IIT experts
-
పొంచివున్న ఫోర్త్ వేవ్ ముప్పు.. తస్మాత్ జాగ్రత్త అంటున్న నిపుణులు
శివాజీనగర: రాష్ట్రంలో అప్పుడే కరోనా నాలుగో వేవ్‌పై వేడి చర్చ మొదలైంది. అందుకు ప్రజలను జాగృతం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలో కోవిడ్ నాలుగో దాడి జూన్ ఆఖరి నుంచి ఆరంభమయ్యే అవకాశముందని కాన్పూర్ ఐఐటీ నిపుణులు పరిశోధనలో పేర్కొన్నారు, కానీ ఒక నెల ముందుగానే కరోనా వేవ్ రావచ్చునని ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. మంత్రి మాటలను బట్టి మే చివరి నుంచి కోవిడ్ పుంజుకోవచ్చని అంచనా. మంగళవారం ఆయన మాట్లాడుతూ జూన్ నెల తరువాత గరిష్ట స్థాయి చేరుకుని సెప్టెంబర్, అక్టోబర్ నెలవరకూ కొనసాగవచ్చని ఆ నివేదికలో నిపుణులు తెలిపారు. వారు గతంలో మూడు మూడు దాడుల గురించి ఇచ్చిన నివేదిక శాస్త్రీయంగా ఉందని అన్నారు. మే 16 నుంచి బడులు పునఃప్రారంభం వచ్చే జూన్, జులై నెలల్లో కోవిడ్ నాలుగో దాడి రావచ్చని చెబుతున్నారు. కానీ విద్యాలయాలు ముందే నిర్ధారించినట్లు మే 16 నుంచి మొదలవుతాయి, ఇందులో సందేహం లేదు అని ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రి బీ.సీ.నాగేశ్ తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో 85 కరోనా కేసులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 85 కరోనా పాజిటివ్ కేసులు, 70 డిశ్చార్జిలు నమోదయ్యాయి. 1,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 7,171 మందికి కరోనా పరీక్షలు చేశారు. బెంగళూరులో 82 కేసులు, 66 డిశ్చార్జిలు నమోదయ్యాయి. మరోవైపు బెంగళూరు మాస్క్ ధరించాలని బీబీఎంపీ మార్షల్స్ మైకుల ద్వారా కోరడం మొదలైంది. పలు రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్క్ ధరించండి అని మైకుల్లో ప్రచారం చేశారు. -
తిరుమలలో పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. గత శనివారంతో పెరటాశి శనివారాలు ముగిసినప్పటికీ ఈ శనివారం కూడా శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలి బాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి. కాలిబాట భక్తులు, సర్వదర్శనం భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండిపోయాయి. తిరుమల కొండచరియల్ని పరిశీలించిన ఐఐటీ నిపుణులు తిరుమల మొదటి, రెండో ఘాట్‌రోడ్లలో కొండచరియల్ని శనివారం చెన్నై ఐఐటి నిపుణులు ప్రొఫెసర్ కె.ఎస్.రావు నేతృత్వంలోని నిపుణుల బృందం పరిశీలించింది. కొంతకాలం నుంచి తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో తరచూ కొండచరియలు కూలుతున్నాయి. తాజాగా ఈనెల 13న కురిసిన వర్షానికి రెండోఘాట్తో పాటు మొదటి ఘాట్‌రోడ్డులోని అవ్వాచారి కోన ఎగువన భారీ స్థాయిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీన్ని నివారించే చర్యల్లో భాగంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు సూచనతో ఐఐటీ నిపుణులను ఆహ్వానించారు. ఆ మేరకు శనివారం నిపుణుల బృందం ఇంజనీర్లతో కలసి రెండు ఘాట్‌రోడ్లను పరిశీలించింది. -
స్కూళ్లలో నిపుణులతో బోధన!
- 6 నుంచి 10 తరగతులకు చేపట్టేందుకు చర్యలు - వివిధ రంగాల్లో నిపుణులతో విద్యా బోధన - ఇంటర్మీడియెట్‌లోనూ ఐఐటీ పాఠాలు - ఇంజనీరింగ్‌లో పారిశ్రామికవేత్తలతో పాఠాలు - వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో నిపుణులతో ఇక ప్రత్యక్ష విద్యా బోధన చేపట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాస్‌రూంలో వివిధ అంశాలకు సంబంధించిన ఆయా రంగాల్లోని నిపుణులను పిలిపించి విద్యార్థులకు బోధన చేపట్టనుంది. 2017–18 విద్యా సంవత్సరంలో దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒక తరగతిలో రాకెట్, అంతరిక్ష ప్రయోగం వంటి పాఠాలు ఉంటే ఆ పాఠాన్ని టీచర్‌తో చెప్పించడమే కాకుండా ఆయా రంగాలకు చెందిన నిపుణులను పిలిపించి బోధన నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కసరత్తు ప్రారంభించింది. 6 నుంచి 10వ తరగతి వరకు తరగతి వారీగా ఉన్న పాఠ్యాంశాలు, వివిధ రంగాలకు చెందిన పాఠాలను గుర్తించి ఆయా రంగాలకు సంబంధించి ఎవరెవరిని పిలిపించాలన్న అంశంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో కసరత్తు చేస్తోంది. ఆరోగ్యం వంటి పాఠాలు ఉన్న తరగతులకు ఓ డాక్టర్‌ను, భౌతిక శాస్త్రానికి సంబంధించి ఒక సైంటిస్ట్‌ను పిలిపించి పాఠాలు చెప్పించడం ద్వారా విద్యార్థుల్లో ఆయా అంశాలకు సంబంధించి అవగాహన ఏర్పడుతుందని భావిస్తోంది. ఇంటర్మీడియెట్‌లోనూ ఐఐటీ నిపుణులతో పాఠాలు చెప్పించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఐఐటీల కౌన్సిల్ కూడా ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటీ నిపుణులతో ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంజనీరింగ్‌లోనూ పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రముఖులతో పాఠాలు బోధించడం ద్వారా ఆయా రంగాలపై విద్యార్థులకు అవగాహన కలుగ డంతోపాటు పారిశ్రామిక రంగాలకు ఏ విధమైన అవసరాలు ఉంటాయో తెలుసుకునేందుకు వీలు ఏర్పడనుంది. బీటెక్ కోర్సులోనూ ఇండస్ట్రీ శిక్షణ కాలాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది.