ikp employee
-
మహిళా ప్రతినిధులతో సంబంధం.. ఇతర మహిళలను ట్రాప్‌లో పడేసి
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): మహిళా సంఘాల్లోని సభ్యుల రుణాల సొమ్ము, పొదుపు సొమ్ము కాజేసిన ఐకేపీ ఉద్యోగుల లీలలు మరవక ముందే లైంగిక వేధింపుల ఘటన ఒకటి మోర్తాడ్‌లో వెలుగు చూసింది. మండల సమాఖ్యలో కమ్యునిటీ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ఒకరు తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళలు సమాఖ్యకు పోస్టు ద్వారా లేఖ పంపడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులతో పాటు మహిళా సమాఖ్యకు బాధిత మహిళలు కొందరు ఉద్యోగి అకృత్యాల వివరాలను వెల్లడించారు. మహిళా సంఘం సమావేశాలకు హజరు కావాలంటేనే తమకు భయం వేస్తుందని సదరు ఉద్యోగి ఉన్నంత కాలం కార్యాలయానికి రాలేమని మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమతో ఫోన్లో మాట్లాడిన విషయాలను,సామాజిక మాధ్యమాలలో చాటింగ్ చేసిన ఆంశాలను బయటపెట్టకుండా ఉండాలంటే తాను అడిగినంత డబ్బు ఇచ్చుకోవాలని ఆ ఉద్యోగి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నారు. కొందరు మహిళా సమాఖ్య ప్రతినిధులతో శారీరక సంబంధం ఏర్పరచుకుని వారి ద్వారా ఇతర మహిళలను ట్రాప్‌లో పడవేసి లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళలు ఆరోపించారు. ఆ ఉద్యోగి మూ డేళ్ల కిందట మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని ఏపీఎం ప్రమీల వెల్లడించారు. చదవండి: టీసీ ఇవ్వలేదని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని అత్యాచారం కేసులో అరెస్టు సిరికొండ: పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిపాల్ తాండాకు చెందిన మాలావత్ నవీన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మండలంలోని ఒక తాండాకు చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆఫీసు పనుందని చెప్పి రెండు మూడు రోజులైనా..
తాడిపత్రి: ఐకేపీ ఉద్యోగిపై జరిగిన హత్యాయత్నం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో సీసీ రామ్మోహన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను 24 గంటలలోపు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ ద్విచక్రవాహనంతో పాటు మూడు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్ వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పొదుపు సంఘాల లీడర్లు సీసీతో తరచూ సమావేశమయ్యేవారు. తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లికి చెందిన మహిళతో సీసీకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజుల్లోనేఆమెకు వెలుగు కార్యాలయంలోనే యానిమేటర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. వీరిద్దరి వ్యవహారశైలిపై ఆమె భర్త వెంకటలింగారెడ్డికి అనుమానం వచ్చింది. పలుమార్లు హెచ్చరించినా భార్య పద్ధతిలో మార్పు రాలేదు. ఒక్కొక్కసారి ఆఫీసు పనిమీద అనంతపురం వెళ్తున్నానని చెప్పి రెండు మూడు రోజులైనా ఇంటికి వచ్చేది కాదు. తన భార్యతో మాట్లాడవద్దని, పద్ధతి మార్చుకోకపోతే అంతమొందిస్తానని సీసీని వెంకటలింగారెడ్డి హెచ్చరించాడు. దీంతో సీసీ రామ్మోహన్ తాడిమర్రి నుంచి జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నాడు. అయినా యానిమేటర్ తరచూ అనంతపురానికి వెళ్లి రామ్మోహన్‌ను కలిసి వచ్చేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయితే ఆమె తన భర్తతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న రామ్మోహన్ జిల్లా కేంద్రం నుంచి నార్పలకు బదిలీ చేయించుకున్నాడు. నాగలక్ష్మి అక్కడికి వస్తూ పోతుండేది. అంతమొందించేందుకు రెక్కీ తమ వైవాహిక జీవితానికి అడ్డుపడిన రామ్మోహన్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్న వెంకటలింగారెడ్డి తన సోదరుడు రాజారెడ్డితో విషయాన్ని చెప్పి అతడి సహాయం తీసుకున్నాడు. దీంతో వీరిరువురూ రామ్మోహన్‌ను అంతమొందించేందుకు పథకం వేశారు. ఈలోపు రామ్మోహన్ నార్పల నుంచి తిరిగి అనంతపురానికి బదిలీపై వెళ్లడంతో అక్కడ అంతమొందించేందుకు వెంకటలింగారెడ్డి, సోదరుడు రాజారెడ్డిలు రెక్కీ నిర్వహించారు. అక్కడ కూడా వీలు కాలేదు. కానీ తాజాగా రామ్మోహన్ తాడిపత్రి వెలుగు కార్యాలయానికి బదిలీపై వచ్చాడు. విషయం తెలుసుకున్న వెంకటలింగారెడ్డి సోదరులు సోమవారం తాడిపత్రికి చేరుకున్నారు. కార్యాలయంలో రామ్మోహన్ ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన వెంకటలింగారెడ్డి సోదరులు లోనికి చొచ్చుకెళ్లి వేటకొడవళ్లతో దాడి చేశారు. చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు గడవకముందే దాడికి పాల్పడిన వెంకటలింగారెడ్డి, సోదరుడు రాజారెడ్డిలను అరెస్టు చేసి, వారి వద్దనుంచి ఓ ద్విచక్ర వాహనంతో పాటు మూడు వేటకొడవళ్లు, కారంపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లో హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. -
స్త్రీశక్తి భవనంలోఉద్యోగి ఆత్మహత్య
పెనమలూరు : గ్రామంలోని మండల స్త్రీశక్తి భవనంలో ఐకేపీ ఔట్‌సోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న తంగిరాల అజయ్‌కుమార్ (26) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కారణంగానే తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాశాడు. పోలీసుల కథనం మేరకు... పోరంకి బీజేఆర్ నగర్‌కు చెందిన తంగిరాల అజయ్‌కుమార్ తొమ్మిదేళ్లుగా ఐకేపీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతను గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చి 10 గంటల సమయంలో తలుపులు వేసి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోస్టుఉమెన్ వచ్చి తలుపులు కొట్టినా స్పందన రాలేదు. డ్వాక్రా మహిళలు కిటికీ నుంచి చూడగా అతను ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు, ఆ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలుత అతని ఆత్మహత్యకు కారణాన్ని కుటుంబ సభ్యులు చెప్పలేకపోయారు. సూసైడ్‌నోట్ లభ్యం పోలీసులు వచ్చి కార్యాలయం తలుపులు పగులకొట్టి చూడగా, గదిలో వేలాడుతున్న మృతదేహం వద్ద పది పేజీల సూసైడ్‌నోట్, రెండు సీడీలు, పెన్‌డ్రైవ్, రెండు సెల్ ఫోన్లు, ఒక సిమ్‌కార్డు దొరికాయి. సూసైడ్ నోట్లో గతలో కార్యాలయంలో బుక్ కీపర్‌గా పనిచేసిన వివాహితతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆమె కోసం తాను రూ.1.50 లక్షలు ఖర్చుచేశానని, అయితే ఇప్పుడు ఆమె తనను పట్టించుకోకుండా వేధిస్తోందని, అందుకే మనస్థాపం చెంది ఆమె చీరతోనే ఉరేసుకుంటున్నానని పేర్కొన్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
అనైతిక చర్యలు.. ఆపై బెదిరింపులు
సంగెం, న్యూస్‌లైన్ : వ్యక్తిగత జీవితంలో అనైతిక చర్యలకు పాల్పడి ఉద్యోగం నుంచి ఉద్వాసన పొందిన ఐకేపీ ఓ మాజీ ఉద్యోగి.. ఆ శాఖ ఉద్యోగులనూ వదలడం లేదు. తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాల ని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిస్తున్నాడు. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది అతడి నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రరుుంచారు. ఈ మేరకు జిల్లా జెండర్ డీపీఎం బి.గీతారాణి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో వివరాలు వెల్లడించారు. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన వేల్పుల రాజు గతంలో ఐకేపీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహించేవాడు. రాజుకు భార్య ఉండగా మరో మహిళతో వివాహేతర సం బంధం సాగించాడు. దీంతో తనకు అన్యాయం చేస్తున్నాడని, భర్తపై చర్య తీసుకోవాలని కోరుతూ అతడి భార్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. జిల్లా కుటుంబ ఉచిత న్యాయ సలహా కేంద్రానికి రాజును, అతడి భార్య ను, వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళను పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. కలెక్టర్ నుంచి డీఆర్డీఏ పీడీకి అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి రాజు ప్రవర్తన సరిగా లేనందున జిల్లా సమాఖ్య ఆదేశా ల మేరకు ఉద్యోగం నుంచి తొలగించారు. రాజు ఈ నెల 3, 9వ తేదీల్లో సంగెం శాంతి మండల సమాఖ్య కార్యాలయానికి వచ్చి ఏపీఎం ఝా న్సీ, ఇతర ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తూ ఉద్యోగంలోకి తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని, అతడిపై చర్య తీసుకోవాలని కోరుతూ సంగెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డీపీఎం పేర్కొన్నారు. రాజు నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. సమావేశంలో డీపీఎం వెంట ఏపీఎం ఝాన్సీ, మండల సమాఖ్య కోశాధికారి పసునూరి సరోజన, జిల్లా సోషల్ యూక్టివిటీ కమిటీ సభ్యులు వై.మణెమ్మ, బి.ప్రమీల పాల్గొన్నారు.