Allround show
-
రీ ఎంట్రీలో దుమ్మురేపుతున్న రవీంద్ర జడేజా.. ఐదేయడంతో పాటు..!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. గాయం కారణంగా గత ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న జడ్డూ భాయ్.. వచ్చీ రాగానే టెస్ట్‌ల్లో తన ప్రతాపం చూపించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నిన్న బంతితో (5/68) మ్యాజిక్ చేసిన జడేజా.. ఇవాళ (ఫిబ్రవరి 10) బ్యాట్‌తో (53 నాటౌట్) రెచ్చిపోయాడు. ఈ సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో చెలరేగిన జడేజా.. తమిళనాడుపై ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్.. పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. టెస్ట్‌ల్లో జడేజా గత 10 ఇన్నింగ్స్‌లను ఓ సారి పరిశీలిస్తే.. గతేడాది జడ్డూ చివరిగా ఆడిన టెస్ట్ మ్యాచ్‌లోనూ శతకంతో మెరిశాడు. Five-wicket haul ✅ Half-century ✅ A comeback to remember for Ravindra Jadeja!#WTC23 | #INDvAUS | 📝: https://t.co/rzMJy0hUFm pic.twitter.com/73wVkN1xKI — ICC (@ICC) February 10, 2023 జూన్ 1 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. దానికి ముందు మార్చి 4న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన జడేజా.. ఏకంగా 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బంతితోనూ మ్యాజిక్ చేసిన జడ్డూ భాయ్.. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. దీనికి ముందు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ చేసి 5 వికెట్లు పడగొట్టిన జడేజా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇటీవలికాలంలో ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా రాటుదేలిన జడేజా.. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన మార్కు ప్రభావం చూపుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత రోహిత్ సహకారంతో చెలరేగిన (బ్యాటింగ్) జడేజా.. ఆతర్వాత సహచరులు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుతున్నా తాను మాత్రం ఏకాగ్రతతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 99 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 281/7గా ఉంది. జడేజాకు తోడుగా మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (22) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి భారత్ 105 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన స్టోక్స్
-
రవిరాజ్ ఆల్‌రౌండ్ ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: రవిరాజ్ (82 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్యూ గ్రూప్ 9 వికెట్ల తేడాతో మై హోమ్ గ్రూప్‌పై ఘనవిజయం సాధించింది. కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మై హోమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అభినవ్ 38, వికాస్ 42 పరుగులు చేశారు. రవిరాజ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన స్యూ గ్రూప్ కేవలం 8.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రవిరాజ్ మెరుపులు మెరిపించాడు. 28 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అతను భారీ సిక్సర్లు, బౌండరీలతో అజేయ అర్ధసెంచరీ చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఠ సిటీ బ్యాంక్: 136/8 (వికాస్ 34, ముకేశ్ 24, చందు 27; శ్రీకాంత్ 3/20, అరుణ్ 2/28), డాక్టర్ రెడ్డీస్: 138/5 (మన్‌ప్రీత్ 56 నాటౌట్, సుబ్బు 18; ముకేశ్ 2/28). ఠ హెచ్డీఎఫ్సీ: 114/6 (తృంగున 38, విక్రమ్ 21; శ్రీకాంత్ 2/15), లక్ష్య్ కన్సల్టింగ్: 115/1 (షేన్ 81 నాటౌట్, వెంకట్ 25).