రియల్ తుఫాన్‌లో వరుణ్ సందేశ్
రియల్ తుఫాన్‌లో వరుణ్ సందేశ్
Published Fri, Nov 8 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
వరుణ్‌సందేశ్ తొలిసారిగా త్రిభాషా చిత్రం చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఆ సినిమా పేరు ‘నాతో వస్తావా’. రవిరాజ్ దర్శకుడు. అజయ్ సూర్య, మణికుమార్ నిర్మాతలు. సంగీత దర్శకుడు చక్రికి ఇది వందో సినిమా కావడం విశేషం. బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాక చోప్రా కజిన్ బార్బీ చోప్రా ఇందులో కథానాయికగా చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే ప్రేమకథ ఇది. బెంగళూరులో తొలి షెడ్యూల్‌నీ, వైజాగ్ రామానాయుడు స్టూడియోలో మలి షెడ్యూల్ చేశాం.
వరుణ్‌సందేశ్, బార్బీ చోప్రా, సుమన్‌శెట్టి, కొండవలస, పావలా శ్యామల తదితరులపై వైజాగ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ముఖ్యంగా రియల్ తుఫానులో తీసిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. కష్టమైనా ఎంతో ఇష్టంగా చేసిన వరుణ్‌సందేశ్‌కి కృతజ్ఞతలు. మూడో షెడ్యూల్‌ని ఈ నెల 18 నుంచి చెన్నైలో 10 రోజులు చేస్తాం. సంక్రాంతికి పాటలను, ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: రాఘవేంద్ర, సమర్పణ: వివేక్‌నాయుడు, అర్జున్ కిషన్. నిర్మాణం: శ్రీ లక్ష్మీనరసింహ మూవీస్, బెంచ్‌మార్క్ మూవీస్.
Advertisement
Advertisement