illegal confinement
-
ఆశ్రమం కాదది.. అత్యాచారాల అడ్డా !
సాక్షి, న్యూఢిల్లీ : పేరుకే అది ఆశ్రమం. పైకి చూసే వారికి అక్కడ ఆధ్మాత్మిక కార్యక్రమాలు, సేవలు జరుగుతాయి. కానీ, అందులో జరిగేది మాత్రం మరొకటి. గుర్మీత్ ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అచ్చం అలాంటివే. అది కూడా ఢిల్లీకి సమీపంలోనే.. ఎందరో మైనర్ల జీవితాలు ఆ ఆశ్రమంలో కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నాయి. ఆశ్రమం కాస్త అత్యాచారాల అడ్డాగా మారడంతో ఈ విషయం గుర్తించిన ఓ ఎన్జీవో చొరవతో దాని బండారం బయటపడింది. పోలీసులు రైడింగ్ చేసి రెండు గంటలపాటు కష్టపడి అందులో వారిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను ఆ కూపంలో నుంచి బయటపడేశారు. వివరాల్లోకి వెళితే.. రోహిణీ ప్రాంతంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ అనే ఆశ్రమం ఉంది. అందులో దాదాపు 14 ఏళ్లుగా కొంతమంది మైనర్లను, మహిళలను బలవంతంగా నిర్భందించి చేయకూడని పనులు చేస్తున్నారని ఓ ఎన్జీవో గమనించింది. అందులో నుంచి అతి కష్టం మీద ఓ మైనర్‌ను కూడా విడిపించుకొచ్చి కోర్టుకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పారు. దీంతో ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు పట్టింపు లేకుండా పోయిందని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల బృందం, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలైవాల్ బృందం ఏకకాలంలో ఆశ్రమంపై దాడి చేశారు. వారికి కూడా బాధితులను చేరుకునేందుకు దాదాపు రెండు గంటలు పట్టింది. ఈ సందర్భంగా స్వాతి మలైవాల్ మీడియాతో మాట్లాడుతూ 'ఆశ్రమంలోకి వెళ్లిన మాపై దాడులు చేసేందుకు వారు ప్రయత్నించారు. దాదాపు గంటసేపు మమ్మల్ని బందించే ప్రయత్నం చేశారు. అందులో తమపై లైంగిక దాడులు జరిగినట్లు భారీ సంఖ్యలో లేఖలు, ఇంజెక్షన్లు, మందులు పెద్దమొత్తంలో దొరికాయి' అని చెప్పారు. ఇక ఈ కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చుట్టూ గోడలు కట్టి వాటిపై ఫెన్సింగ్ పెట్టి బయటపడకుండా జంతువుల్లా చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి చెప్పింది. -
పేషెంట్ అక్రమ నిర్బంధం: ఆస్పత్రిపై కోర్టు ఆగ్రహం
ఆస్పత్రులు బిల్లులు పేల్చేసి, చివరి పైసా కట్టేదాకా పేషెంట్ ను వదిలేది లేదని భయపెట్టే ఆస్పత్రులకు ముంబాయి హైకోర్టు దిమ్మదిరిగే ఆదేశాలిచ్చింది. తక్షణమే అక్రమంగా నిర్బంధించి ఉంచిన పేషెంట్ ను విడుదల చేయించమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ముంబాయికి చెందిన సంజయ్ ప్రజాపతి తన తమ్ముడికి తలకు దెబ్బ తగిలితే ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అయితే ట్రీట్ మెంట్ సరిగ్గా జరగడం లేదని అతనికి అనుమానం వచ్చింది. దాంతో వేరే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రి అధికారులు 4.56 లక్షలు చెల్లించమన్నారు. అందులో ఆయన 2.76 లక్షలు చెల్లించాడు. మిగతా మొత్తం విషయంలో తనకు అభ్యంతరాలున్నాయన్నాడు. అది చెల్లిస్తేనే తప్ప డిశ్చార్జి చేసేది లేదని ఖరాఖండిగా చెప్పారు ఆస్పత్రి అధికారులు. చేసేదేమీ లేక ప్రజాపతి కోర్టు తలుపులు తట్టాడు. కేసు విన్న హైకోర్టు ఆస్పత్రి తీరును గర్హించడమే కాక, తక్షణమే పేషంట్ ను విడుదల చేసేలా చూడమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విన్న న్యాయమూర్తి కనాడే ఆస్పత్రి సిబ్బంది, అధికారులు పేషంట్లను ఇలా అక్రమంగా నిర్బంధించడానికి వీల్లేదని అన్నారు. తాను ఒక పేషంట్ కు గ్యారంటీగా ఉన్నా ఒక ఆస్పత్రి అధికారులు పేషంట్ ను నిర్బంధించిన వైనాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ చర్యను ఆయన అమానుషమైనదిగా పేర్కొన్నారు. -
పేషెంట్ అక్రమ నిర్బంధం: ఆస్పత్రిపై కోర్టు ఆగ్రహం
ఆస్పత్రులు బిల్లులు పేల్చేసి, చివరి పైసా కట్టేదాకా పేషెంట్ ను వదిలేది లేదని భయపెట్టే ఆస్పత్రులకు ముంబాయి హైకోర్టు దిమ్మదిరిగే ఆదేశాలిచ్చింది. తక్షణమే అక్రమంగా నిర్బంధించి ఉంచిన పేషెంట్ ను విడుదల చేయించమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ముంబాయికి చెందిన సంజయ్ ప్రజాపతి తన తమ్ముడికి తలకు దెబ్బ తగిలితే ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అయితే ట్రీట్ మెంట్ సరిగ్గా జరగడం లేదని అతనికి అనుమానం వచ్చింది. దాంతో వేరే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రి అధికారులు 4.56 లక్షలు చెల్లించమన్నారు. అందులో ఆయన 2.76 లక్షలు చెల్లించాడు. మిగతా మొత్తం విషయంలో తనకు అభ్యంతరాలున్నాయన్నాడు. అది చెల్లిస్తేనే తప్ప డిశ్చార్జి చేసేది లేదని ఖరాఖండిగా చెప్పారు ఆస్పత్రి అధికారులు. చేసేదేమీ లేక ప్రజాపతి కోర్టు తలుపులు తట్టాడు. కేసు విన్న హైకోర్టు ఆస్పత్రి తీరును గర్హించడమే కాక, తక్షణమే పేషంట్ ను విడుదల చేసేలా చూడమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విన్న న్యాయమూర్తి కనాడే ఆస్పత్రి సిబ్బంది, అధికారులు పేషంట్లను ఇలా అక్రమంగా నిర్బంధించడానికి వీల్లేదని అన్నారు. తాను ఒక పేషంట్ కు గ్యారంటీగా ఉన్నా ఒక ఆస్పత్రి అధికారులు పేషంట్ ను నిర్బంధించిన వైనాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ చర్యను ఆయన అమానుషమైనదిగా పేర్కొన్నారు.