illegal detention
-
చిన్నారిని సంరక్షణలోకి తీసుకోవడం అక్రమ నిర్బంధం కాదు
సాక్షి, అమరావతి: తల్లి మరణించిన చిన్నారిని అమ్మమ్మ, తాతయ్య తమ సంరక్షణలోకి తీసుకోవడం అక్రమ నిర్బంధం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంది. చిన్నారిని అమ్మమ్మ తాతయ్య తమ సంరక్షణలోకి తీసుకోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించలేమని పేర్కొంది. తన భార్య మరణించిన నేపథ్యంలో పదినెలల తన కుమార్తెను తన అత్తమామలు అక్రమంగా నిర్బంధించారంటూ బాపట్లకు చెందిన గోపి అనే వ్యక్తి దాఖలుచేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టేసింది. సహజసిద్ధ సంరక్షకుల హక్కులను నిర్ధారించేముందు ఆ చిన్నారి సంరక్షణ అత్యంత ముఖ్యమని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తుచేసింది. చిన్నారి కస్టడీ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని గోపీకి సూచిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రతి ఆదివారం వెళ్లి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉన్న ఆ చిన్నారిని చూసుకునేందుకు గోపీకి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. తన భార్య చనిపోయిన తరువాత తన కుమార్తెను తన అత్తమామలు అక్రమంగా నిర్బంధించారని, ఆ చిన్నారిని కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గోపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారించింది. -
ఆ పోలీసులపై చర్య తీసుకోవాలి
శివరాజు అక్రమ నిర్బంధంపై పౌరహక్కుల సంఘం నాయకుల డిమాండ్ నార్లాపూర్ నుంచి తీసుకెళ్లి పస్రాలో పట్టుబడినట్లు కట్టు కథలు అల్లుతున్నారని ధ్వజం హన్మకొండ : తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన సిద్దబోయిన శివరాజును అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్య తీసుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు అనంతుల సురేష్, ప్రధాన కార్యదర్శి రమేష్ చందర్ నాయకులు మాదన కుమారస్వామి, గుంటి రవితో కూడిన పౌరహక్కుల సంఘం (సీఎల్సీ) బృందం తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు వెళ్లి శివరాజు ఉదంతానికి సంబంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించింది. ఈ మేరకు ఆ వివరాలను సంఘం విడుదల చేసింది. వారి కథనం ప్రకారం.. ఈ నెల 11న ఉదయం 9 గంటలకు సాధారణ దుస్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఆటోలో నార్లాపూర్‌కు చేరుకున్నారు. నేరుగా మద్యం షాపునకు వెళ్లి మద్యం తాగుతూ యజమానితో మాటమాట కలిపి సిద్ధబోయిన శివరాజుకు సంబంధించిన వివరాలు సేకరించారు. సెల్‌ఫోన్ నంబర్ తీసుకున్నారు. అక్కడి నుంచి శివరాజు ఇంటికి వెళ్లి తాము ఖమ్మం జిల్లా వాజేడు నుంచి వచ్చామని శివరాజు స్నేహితులమని ఇంట్లో ఉన్న శివరాజు సోదరితో చెప్పారు. అక్కడి నుంచి శివరాజుకు ఫోన్ చేసి అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. గ్రామ చివరలో ఉన్న టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు అశోక్ ఇంట్లో కలుద్దామని చెప్పి, అక్కడే కలుసుకున్నారు. తన కు 10 ఎకరాల భూమి కావాలని, కొనడానికి వచ్చానని నీ సాయం కావాలని కోరాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తిని సాగనంపడానికి శివ రాజు ఆటో దగ్గరికి వెళ్లగానే ఆటోలో కూర్చు న్న మరో వ్యక్తి అతడిని ఆటోలోకి లాగగా బయట ఉన్న వ్యక్తి కాళ్లు ఎత్తి ఆటోలో పడేశా డు. ఈ ఘర్షణలో శివరాజు తలకు గాయమైం ది. ఊరు చివర్లో ఇల్లు ఉండంతో జన సంచా రం లేదు. ఒక అమ్యాయి ఈ దృశ్యాన్ని చూస్తుండగానే క్షణాల్లో ఆటో వెళ్లి పోయింది. ఆమె ద్వారా సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు శివరాజును ఎవరో గుర్తుతెలియని అగంతుకులు ఆపహరించుకుపోయారని తాడ్వాయి పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం మంత్రి చందులాల్, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ కాక లింగయ్య కు ఫోన్ చేశారు. అయినా ఆచూకీ తెలియలేదు. అదేరోజు సాయంత్రం కిరణ్‌ను ఇదే పద్ధతిలో పస్రాలో ఎత్తుకుపోయి మరుసటి రోజు వదిలిపెట్టారు. శివరాజు కుటుంబ సభ్యులు వెళ్లి ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌ను కలిస్తే తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన శివరాజు అరెస్టుపై పోలీసు లు కట్టుకథలు అలా ్లరు. మావోయిస్టు కేకేడ బ్ల్యూ కార్యదర్శి దామోదర్ కొరియర్‌గా సిద్దబోయిన శివరాజు పని చేస్తున్నాడని, పస్రా వ ద్ద ములుగు, ఏటూరు నాగారం పోలీసులకు పట్టుబడినట్లు శివరాజును తనిఖీ చేయగా నాలుగు డిటోనేటర్లు, నాలుగు జిలెటిన్ స్టిక్స్ దొరికినట్లు ప్రకటించి అసత్య ప్రకటనలు చేశారని పౌరహక్కుల సంఘం నాయకులు పేర్కొన్నారు. చట్ట ప్రకారం 24 గంటల్లో కోర్టులో ప్రవేశ పట్టాల్సి ఉండగా మూడు రోజులుగా అక్రమంగా నిర్భందించారని పేర్కొన్నారు. కోయ సామాజిక వర్గానికి చెందిన శివరాజు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని, టీఆర్ఎస్లో క్రియాశీల కార్యకర్త అని తెలిపారు. మంత్రి చందులాల్ గెలుపుకు అ హర్నిశలు కృషి చేశాడని ఒక వైపు తలవెం ట్రులు తీసుకొని దీక్ష బూనిన ఉద్యమకారుడని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నక్సలైట్ల ఎజెండా ఇదేనా అని పౌర హక్కుల సంఘం ప్రశ్నించింది. శివరాజును అక్రమంగా అరెస్టు చేసిన పోలీసుల పేర్లు ప్రకటించి వారిని కఠి నంగా శిక్షించాలని, అన్యాయంగా బనాయిం చిన కేసులను ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. -
సంప్రదాయమా..? చట్ట నిబంధనలా..?
* పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని ‘హెబియస్’ రూపంలో సవాలు చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ * అయితే ఇది 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయమన్న సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి * దీంతో హెబియస్ కార్పస్ రూపంలోనా.. రిట్ పిటిషన్ రూపంలోనా... అనేది తేల్చాలని హైకోర్టు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఏ వ్యక్తినైనా పోలీసులు ముందస్తు నిర్బంధ చట్టం(పీడీ యాక్ట్) కింద నిర్బంధిస్తే దానిని అక్రమ నిర్బంధంగా పేర్కొంటూ అతన్ని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడం యాభై ఏళ్ల నుంచి హైకోర్టులో వస్తున్న సంప్రదాయం.. పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని సవాలుచేస్తూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడానికి వీల్లేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న సమయంలో జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మౌఖికంగా జారీచేసిన ఆదేశం.. గత 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న కీలక విషయాన్ని తేల్చాలని హైకోర్టు తాజాగా నిర్ణయించింది. దీనిపై లోతైన విచారణ జరపనున్నట్టు పేర్కొంది. తమ భర్తలను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారని, వారిని వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నెల్లూరుకు చెందిన జి.అర్చన, చిత్తూరుకు చెందిన బి.హిమబిందు వేర్వేరుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్లు వేశారు. ఇవి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం విచారణకొచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల భర్తలైన జి.రామనాథరెడ్డి, నాగేంద్రనాయక్లను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. పీడీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను ఇలా హెబియస్ కార్పస్ రూపంలో దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. వాటిని రిట్ పిటిషన్ రూపంలో సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసుకోవాలని, ఇదే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఏజీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. బాంబే హైకోర్టు కూడా ఈ విషయాన్ని చెప్పిందని వ్యాఖ్యానించింది. దీనికి మోహన్‌రెడ్డి అడ్డుచెబుతూ.. గత 50 ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో పీడీ కేసుల్లో నిర్బంధాన్ని హెబియస్ కార్పస్ రూపంలోనే సవాలు చేస్తూ వస్తున్నామని, అదిక్కడ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. పీడీ కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయకూడదని రాజ్యాంగంలోగానీ, చట్ట నిబంధనల్లోగానీ, సుప్రీంకోర్టు తీర్పుల్లోగానీ ఎక్కడా లేదని, ఏజీకి సైతం ఈ విషయం స్పష్టంగా తెలుసని వివరించారు. సంప్రదాయం కొనసాగుతున్న మాట వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. దీంతో ధర్మాసనం, అయితే సంప్రదాయాన్ని కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న విషయంపై లోతైన విచారణ చేపడతామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా వెలువరించిన తీర్పులేవైనా ఉంటే, వాటిని తమ ముందుంచాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. -
అంగన్వాడీల అక్రమ నిర్బంధం
విజయవాడ : సమస్యలు పరిష్కరించాలని కోరినవారిపై ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతోంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు కొద్దిరోజులుగా దశలవారీగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కొనసాగింపుగా మంగళ, బుధవారాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో రెండొందల మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలను సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల్లో తరలివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారిని అంగన్వాడీ కేంద్రాల వద్ద మాటువేసి సాయంత్రానికి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారినుంచి పూచీకత్తు తీసుకుని, హైదరాబాద్ వెళ్లబోమని రాయించుకొని వదిలిపెట్టారు. మచిలీపట్నం, పెడన, హనుమాన్‌జంక్షన్, గన్నవరం, నూజివీడు, ఆగిరిపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయమే కొందరు అంగన్వాడీ సిబ్బంది హైదరాబాద్ తరలివెళ్లగా, వారి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐటీయూ జిల్లా నాయకులు తెలిపారు. పెడన, కృత్తివెన్నుల్లో నిరసన పెడన, కృత్తివెన్ను మండలాల్లో అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు ఆందోళనలకు దిగారు. పెడన మండలంలో దాదాపు 60 మంది కార్యకర్తలు, ఆయాలు సోమవారం రాత్రి 8.45 గంటల రైలుకు హైదరాబాదు వెళ్లేందుకు సిద్ధమవగా, పోలీసులు సంఘ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సుమారు 50 మంది అంగన్వాడీ కార్యకర్తలు అక్కడకు చేరుకొని అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కైకలూరు నియోజ కవర్గ నేత ఉప్పాల రాంప్రసాద్ పార్టీ నేతలతో కలిసి స్టేషన్‌కు వచ్చి అంగన్వాడీలకు మద్దతుగా బైఠాయించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కృత్తివెన్నులోనూ పోలీసుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు ఆందోళన చేశారు.