ikp center
-
మహిళా ప్రతినిధులతో సంబంధం.. ఇతర మహిళలను ట్రాప్‌లో పడేసి
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): మహిళా సంఘాల్లోని సభ్యుల రుణాల సొమ్ము, పొదుపు సొమ్ము కాజేసిన ఐకేపీ ఉద్యోగుల లీలలు మరవక ముందే లైంగిక వేధింపుల ఘటన ఒకటి మోర్తాడ్‌లో వెలుగు చూసింది. మండల సమాఖ్యలో కమ్యునిటీ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ఒకరు తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళలు సమాఖ్యకు పోస్టు ద్వారా లేఖ పంపడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులతో పాటు మహిళా సమాఖ్యకు బాధిత మహిళలు కొందరు ఉద్యోగి అకృత్యాల వివరాలను వెల్లడించారు. మహిళా సంఘం సమావేశాలకు హజరు కావాలంటేనే తమకు భయం వేస్తుందని సదరు ఉద్యోగి ఉన్నంత కాలం కార్యాలయానికి రాలేమని మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమతో ఫోన్లో మాట్లాడిన విషయాలను,సామాజిక మాధ్యమాలలో చాటింగ్ చేసిన ఆంశాలను బయటపెట్టకుండా ఉండాలంటే తాను అడిగినంత డబ్బు ఇచ్చుకోవాలని ఆ ఉద్యోగి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నారు. కొందరు మహిళా సమాఖ్య ప్రతినిధులతో శారీరక సంబంధం ఏర్పరచుకుని వారి ద్వారా ఇతర మహిళలను ట్రాప్‌లో పడవేసి లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళలు ఆరోపించారు. ఆ ఉద్యోగి మూ డేళ్ల కిందట మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని ఏపీఎం ప్రమీల వెల్లడించారు. చదవండి: టీసీ ఇవ్వలేదని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని అత్యాచారం కేసులో అరెస్టు సిరికొండ: పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిపాల్ తాండాకు చెందిన మాలావత్ నవీన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మండలంలోని ఒక తాండాకు చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పొదుపులో మేటి..చిట్యాల ఐకేపీ
చిట్యాల : పొదుపు బాటలో మండలకేంద్రంలోని ఐకేపీ ముందంజలో నిలిచింది. మూతపడే దశకు చేరిన ఐకేపీని పొదుపు పరంగా తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిందేలా చేశారు అధికారులు. ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్న పసరగొండ మంజుల ప్రజల్లో పొదుపుపై అవగాహన కల్పించి పొదుపు సంఘాలను ఎంతో బలోపేతం చేశారు. ఈ మేరకు ఏపీఎం మంజుల నాలుగేళ్ల సేవలకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ చేతుల మీదుగా మంజల జిల్లా ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు అందుకున్నారు. బాసటగా నిలిచిన ఏపీఎం మంజుల.. 2015 ఆగస్టు 13న చిట్యాల ఐకేపీ ఏపీఎంగా మంజులనియమితులయ్యారు. ఐకేపీ కార్యాలయంలోని పొదుపు సంఘాల పరిస్థితి అధ్వాన్నంగా ఉండి ఒక దశలో లోబడ్జెట్తో మూసివేసే స్థితిలో ఉండగా మంజుల గ్రామాలలో విస్త్ర ృత సమావేశాలు నిర్వహించారు. శ్రీనిధి, బ్యాంకు లింకేజీపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. గుడుంబా తయారీ ఎక్కువగా జరిగే గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఐకేపీ పరిధిలో 796 పొదుపు సంఘాలను బలోపేతం చేసి చిట్యాల ఐకేపీని రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిపారు. దీంతో మండల సమాఖ్యకు రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐకేపీని ప్రథమ స్థానంలో నిలిపిన మంజుల సేవలకు అవార్డు రావడంపై మండల సమాఖ్య అధ్యక్షురాలు విజయ, మాజీ అధ్యక్షురాలు దర్గా, పొదుపుసంఘాల మహిళలు, సీసీలు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మండల సభలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు మంజులను సన్మానించారు. -
‘ఐకేపీ’ల్లో మూలుగుతున్న ధాన్యం
- పజ్జూరు ఐకేపీ కేంద్రంలోనే పేరుకుపోయిన 30 లారీల ధాన్యం - లారీల కొరతను సాకుగా చూపుతున్న నిర్వాహకులు - సొంత ఖర్చులతో రవాణా చేసుకుంటున్న రైతులు - చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం జిల్లాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో సంఘబంధాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చిన రైతన్నకు వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు సకాలంలో ధాన్యం కాటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు గన్నిబ్యాగు(బస్తాలు)లు సరిపడా వున్నప్పటికీ కొన్ని చోట్ల కాంటా వేయడం లేదని తెలుస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే హమాలీల కొరత ఉందని చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల లారీల కొరత ఉండటం కారణంగా ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. అంతేకాకుండా కొన్ని ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యాన్ని నాలుగైదు మిల్లులకు పంపించడం వల్ల మిల్లర్లు, లోడుకు 6 నుంచి 8 క్వింటాళ్ల తరుగు చూపుతున్నారని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. గడ్డికొండారం ఐకేపీ కేంద్రం నుంచి మిర్యాలగూడలోని మహేశ్వరి మిల్లుకు మూడు రోజులుగా ధాన్యం తరలిస్తున్నారు. ఆ మిల్లు యాజమాన్యం తరుగు ఎక్కువగా చూపుతుండటంతో ఐకేపీ సిబ్బంది, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పజ్జూరు ఐకేపీ కేంద్రం తీరిది తిప్పర్తితో పాటు పజ్జూరు ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. ఒక్క పజ్జూరు ఐకేపీ కేంద్రానికే సుమారు 25 లారీల ధాన్యం వచ్చింది. ఇందులో 8 లారీలకు సరిపడా ధాన్యం కాంటా వేసి బస్తాల్లో ఉంచారు. కాంటా వేసి వారం రోజులవుతున్నా ఒక్క లారీ కూడా రాకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిస్తోంది. మూ డు రోజుల కిత్రం వచ్చిన వర్షానికి ధాన్యా న్ని రక్షించేం దుకు సిబ్బంది పడిన అవస్థలు అంతాఇంతా కాదు. లారీలను సమకూర్చే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది, రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గడ్డికొండారంలో దయనీయ పరిస్థితి గడ్డికొండారం ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లిన రైతులకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని తరలించుకోవాలని, లేదంటే ధాన్యం కొనుగోలు చేయమని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. చేసేదేమి లేక రైతులే కిరాయి చెల్లించి తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు.