illegally Cases
-
వైఎస్సార్సీపీ నేత అక్రమ నిర్బంధం.. పరాకాష్టకు ‘కూటమి’ అరాచకాలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఈపూరు మండల వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ కొండవర్జి నాగేశ్వరరావు యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజాగళంలో మాట్లాడినందుకు నాగేశ్వరావును పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మిర్చి పొలానికి రాత్రి కాపలాకు నాగేశ్వరావు యాదవ్ దంపతులు వెళ్లగా.. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ లీగల్ టీం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ఈపూరు పోలీస్ స్టేషన్‌కు వైఎస్సార్సీపీ అధిష్టానం పంపించింది. దీంతో నాగేశ్వరరావు యాదవ్‌పై ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. ఈపూరు ఎస్ఐ వదిలేశారు.పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వినుకొండను కూటమి ప్రభుత్వం అరాచకాల అక్రమాలతో అనకొండగా మార్చిందని మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్‌ను టీడీపీ గుండాలు అత్యంత దారుణంగా హత్య చేశారు. పది నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. మీడియాతో మాట్లాడినందుకు నాగేశ్వరావు యాదవ్‌ను తీవ్రవాదిని తీసుకువెళ్లినట్టు పొలం నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో నేను వినుకొండ వచ్చాను. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వినుకొండలో దారుణాలు, అక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలను నాయకుల్ని పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భయపెడితే భయపడే రకం ఇక్కడ ఎవరూ లేరు. అన్నిటికి సిద్ధమయ్యే ఉన్నాం. ప్రభుత్వం ప్రజల హక్కులను కాల రాస్తోంది. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని బ్రహ్మనాయుడు హెచ్చరించారు. -
అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు
అనంతపురం సెంట్రల్ : తమ భూమిని అమ్మలేదని అక్రమంగా ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించారని ముదిగుబ్బ మండలం ఎనుముల వారిపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి, ఆయన భార్య, కొడుకు(పుట్టకతో మూగవారు) జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... సర్వేనెంబర్ 302, 304లో 2.84 ఎకరాలు, సర్వేనెంబర్ 302 బీ1లో 72 సెంట్లు 2014లో కదిరికి చెందిన మట్రా పార్వతికి రిజిస్టర్ చేయించామని తెలిపారు. అయితే ఆమె గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో తామే భూమిని సాగు చేస్తున్నామని వివరించారు. ఇటీవల వచ్చి తన భూమి తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాగా తాము విక్రయించమని, అప్పట్లో ఇచ్చిన డబ్బును కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పామన్నారు. దీంతో ఆమె స్వయంగా గాయపర్చుకొని కదిరి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ కేసు తమపై పెట్టిందని వివరించారు. తమతో పాటు గ్రామస్తులైన బయపరెడ్డి, కోటేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డిలను కేసులో అక్రమంగా ఇరికించారని తెలిపారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారని బాధితులు వివరించారు. -
తప్పుడు కేసులు ఎత్తివేయాలి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పీఎంకే నేతలపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ రవిరాజ్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లాలోని పీఎంకే నేతలు బాలయోగి, వెంకటేషన్, దినేష్‌కుమార్‌తో పాటు ఇతర పార్టీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయనున్నారని, ఇందు కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేసారని ఆరోపిస్తూ పీఎంకే నేతలు కలెక్టర్ వీరరాఘవరావు, ఎస్పీ రూపేష్‌కుమార్ మీనాను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పీఎంకే రాష్ర్ట ఉపాధ్యక్షుడు రవిరాజ్, రాష్ట్ర కార్యదర్శి శివగోవిందరాజన్తో పాటు ఇతర పార్టీ నేతలతో కలిసి దాదాపు వెయ్యి మంది ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రంలో, తాము పీఎంకేలో చురుగ్గావ్యవహరిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని వారు వాపోయారు. కేసులు నమోదుకు కారణాలు ఉండాలని, అయితే పోలీసులు ఎందుకు కేసులు పెడుతున్నారో అర్ధం కావడం లేదని వారు వాపోయారు. రాత్రి సమయంలో నేతల ఇళ్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారని, అర్ధరాత్రి సమయంలో తమ ఇంటి తలుపులు తడుతున్నారని ఎస్పీ, కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో వారు ఆరోపించారు. తమపై మంత్రులు, అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసులు పెడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. త్వరలో పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. కాగా పీఎంకే నేతల నుంచి వినతి పత్రం స్వీకరించిన కలెక్టర్ వీరరాఘవరావు, ఎిస్పీ మీనా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.