IIT studens
-
కార్పొరేట్ కోళ్ల ఫారాల్లో రాలుతున్న మొగ్గలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?
👉ఐఐటీ లో సీట్ వచ్చిందంటే" లైఫ్" అనే సినిమా సూపర్ హిట్ అయినట్టేనని, మన దేశం లో కోట్లాది మంది పేరెంట్స్ నమ్ముతారు . 👉పరీక్ష రాసేది పన్నెండు లక్షల మంది .. చివరకు సీట్ సాధించేది 16 వేలమంది . 👉అంటే ఐఐటీ లో సీట్ కొట్టిన వారు త్రీ రోజెస్ టీ లాగ, "వేలాది లో ఒక్కరు" . ఐఐటీ లో విద్యా ప్రమాణాలు చాలా బాగుంటాయి. కోర్స్ పూర్తి చేస్తే భారీ శాలరీ ప్యాకేజీ తో మంచి ఉద్యోగం ఖాయం. మరి ఆత్మ హత్యలెందుకు ? ఏదో ఒకటి రెండు అయితే ఏదో అనుకోవచ్చు . ఐఐటీ చెన్నై లో గత రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు . అన్ని ఐఐటీలలో కలిపి నాలుగేళ్లలో నలబై దాకా !ఎందుకిలా ? 1 . ఐఐటీ ఫౌండేషన్ పేరుతో ఆరో తరగతి నుంచే పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తున్నారు. దీని వల్ల , వీరిలో గ్రోత్ హార్మోన్ లోపం; హ్యాపీ హార్మోన్స్ తగినంత ఉత్పత్తి కావు. విపరీతమైన ఒత్తిడి వల్ల కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల చిరాకు, అసహనం , నిద్ర లేమి , ఆత్మ న్యూనతా భావం, అభద్రత, కుంగుబాటు లాంటి నెగటివ్ మానసిక ఉద్వేగభావాలు కలుగుతాయి. ఒక అంచనా ప్రకారం IITలో చదివే విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు డిప్రెషన్ లాంటి మానసిక రోగాలతో బాధ పడుతున్నారు. 2. క్రీడలకు దూరం కావడం వల్ల క్రీడా స్ఫూర్తి కొరవడుతోంది. చిన్న సమస్యకు కుంగిపోతున్నారు ౩. తెలుగు, ఇంగ్లీష్, హిందీ.. ఈ సబ్జెక్టుల్లో అంతర్లీనంగా లైఫ్ స్కిల్స్ పాఠాలుంటాయి. IIT ఫౌండేషన్ లో కేవలం గణితం, భౌతిక శాస్త్రంపై దృష్టి నిలపడం జరుగుతోంది. కేవలం పరీక్ష కోసం తూతూ మంత్రంగా లిటరేచర్ అలాగే సోషల్ స్టడీస్ ను చదవక పోవడం వల్ల , ఇంగిత జ్ఞానం, సామజిక, భావోద్వేగ తెలివితేటలు లోపిస్తున్నాయి . పరిష్కారం : ✔️ప్రపంచం లో ఎన్నో ఉత్తమ విద్యా సంస్థలున్నాయి . వాటికీ ప్రవేశ పరీక్షలున్నాయి . ఆ పరీక్షల కోసం మహా అంటే ఆరు నెలలు ప్రిపేర్ అయితే సరిపోతుంది . చిన్నప్పటి నుంచి సంపూరణాత్మక విద్య పొందిన విద్యార్థులకు ఈ ప్రిపరేషన్ కూడా పెద్దగా అవసరం లేకుండా పోతుంది. ❌దీనికి భిన్నంగా IIT JEE పరీక్షను రూపొందించారు. ఏళ్ళ తరబడి గణితాన్ని భౌతిక శాస్త్రాన్ని చదివిన వారికి.. అది కూడా క్రీడలు అల్ రౌండ్ డెవెలప్మెంట్ లాంటి వాటిని పక్కన పెట్టి, కోచింగ్ కోళ్లుగా మారిన వారికి మాత్రమే, ఈ పరీక్ష లో విజయం దక్కేలా ఆ పరీక్షను డిజైన్ చేసారు. ఐఐటీ కోచింగ్ వేల కోట్ల ఇండస్ట్రీ. ప్రత్యక్ష పరోక్ష పాత్రధారులు ఎంతో మంది. లబ్ది దారులు ఎంతో మంది. ఏదో అద్భుతం జరిగితే తప్పించి వ్యవస్థ మారదు . ఆరో తరగతి నుంచే కోట్లాది పిల్లల బాల్యం బుగ్గి పాలవుతోంది. ఇంటర్ .. అది ముగిసాక పరీక్ష రాసేవరకు బతుకు పరమ దుర్భరం. బ్రిటిష్ కాలం నాడు పోర్ట్ బ్లెయిర్ లోని సెల్యూలర్ జైలు. నేడు కోట .. ఇంకా తెలుగు నాట కార్పొరేట్ కోళ్ల ఫారాలు. కోటలో కోటి కన్నీటి కథలు. తెలుగు నాట కోళ్ల ఫారాలలో ఎనెన్నో వ్యధలు. అర్జెంటు గా అమెరికాకు వెళ్ళిపోవాలి . అక్కడి డాలర్ లు ఇక్కడికి పంపిస్తే నాలుగు సైట్స్ కొనాలి. అందరితో గొప్పలు చెప్పుకోవాలి . అటు పై 65 వచ్చే వరకు రెండేళ్లకు ఒక సారి అక్కడికెళ్లి వచ్చి నలుగురికి కబుర్లు చెప్పాలి.. ఇదీ ఆలోచన ... .ఇదీ తీరు ఐఐటీ లో చేరొద్దన్నా ? అమెరికా కు వెళ్లొదనా ? ✔️కానే కాదు. ఐఐటీ లు ప్రపంచ స్థాయి సంస్థలు . ఉత్తమ విద్యా ప్రమాణాలు . ✔️అమెరికాకో మరో చోటుకు వెళ్లడం సహజం. మనది నేడు విశ్వ గ్రామం . రానున్నది రోబో యుగం . ❌అమెరికాకో మరో దేశానికి వెళిపోతేనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి .. అక్కడికి పొతే సమస్యలే ఉండవు అనుకోవడమే పెద్ద సమస్య . సమస్యలు లేని చోటు సమాధి ఒక్కటే .. సమస్యలు లేని జీవితం నరకం అని తెలుసుకోకపోవడం వీరి అజ్ఞానం. తాను సాధించలేని దాన్ని పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని అనుకోవడం. పిల్లల ఆప్టిట్యూడ్ పట్టించుకోక పోవడం. అన్నిటికీ మించి "కోచింగ్ కోసం .. కోచింగ్ ద్వారా ... కోచింగ్ మూలంగా" సాగే ఐఐటీ సీట్ ల భర్తీ ✔️ఐఐటీ లు సంతోష కర జీవనాన్ని సాగించడానికి ఒక మార్గం. ఎవరూ కాదనలేని సత్యం . కానీ ఐఐటీ లో సీట్ సాధించడమే జీవితం. ఆ ప్రయత్నం లో పిల్లల మానసిక శారీరిక ఆరోగ్యం ఎంత నాశనం అయినా ఫరవాలేదు అనుకొనే సగటు మధ్య తరగతి పేరెంట్ మనస్తత్వం మారనంత వరకు... ఇండియా లో బాల్యం శాపమే ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు చదవండి: మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం -
ముద్దు రచ్చ
ఐఐటీ విద్యార్థుల ముద్దు బాగోతం రచ్చకెక్కింది. ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇది ఏకంగా కోర్టుకు చేరింది. వ్యభిచార నేరం కింద కేసు నమోదుకు పిటిషనర్ పట్టుబట్టడంతో సైదాపేట కోర్టు విచారణకు శ్రీకారం చుట్టింది. సాక్షి, చెన్నై: దేశంలో యువతీ యువకుల మధ్య ‘కిస్ ఆఫ్ లవ్’ పోటీలు పెద్ద చర్చకే దారి తీశారుు. ఉత్తరాదిలో ఇది చాపకింద నీరులా సాగినా, దక్షిణ భారతంలోని కేరళలో సాగిన ఈ పోటీ లు వివాదాన్ని సృష్టించాయి. సంప్రదాయాన్ని మంట గలుపుతూ కేరళ యువతీ, యువకు లు కొందరు వ్యవహరించిన తీరు ఆ రాష్ట్రంలో కలకలాన్ని రేపింది. దీంతో కిస్ ఆఫ్ లవ్ అంటూ ముద్దుల్లో మునిగిన యువతీ యువకులపై కేసుల మోత మోగింది. అదే సమయంలో చెన్నై ఐఐటీ విద్యార్థుల రూపంలో కిస్ ఆఫ్ లవ్ తమిళనాడులోకి ప్రవేశించింది. గత వారం ఐఐటీ ఆవరణలో వంద జంటలు కౌగిలింతలతో ముద్దుల్లో మునిగితేలాయి. తొలుత ఓ హాల్లో రహస్యంగా ఏర్పాట్లు చేసుకుని, మీడియా కంట పడకుండా ముద్దుల్లో మునిగారు. చివరకు మీడియాకు సమాచారం అందడంతో తమకేమి భయం అన్నట్టుగా ఈ జంటల్లో కొందరు చివరకు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వివాదం : ఈ ముద్దుల వ్యవహారం పత్రికల్లో, టీవీల్లో రావడంతో వివాదం రేపింది. సంస్కృతి, సంపద్రాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా ఉన్న తమిళనాడులో బహిరంగంగా ఐఐటీ యువతీ, యువకులు సాగించిన ముద్దుల తీరు రచ్చకెక్కింది. ఐఐటీ యాజమాన్యంపై, విద్యార్థులపై చర్యకు పట్టుబడుతూ ఆందోళనలు బయలుదేరాయి. ఓ వైపు పీఎంకే, మరో వైపు హిందూ మున్నని నేతృత్వంలో ఆందోళనలు సాగుతున్నాయి. పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. విచారణ పేరిట పోలీసులు ఆ ఫిర్యాదులపై ఇంత వరకు స్పందించ లేదు. సంస్కృతి సంప్రదాయాల్ని మంట గలిపే విధంగా ఐఐటీలో సాగిన ఈ వ్యవహారం, ఇతర కళాశాలలకు పాకకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. పిటిషన్ దాఖలు: ఓవైపు ఆందోళనలు సాగుతుంటే, మరో వైపు వ్యవహారం కోర్టుకు చేరింది. ఐఐటీలో కొందరు విద్యార్థులు వ్యవహరించిన తీరును దుయ్యబడుతూ సామాజిక సేవకుడు వారాహి గురువారం సైదాపేట తొమ్మిదో మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని తన పిటిషన్లో వివరించారు. తమిళనాడులో సంస్కృతి, సంప్రదాయం, భాషా పరంగా అనుసరిస్తున్న విధానాలు గుర్తు చేశారు. అయితే, ఐఐటీ విద్యార్థుల రూపంలో తమిళనాడులోని ఇతర విద్యార్థులకు పెద్ద కలంకం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటీలో కొందరు విద్యార్థులు వ్యవహరించిన అనాగరిక చర్యతో తమిళనాడులోని విద్యార్థినీ విద్యార్థుల గౌరవానికి భంగం కల్గిందని పేర్కొన్నారు. పత్రికల్లో, టీవీల్లో ఆ విద్యార్థుల వ్యవహారం అసభ్యకరంగా ఉందని, మరీ శ్రుతి మించి వారు వ్యవహరించిన తీరు తమిళ సంస్కృతికి మచ్చను చేకూర్చేలా ఉందన్నారు. సంప్రదాయాల్ని మంట కలిపే విధంగా విద్యార్థులు వ్యవహరిస్తుంటే, ఐఐటీ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కిస్ ఆఫ్ లవ్ పేరిట ఒకే చోట అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమికూడి అసభ్యకరంగా వ్యవహరిస్తే, అడ్డుకోవాల్సిన ఐఐటీ వర్గాలు చోద్యం చూశాయని ఆరోపించారు. విచారణకు : కేరళలో విద్యార్థులు వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసిందని తన పిటిషన్లో వారాహి గుర్తు చేశారు. అయితే, ఇక్కడ తమిళ సంస్కృతిని మంట కలిపే విధంగా వ్యవహరించిన ఐఐటీలోని కొందరు విద్యార్థులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదులు చేరాయని, కొన్ని సంఘాలు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఐఐటీలో అసభ్యకరంగా బహిరంగంగా ముద్దుల్లో మునిగి తేలిన విద్యార్థులపై, ఐఐటీ డెరైక్టర్పై వ్యభిచార నేరం, భారత శిక్షాస్మృతి చట్టాల కింద కేసు నమోదు చేయాలని, ఇందుకు తగ్గ ఆదేశాలను పోలీసులకు జారీ చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి శాంతి విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపున న్యాయవాది కృష్ణమూర్తి హాజరైన వాదన విన్పించారు. తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి న్యాయమూర్తి శాంతి వాయిదా వేశారు.