Ilayadalapati vijay
-
విజయ్‌ని కావాలనే టార్గెట్ చేశారా !
పెరంబూరు : ఇళయదళపతి విజయ్ ఇప్పుడు చాలా మందికి టార్గెట్ అయ్యారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. సినీ రంగంలో విజయ్‌కు, అజిత్‌కు మధ్య పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిజ జీవితంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండడంతో కేవలం వృత్తిపరమైన పోటీనే కాబట్టి సమస్య లేదు. ఈమధ్య అన్నాడీఎంకే పార్టీ విజయ్ను టార్గెట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. నటుడు విజయ్ నటించిన తలైవా, కత్తి చిత్రాల విడుదల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన సర్కార్, ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ రోజు వరకూ అన్నాడీఎంకే ఆయనను టార్గెట్ చేసిందనే టాక్ ఉంది .(హీరో విజయ్ ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు) మెర్సెల్ చిత్రం విడుదల సమయంలోనూ బీజేపీ నాయకులు ఆ సినిమాను టార్గెట్ చేస్తూ.. చిత్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా సంభాషణలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. తాజాగా ఆదాయపన్నుశాఖ దాడి.. బిగిల్ చిత్ర వ్యవహారంలో ఫిబ్రవరి 5,6 తేదీల్లో విజయ్‌కు చెందిన స్థానిక సాలిగ్రామం, పనైయూర్‌లోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అప్పుడు ఆయన ఇళ్లలో కొన్ని డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత విజయ్‌కు సమన్లు పంపడం, ఆయన నేరుగా చెన్నైలోని ఆదాయపన్నుశాఖాధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటిది గురువారం మరోసారి విజయ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతా సక్రమమే ఈ సందర్భంగా నటుడు విజయ్ తాజాగా నటిస్తున్న మాస్టర్ చిత్ర సహ నిర్మాత లలిత్‌కుమార్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కాగా విజయ్ బిగిల్ చిత్రంలో నటించినందుకు గాను రూ.50 కోట్ల పారితోషికాన్ని, తాజాగా నటిస్తున్న మాస్టర్ చిత్రానికి రూ.80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తేలింది. ఈ రెండు చిత్రాల పారితోషికానికి నటుడు విజయ్ సక్రమంగా పన్ను చెల్లించినట్లు ఆదాయశాఖ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయన్ని మిస్టర్ క్లీన్‌గా చేశారు. ఈ ఐటీ దాడుల వ్యవహారంలో విజయ్ ప్రవర్తించిన తీరు ఆయన పరిణితిని తెలియజేసింది. ఈ దాడుల గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. (విషం ఇచ్చి చంపేయమంటున్నారు! ) కాగా ఐటీ అధికారులు విజయ్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంతో సినీ నటి, కాంగ్రెస్స్ పార్టీ జాతీయ ప్రచార కర్త ఖష్భూ స్పందించారు. 'ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయ్‌కు క్లీన్చిట్ ఇచ్చారు కాబట్టి ఇక ఈ వ్యవహారానికి విశ్రాంతి ఇచ్చేద్దామా? ' అని ట్విటర్లో పేర్కొన్నారు. విజయ్ తన పనిని తాను కామ్‌గా చేసుకుపోతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనన్న చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో తాను నటించనున్న కొత్త చిత్రం గురించి వెల్లడించనున్నారు. -
రెండో సీఎంకి నా ఛాయిస్ ఆయనే!
సాక్షి, తమిళసినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సూపర్‌హిట్ సినిమాలకు వరుసగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఇప్పటికే రోబో సీక్వెల్ 2.ఓ వచ్చింది. త్వరలో భారతీయుడు సీక్వెల్ కూడా రాబోతోంది. మరి ‘ఒకే ఒక్కడు’ సినిమాకు కూడా సీక్వెల్ వస్తే.. అందులో ముఖ్యమంత్రి పాత్ర ఎవరు పోషిస్తారంటే.. ‘నా ఫస్ట్ ఛాయిస్ విజయ్‌నే’ అంటున్నారు శంకర్. ఆయన తాజా చిత్రం ‘2.ఓ’ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ విషయాన్ని ఈ సినిమా కథానాయకుడు రజనీకాంత్ ఆదివారం రాత్రి తన తాజా చిత్రం పేట ఆడియో ఆవిష్కరణ సందర్భగా స్వయంగా చెప్పారు. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్ కథానాయకుడిగా ఇండియన్- 2 చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శంకర్.. మీ తదుపరి చిత్రం ఏంటన్న ప్రశ్నకు ముదల్వర్ (ఒకే ఒక్కడు) చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని తెలిపారు. ముదల్వర్ చిత్రాన్ని శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ముదల్వర్- 2లో హీరోగా ఎవరిని ఎంపిక చేయనున్నారన్న ప్రశ్నకు రజనీ, కమల్‌లలో ఒకరు నటించడానికి సిద్ధమంటే వారితోనే చేస్తానన్నారు. అయితే, స్క్రిప్ట్ యువ హీరోను డిమాండ్ చేస్తే తన ఫస్ట్ ఛాయిస్ ఇళయదళపతి విజయ్నేనని చెప్పారు. ఇండియన్- 2 చిత్రం పూర్తయిన తరువాతనే ముదల్వర్- 2 గురించి చర్చిస్తానని తెలిపారు. కాగా ఇంతకుముందు శంకర్, విజయ్‌ల కాంబినేషన్లో నన్భన్ (స్నేహితుడు) చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. -
లక్కీ హీరోయిన్ కీర్తీసురేశ్
ఒకప్పటి పరిస్థితి ఏమో గానీ ప్రస్తుతం అధిక శాతం కథానాయికలు గ్లామర్‌నే నమ్ముకుంటున్నారన్నది నిజం. అలాగని అందర్నీ ఒకే గాడి కిందకు చేర్చలేం. నటి లక్ష్మీమీనన్, శ్రీదివ్య వంటి హీరోయిన్లు కొందరు అభినయంతోనే పేరు తెచ్చుకున్నారు. నిజం చెప్పాలంటే వీరి ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే కొందరు పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చినా రాణించలేరు. కానీ నటి కీర్తీసురేశ్ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినా తన కంటూ గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈమె సీనియర్ నటి మేనక వారసురాలన్న విషయం తెలిసిందే. మొదట్లో మాతృభాష మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినా ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక్కడ తొలి చిత్ర రజనీ మురుగన్ అయినా మొదట తెరపైకి వచ్చింది ఇదు ఎన్న మాయం చిత్రం. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తొలుత అంగీకరించిన రజనీమురుగన్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కీర్తీసురేశ్‌కు మంచి పేరు సంపాదించింది. దీంతో అమ్మడికి అదృష్టం పట్టుకుంది. ధనుష్‌తో జతకట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. తొడరి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడో చిత్రంతోనే కీర్తీసురేశ్‌ను అగ్రనటుడు ఇళయదళపతి విజయ్‌కు జంటగా నటించే అవకాశం వరించింది. మరి ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్నే కదా, అయితే మలయాళం మాతృభాష అయిన కీర్తీసురేశ్ తమిళ భాషను సరళంగా మాట్లాడగలరు. దీంతో ఈ రెండు భాషల్లోనూ తన పాత్రలకు తాను డబ్బింగ్ చెప్పుకుంటున్నారట. ఇక కీర్తీ తెలుగులోను నేను శైలజ చిత్రంలో నటించి ఆ చిత్ర విజయంతో అక్కడ అభిమానులను సంపాదించుకున్నారన్నది గమనార్హం. అలా అతి తక్కువ కాలంలోనే కీర్తీ త్రిభాషా నటిగా ఎదగడం అరుదైన విషయమనే చెప్పాలి. -
అందాలకు హద్దులు
ఇకపై అందాలారబోతకు హద్దులుంటాయంటున్నారు శ్రుతి హాసన్. ఒక ప్రఖ్యాత నటుడు వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ భామ తొలిరోజుల్లోనే హిందీ చిత్రం లక్‌లో శ్రుతి మించిన అందాలను తెరపై ఆరబోసి విమర్శలు మూటకట్టుకున్నారు. ఆ తరువాత కూడా హిందీ, తెలుగు భాషల్లో అందాలొలక బోస్తూ గ్లామర్‌డాల్‌గా ప్రాచుర్యం పొందారు. అయితే తమిళ చిత్రాల్లో గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆమె తమిళంలో 3, 7 ఆమ్ అరివు చిత్రాల్లో నటించారు. తాజాగా నటించిన పూజై చిత్రం దీపావళికి తెరపైకి రానుం ది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ తానెలా నటించాలన్న విషయమై సొంత నిర్ణయాలు ఏమి తీసుకోలేదన్నారు. ఆ విషయాన్ని పాత్రలే నిర్ణయిస్తాయన్నారు. ఇక గ్లామర్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్నారు. అంతేగాని హిందీ, తెలుగు చిత్రాల్లో గ్లామరస్‌గా నటిస్తున్నానని, తమిళ చిత్రాల్లో అందాలారబోత విషయంలో అభిమానులను నిరాశపరుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఏదేమైనా ఇకపై ఇలాంటి విమర్శలకు దూరం అవడానికి ఏ భాషా చిత్రంలోనైనా గ్లామర్ విషయంలో కొన్ని పరిమితులు విధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. త్వరలో ఈ బ్యూటీ ఇళయదళపతి సరసన నటించడానికి సిద్ధం అవుతోంది.