ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ను విధించారు.
పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం.
ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం