పత్రీకాత్మక చిత్రం
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): మహిళా సంఘాల్లోని సభ్యుల రుణాల సొమ్ము, పొదుపు సొమ్ము కాజేసిన ఐకేపీ ఉద్యోగుల లీలలు మరవక ముందే లైంగిక వేధింపుల ఘటన ఒకటి మోర్తాడ్‌లో వెలుగు చూసింది. మండల సమాఖ్యలో కమ్యునిటీ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ఒకరు తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళలు సమాఖ్యకు పోస్టు ద్వారా లేఖ పంపడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులతో పాటు మహిళా సమాఖ్యకు బాధిత మహిళలు కొందరు ఉద్యోగి అకృత్యాల వివరాలను వెల్లడించారు.
మహిళా సంఘం సమావేశాలకు హజరు కావాలంటేనే తమకు భయం వేస్తుందని సదరు ఉద్యోగి ఉన్నంత కాలం కార్యాలయానికి రాలేమని మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమతో ఫోన్‌లో మాట్లాడిన విషయాలను,సామాజిక మాధ్యమాలలో చాటింగ్ చేసిన ఆంశాలను బయటపెట్టకుండా ఉండాలంటే తాను అడిగినంత డబ్బు ఇచ్చుకోవాలని ఆ ఉద్యోగి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నారు.
కొందరు మహిళా సమాఖ్య ప్రతినిధులతో శారీరక సంబంధం ఏర్పరచుకుని వారి ద్వారా ఇతర మహిళలను ట్రాప్‌లో పడవేసి లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళలు ఆరోపించారు. ఆ ఉద్యోగి మూ డేళ్ల కిందట మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని ఏపీఎం ప్రమీల వెల్లడించారు.
చదవండి: టీసీ ఇవ్వలేదని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని
అత్యాచారం కేసులో అరెస్టు
సిరికొండ: పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిపాల్ తాండాకు చెందిన మాలావత్ నవీన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మండలంలోని ఒక తాండాకు చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment