సాక్షి, హైదరాబాద్: రవిరాజ్ (82 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్యూ గ్రూప్ 9 వికెట్ల తేడాతో మై హోమ్ గ్రూప్‌పై ఘనవిజయం సాధించింది. కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మై హోమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది.
అభినవ్ 38, వికాస్ 42 పరుగులు చేశారు. రవిరాజ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన స్యూ గ్రూప్ కేవలం 8.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రవిరాజ్ మెరుపులు మెరిపించాడు. 28 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అతను భారీ సిక్సర్లు, బౌండరీలతో అజేయ అర్ధసెంచరీ చేశాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఠ సిటీ బ్యాంక్: 136/8 (వికాస్ 34, ముకేశ్ 24, చందు 27; శ్రీకాంత్ 3/20, అరుణ్ 2/28), డాక్టర్ రెడ్డీస్: 138/5 (మన్‌ప్రీత్ 56 నాటౌట్, సుబ్బు 18; ముకేశ్ 2/28).
ఠ హెచ్‌డీఎఫ్‌సీ: 114/6 (తృంగున 38, విక్రమ్ 21; శ్రీకాంత్ 2/15), లక్ష్య్ కన్సల్టింగ్: 115/1 (షేన్ 81 నాటౌట్, వెంకట్ 25).
రవిరాజ్ ఆల్‌రౌండ్ ప్రతిభ
Published Mon, Aug 5 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement