illegal businesses
-
అమ్మో! ఇవన్నీ దొంగతనాలే!?
సెల్ఫ్‌చెక్ మీరెప్పుడైనా దొంగతనం చేశారా?... అంటే నిస్సంకోచంగా, నిర్భయంగా లేదని చెప్పేస్తాం. ఇంతకీ దొంగతనం జాబితా తెలిస్తే... ‘నేను దొంగతనానికి పాల్పడిన సందర్భం ఒక్కటీ లేదు’ అనలేం. ఒకసారి చెక్ చేసుకోండి. 1. ఇతరుల వస్తువులు, డబ్బును సంగ్రహించడం మాత్రమే దొంగతనం. ఎ. కాదు బి. అవును 2. ఒకరి ఆలోచనలను తమ ఆలోచనలుగా ప్రకటించుకోవడమూ దొంగతనమేనని మీ అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 3. కథను, కథావస్తువును కాపీ కొట్టడం నైతికంగానే కాక చట్టపరంగా కూడా నేరమని తెలుసు. ఎ. అవును బి. కాదు 4. స్నేహితులు మనతో పంచుకున్న భావాలను మనమే ముందు ఆచరణలోకి తెచ్చి మెప్పును సొంతం చేసుకోవాలనుకోవడాన్ని మించిన అనైతికం మరొకటి ఉండదని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 5. పనివారి శ్రమకు తగిన మూల్యాన్ని ఇవ్వకపోవడం దొంగతనమేనని జైన మతం చెబుతోందని తెలుసు. ఎ. అవును బి. కాదు 6. ఒకరి నుంచి అయాచితంగా ఏదైనా తీసుకోవడమూ అస్తేయ (దొంగత నం) మేనని జైనత్రిరత్నాల ఉద్దేశం. ఎ. అవును బి. కాదు 7. దొరికిన వస్తువునైనా సరే సొంతానికి వాడుకుంటే జైనం అంగీకరించదని తెలుసు. వాటిని సమాజ సేవకు ఉపయోగిస్తారు. ఎ. అవును బి. కాదు 8. అక్రమ వ్యాపారాలు, దొంగిలించిన వస్తువులను తక్కువకు కొనడం కూడా అస్తేయంలో దోషమే. ఎ. అవును బి. కాదు 9. ఎవరైనా అవసరానికి అమ్ముతుంటే అదే అవకాశంగా తక్కువకు కొనడం కూడా దొంగతనమేనని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే దొంగతనం అనే పదానికి ఉన్న విస్తృతమైన అర్థం మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే ముందు దొంగతనం అంటే ఏమిటో తెలుసుకోండి. -
ఉచిత ఇసుక పేరుతో రూ. కోట్ల వ్యాపారం
* ఆ సొమ్ము పెదబాబు జేబులోకా? చినబాబు జేబులోకా? * వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు ధ్వజం రేపల్లె: ఉచిత ఇసుక పేరుతో చేస్తున్న దోపిడీ సొమ్ము స్థానిక టీడీపీ నేతల జేబుల్లోకా, పెదబాబు జేబులోకా, లేక చినబాబు జేబులోకి వెళ్తున్నాయా అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇసుకరేవుల్లో టీడీపీ నేతలు బ్రోకర్లుగా మారి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ట్రక్కు ఇసుకకు రూ.350 వసూలు చేయాల్సి ఉండగా రూ.800 వసూలు చేస్తూ ఇళ్లు నిర్మించుకునే పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. పెనుమూడి రేవు నుంచి రోజుకు వందల ట్రక్కుల ఇసుకను తరలిస్తూ కోట్లాది రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు. కళ్ల ముందే కోటాది రూపాయలు దోచుకుంటుంటే రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అధికారులు ధృతరాష్ట్రుని పాత్ర పోషించటం దురదృష్టకరమన్నారు. నిలువుదోపిడీకి గురౌతున్న ప్రజలు తిరగబడక ముందే టీడీపీ నేతలు ఇసుక అవినీతికి స్వస్తి పలకాలని హితవు పలికారు. -
వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ప్రారంభం
- వెల్లడించిన ముంబై నగర పోలీసు శాఖ - 70457 57272 నంబర్‌తో అకౌంటుతో ఫిర్యాదుల స్వీకరణ - అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టేందుకే: ఏఎస్పీ లోహియా - ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం సాక్షి, ముంబై: మీకు తెలిసి ఎక్కడైనా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు జరుగుతున్నాయా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానకి భయమా.. అయితే మీ లాంటి వారి కోసమే నగర పోలీసు శాఖ వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. మొబైల్ నుంచి ఫిర్యాదు చేయడానికి వీలుగా ఉండేం దుకు ఈ నిర్ణయం తీసుకుంది. 70457 57272 అనే హెల్ప్‌లైన్ నంబర్ వాట్స్‌యాప్ అకౌంటుకు ఫిర్యాదుతో పాటు సంబంధిత సమాచారాన్ని అందించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. ముంబైలోని మురికివాడల్లో పేకాట, మాదకద్రవ్యాల విక్రయం, సారా తయారీ వంటి అక్రమ వ్యాపారాలు జరుగుతుంటా యి. ఈ విషయం తెలిసినా చాలా మంది పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. దీంతో అక్రమ వ్యాపారులకు చెక్ పె ట్టేందుకు తూర్పు రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ లోహియా వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా అమలు ‘ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ భాగమయ్యింది. కొత్త ఫీచర్స్‌తో వచ్చే మొబైల్స్ తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్స్ యాప్ ఉపయోగిస్తున్నారు. అందుకే వాట్స్‌యాప్‌ను ఫిర్యాదులకు కేంద్రంగా వినియోగించుకోవాలని నిర్ణయించాం. ఎవరైనా సరే ఫొటోలు తీసి అప్లోడ్ చేయవచ్చు’ అని లోహియా అన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా పోలీసు యూనిట్ నంబరు 6, 7 పరిధిలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెంబూర్, తిలక్‌నగర్, ఘట్కోపర్, పంత్నగర్, విక్రోలి, పార్క్‌సైట్, కంజూర్‌మార్గ్, గోవండీ, ములుండ్, నవ్ఘర్, చునాభట్టి, ట్రాంబే, మాన్‌ఖుర్ద్, శివాజీనగర్, ఆర్సీఎఫ్, దేవ్నార్ తదితర 18 స్టేషన్ల పరిధిలో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామని, ప్రజల స్పంద న బట్టి విస్తరిస్తామని ఆయన చెప్పారు. ‘ప్రజలు వాట్స్‌యాప్ ద్వారా పంపిం చిన ఫిర్యాదులు నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి వెళతాయి. అక్కడి నుంచి డిప్యూటీ పోలీసు కమిషనర్‌కు, స్థానిక పోలీసు స్టేషన్‌లోని పోలీసు ఇన్స్పెక్టర్కు చేరుతాయి. ఫిర్యాదుదారుల పేర్లు బయటపడే ఆస్కారమే ఉండదు’ అని లోహియా స్పష్టం చేశారు. -
‘సెల్’గాటం !
నకిలీ విడిభాగాలతో దోపిడీ వినియోగదారులకు దుకాణదారుల శఠగోపం {పధాన కంపెనీలను సైతం మోసగిస్తున్న వైనం రిపేరుకు ఇస్తే విడిభాగాలు మాయం చిత్తూరు : జిల్లావ్యాప్తంగా పలు సెల్ దుకాణాల యజమానులు ఇటు వినియోగదారులను, అటు సెల్ కంపెనీలను దోపిడీ చేస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ముఖ్యంగా నాణ్యత లేని సెల్ డిస్ప్లేతో పాటు వివిధరకాల విభాగాలను వినియోగదారులకు అంటగడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అవగాహనలేమితో వినియోగదారులు నష్టపోతున్నారు. జీరో వ్యాపారాన్ని సాగిస్తూ అటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అడ్డగోలు సంపాదనే ధ్యేయంగా పలువురు సెల్‌షాపుల యజమానులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చిత్తూరుకు చెందిన ఓ సెల్ దుకాణం వారు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడి దొరికిపోయిన ఘటన సెల్ దుకాణాల అక్రమ వ్యాపారాలకు నిదర్శనం. ఈ విషయాన్ని గుర్తించిన రెండు సెల్ కంపెనీల యజమానులు సెల్ షాపు యజమానిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా పలు సెల్‌షాపుల యజమానులు ఇదే పద్ధతిలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క చిత్తూరులోనే 58 సెల్షాపులుండగా, జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలోనే సెల్ దుకాణాలున్నాయి. వీటిలో ప్రధాన కంపెనీలతోపాటు వివిధ కంపెనీలకు చెందిన సెల్‌లను విక్రయిస్తున్నారు. సెల్ రిపేరుతో వినియోగదారులు షాపులకొస్తే చాలు వారి అక్రమాలు పురివిప్పుకుంటున్నాయి. కంపెనీ విడివిభాగాలను వేస్తామంటూ నమ్మబలికి నాసిరకం విడిభాగాలు వేసి పంపిస్తున్నారు. ప్రధాన కంపెనీకి చెందిన సెల్ అయితే విడిభాగాలను సైతం కాజేసి వాటి స్థానంలో నాసిరకం విడిభాగాలతో నింపి వినియోగదారులకు అంటగడుతున్నారు. దీంతో పట్టుపని పది రోజులు కూడా సెల్లు పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఇక వినియోగదారులకు నాసిరకం విడిభాగాలు అంటగట్టినా, కంపెనీ విడిభాగాలు వేసినట్లు రికార్డులు చూపి అటు సెల్ కంపెనీల వద్ద విడిభాగాలతో పాటు పెద్ద ఎత్తున కమీషన్లు గుంజుతున్నారు. మరోవైపు స్మగుల్ గూడ్స్ పార్టులతో జీరో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బిల్లులు లేకుండా అయితే ఒక్కొక్క ప్రధాన పార్టుపై రూ.1000 నుంచి 1500 వరకు తగ్గింపు ధరలు అని చెప్పి నాణ్యత లేని పార్టును వినియోగదారులకు అంటగడుతూ వినియోగదారులను మోసగించడమే గాక ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అధిక శాతం సెల్ దుకాణాలు ఇదే తీరులో అక్రమాలకు పాల్పడుతున్నారని ఓ సెల్ దుకాణ యజమాని ‘సాక్షి’కి వివరించారు. సెల్ వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో ఈ స్థాయి అక్రమాలను ప్రధాన సెల్ కంపెనీలు గుర్తించే పరిస్థితి తక్కువేనని ఆయన వివరించారు. ఒక్క నెలలోనే వందల డిస్ప్లేలు మార్చినట్లు రికార్డులు ఉండడంతోనే సెల్ దుకాణ యజమాని పట్టుబడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రధాన కంపెనీలు సైతం సెల్ దుకాణాల అక్రమాలపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు అటు వాణిజ్య పన్నుల శాఖ, జిల్లా పోలీసుయంత్రాంగం సైతం సెల్ దుకాణాల అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. -
ఆ పోలీసు రూటు... సపరేటు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆ పోలీసు అధికారి అంటే చాలు, తుంగతుర్తి ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఏ చిన్న తగాదా జరిగినా, ఏదో రకంగా తెలుసుకుని ఇరువర్గాల నుంచి వసూలు చేయడం నేర్చుకున్న ఆయన తీరుకు జడిసి పోలీస్స్టేషన్ల గడప తొక్కాలంటే భయపడిపోతున్నారు. అన్ని అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటూ సొమ్ము చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటుసారా తయారీ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బెల్లం వినియోగమూ అధికమే. ఇంకే, వరంగల్ జిల్లాకు చెందిన తన సమీప బంధువు హోల్‌సేల్ బెల్లం వ్యాపారిగా అవతారం ఎత్తగా, ఈ అధికారి బెల్లం లారీలకు ఎస్కార్టు కల్పిస్తున్నారు. ఎక్కడా వాహనాన్ని ఆపకుండా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని పోలీసులను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నా యి. దీంతో ఈ ప్రాంతంలో బెల్లం వ్యాపారంపై వీరిదే గుత్తాధిపత్యం. తిరుమలగిరిలో ఇటీవల ఓ వ్యాపారి బెల్లం దుకాణం తెరవాలని ప్రయత్నిస్తే ‘ఎట్లెట్ల బెల్లం అమ్ముతవో చూస్తా ’.. అని బెదిరించి మరీ దుకాణం తెరవకుండా చేశాడని సమాచారం. నిత్యం జిల్లాలోని పలుప్రాంతాలగుండా వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి బెల్లం లారీలు తిరగడం, ఇబ్బడి ముబ్బడిగా బెల్లం క్రయవిక్రయాలు జరగడం ఈ పోలీసు అధికారి పుణ్యమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురులకూ.. అండాదండా మూసీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక దందాకు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్న ఈ అధికారి ఇప్పటికే కావాల్సినంత వెనకేశాడని సమాచారం. ఇక, ఇక్కడ ఉంటే లాభం లేదని ఆయకట్టు ప్రాంతానికి బదిలీ చేయించుకునే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మూసీనది నుంచి తవ్వేస్తున్న వందలాది లారీల ఇసుక జిల్లా సరిహద్దులు దాటుతోంది. ఇలా, తన సరిహద్దులు దాటించినందుకు భారీగానే వ సూలు చేస్తున్నాడన్న అభియోగం ఉంది. గతంలో కొందరు పోలీసులు ఏకంగా ఇసుక రవాణాకు లారీలను పెట్టిన ఉదంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. తానేం తక్కువ తినలేదన్న రీతిలో ఈ అధికారి అక్రమ ఇసుక వ్యాపారాన్ని బాగానే ప్రోత్సహిస్తున్నారు. అన్నింట్లోనూ వేలు దూరుస్తూ.. సివిల్ తగాదాల్లో తలదూర్చడమే కాదు, స్టేషన్లలో పనిచేసే సిబ్బందిలో ఒకరిద్దరిని తన ఏజెంట్లుగా పెట్టుకుని ప్రతి తగాదాలో వేలు పెట్టి డబ్బు గుంజుతున్నారని కొందరు బాధితులు లబోదిబోంటున్నారు. ప్రధానంగా అర్వపల్లి స్టేషన్లో ఈ అధికారి ఏజెంటు ఒకరు నిందితులకే కాదు, ఫిర్యాదుదారులకు కూడా చుక్కలు చూపిస్తున్నాడని, సదరు అధికారి పూర్తిస్థాయి మద్దతు ఈయనకు ఉండడంతో పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతల అండదండలు పుష్కలంగా ఉన్న సదరు అధికారి, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకర్గాలకే బదిలీ చేయించుకునే పనిలో పడినట్లు సమాచారం. కేవలం డబ్బు సంపాదనే కాకుండా, కొన్ని అనైతిక చర్యల్లో పాల్గొంటున్న సదరు అధికారి తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్న ఈ ప్రాంత ప్రజలు రకరకాలుగా చ ర్చించుకుంటున్నారు. ఇంత బహిరంగంగా ఆ అధికారి వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతుంటే ఉన్నతాధికారులకు ఇవేవీ కనిపించకపోవడం గమనార్హం.