్టే అధిగమించి.. అద్భుత ఫలితాలు సాధించొచ్చు. - ప్రొఫెసర్॥వి. రాజ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్-ఆర్జీయూకేటీ (మాజీ డీన్ అకడెమిక్ అఫైర్స్- ఐఐటీ ఖరగ్‌పూర్) బ్రాంచ్ ఏదైనా.. బాంబేకే ప్రాధాన్యం గత కొన్నేళ్లుగా ఐఐటీ ర్యాంకర్లలో అధికశాతం విద్యార్థులు ఆసక్తి చూపుతున్న ఇన్స్టిట్యూట్ ఐఐటీ-బాంబే. బీటెక్‌లో ఏ బ్రాంచ్ అయినప్పటికీ మెజారిటీ విద్యార్థుల ఓటు బాంబేకే ఉంటోంది. ఇందుకు ఎన్నో కారణాలు. ఇక్కడ పాటిస్తున్న అకడెమిక్ ప్రమాణాలు, నిరంతర ఆర్ అండ్ డీ, గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే రీసెర్చ్ ఓరియెంటేషన్ బోధన, పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడమే ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొనొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చేరే ప్రతిభావంతులైన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో రకాల స్కాలర్షిప్లను అందిస్తున్నారు. ఇలా.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అకడెమిక్స్‌లో నాణ్యతలే ఐఐటీ-బాంబేపై మెజారిటీ విద్యార్థుల ఆసక్తికి కారణం. - ప్రొఫెసర్॥కె.వి. కృష్ణారావు, సివిల్ ఇంజనీరింగ్, ఐఐటీ-ముంబై