తప్పుడు కేసులు ఎత్తివేయాలి
Published Thu, Oct 31 2013 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పీఎంకే నేతలపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఏ రవిరాజ్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లాలోని పీఎంకే నేతలు బాలయోగి, వెంకటేషన్, దినేష్‌కుమార్‌తో పాటు ఇతర పార్టీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయనున్నారని, ఇందు కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేసారని ఆరోపిస్తూ పీఎంకే నేతలు కలెక్టర్ వీరరాఘవరావు,
ఎస్పీ రూపేష్‌కుమార్ మీనాను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పీఎంకే రాష్ర్ట ఉపాధ్యక్షుడు రవిరాజ్, రాష్ట్ర కార్యదర్శి శివగోవిందరాజన్‌తో పాటు ఇతర పార్టీ నేతలతో కలిసి దాదాపు వెయ్యి మంది ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రంలో, తాము పీఎంకేలో చురుగ్గావ్యవహరిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని వారు వాపోయారు. కేసులు నమోదుకు కారణాలు ఉండాలని, అయితే పోలీసులు ఎందుకు కేసులు పెడుతున్నారో అర్ధం కావడం లేదని వారు వాపోయారు.
రాత్రి సమయంలో నేతల ఇళ్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారని, అర్ధరాత్రి సమయంలో తమ ఇంటి తలుపులు తడుతున్నారని ఎస్పీ, కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో వారు ఆరోపించారు. తమపై మంత్రులు, అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసులు పెడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. త్వరలో పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. కాగా పీఎంకే నేతల నుంచి వినతి పత్రం స్వీకరించిన కలెక్టర్ వీరరాఘవరావు, ఎిస్పీ మీనా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement