అమ్మో! ఇవన్నీ దొంగతనాలే!?
సెల్ఫ్‌చెక్
మీరెప్పుడైనా దొంగతనం చేశారా?... అంటే నిస్సంకోచంగా, నిర్భయంగా లేదని చెప్పేస్తాం. ఇంతకీ దొంగతనం జాబితా తెలిస్తే... ‘నేను దొంగతనానికి పాల్పడిన సందర్భం ఒక్కటీ లేదు’ అనలేం. ఒకసారి చెక్ చేసుకోండి.
1. ఇతరుల వస్తువులు, డబ్బును సంగ్రహించడం మాత్రమే దొంగతనం.
ఎ. కాదు బి. అవును
2. ఒకరి ఆలోచనలను తమ ఆలోచనలుగా ప్రకటించుకోవడమూ దొంగతనమేనని మీ అభిప్రాయం.
ఎ. అవును బి. కాదు
3. కథను, కథావస్తువును కాపీ కొట్టడం నైతికంగానే కాక చట్టపరంగా కూడా నేరమని తెలుసు.
ఎ. అవును బి. కాదు
4. స్నేహితులు మనతో పంచుకున్న భావాలను మనమే ముందు ఆచరణలోకి తెచ్చి మెప్పును సొంతం చేసుకోవాలనుకోవడాన్ని మించిన అనైతికం మరొకటి ఉండదని నమ్ముతారు.
ఎ. అవును బి. కాదు
5. పనివారి శ్రమకు తగిన మూల్యాన్ని ఇవ్వకపోవడం దొంగతనమేనని జైన మతం చెబుతోందని తెలుసు.
ఎ. అవును బి. కాదు
6. ఒకరి నుంచి అయాచితంగా ఏదైనా తీసుకోవడమూ అస్తేయ (దొంగత నం) మేనని జైనత్రిరత్నాల ఉద్దేశం.
ఎ. అవును బి. కాదు
7. దొరికిన వస్తువునైనా సరే సొంతానికి వాడుకుంటే జైనం అంగీకరించదని తెలుసు. వాటిని సమాజ సేవకు ఉపయోగిస్తారు.
ఎ. అవును బి. కాదు
8. అక్రమ వ్యాపారాలు, దొంగిలించిన వస్తువులను తక్కువకు కొనడం కూడా అస్తేయంలో దోషమే.
ఎ. అవును బి. కాదు
9. ఎవరైనా అవసరానికి అమ్ముతుంటే అదే అవకాశంగా తక్కువకు కొనడం కూడా దొంగతనమేనని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే దొంగతనం అనే పదానికి ఉన్న విస్తృతమైన అర్థం మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే ముందు దొంగతనం అంటే ఏమిటో తెలుసుకోండి.