Raviraj
-
తల్లిప్రేమ ముందు పులి ఎంత!
పులి అనగానే అమ్మో అనుకుంటాం. కాని అమ్మ ముందు పులి బలమెంత! ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పులితో పోరాడిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్ అయింది... మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లాలోని బందవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో రోహనియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన అర్చన చౌదరికి పదిహేను నెలల కొడుకు రవిరాజ్. కొడుకు నవ్వితే నవ్వేంత, ఏడిస్తే ఏడ్చేంత ప్రేమ తనకు! కొన్ని నెలల క్రితం చీమ కుట్టి కొడుకు ఏడుస్తుంటే తాను కూడా ఏడ్చేసింది. ఈసారి మాత్రం చీమ కుట్టలేదు. పులి ఎదురైంది! బిడ్డను నోట కరుచుకుపోవడానికి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం అర్చన ఏడ్వలేదు. వణికిపోలేదు. ఏం జరిగిందంటే... ఆరోజు రాత్రి బిడ్డ రవిరాజ్‌ను తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చింది అర్చన. అక్కడి పొదల్లో ఒక పులి కాచుకొని కూర్చుంది. వీరిని చూడగానే బయటికి వచ్చింది. పిల్లాడిని దూరంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. అంతే... అర్చన తన శక్తినంతా కూడదీసుకొని పెద్దగా అరుస్తూ ఎదురుదాడి ప్రారంభించింది. అర్చన కేకలు విన్న గ్రామస్థులందరూ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పులి తోకముడిచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది! తల, వీపు వెనుక గాయాలైన బిడ్డను, ఒళ్లంతా గాయాలైన తల్లిని గ్రామస్థులు వెంటనే హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘ఒక పులి టైగర్ రిజర్వ్ దాటి జనావాసాలలోకి వచ్చింది అని ప్రచారం చేస్తున్నాం. ఈ విషయం చాలామందికి తెలుసు’ అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారుగానీ అదెంత వరకు నిజమో తెలియదు. ‘మాకు అలాంటి వార్త గురించి ఏమీ తెలియదు’ అని చెబుతున్నాడు అర్చన భర్త బోలా చౌదరి. అరుదుగా మాత్రమే ఊరు దాటేది అర్చన. అలాంటి అర్చన పేరు ఇప్పుడు ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటింది. ‘తల్లి శక్తి ఏమిటో నిరూపించావు’ అని వేనోళ్ల కొనియాడుతున్నారు నెటిజనులు. ‘మా ఊళ్లోనే కాదు, ఇంకా చాలా ఊళ్లలో అర్చన పేరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె సాహసం అద్భుతం. పులిని చూడగానే వణికిపోయి, భయపడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిని ఇచ్చే సాహసం ఆమెది’ అంటుంది రోహనియ గ్రామానికి చెందిన కులుమతి. ఆరోజు అర్చన అరుపులు విని పరుగెత్తుకు వచ్చిన వారిలో కుష్వా అనే రైతు ఉన్నాడు. ‘అరుపులు వినగానే ప్రమాదాన్ని ఊహించి కట్టె తీసుకొని పరుగెత్తుకు వచ్చాను. అక్కడికి వెళ్లగానే విషయం అర్థమైంది. అందరం గట్టిగా అరుస్తూ ముందుకు వెళుతుంటే పులి భయపడి పారిపోయింది. తల్లీబిడ్డలను ఆ దేవుడే రక్షించాడు’ అంటున్నాడు కుష్వా. చాలామందికి మాత్రం అర్చన తన బిడ్డను రక్షించుకున్న దేవత. ఊరి జనాల నుంచి నెటిజనుల వరకు అర్చనా చౌదరి సాహసానికి అందరూ జై కొడుతున్నారు. -
రియల్ తుఫాన్లో వరుణ్ సందేశ్
వరుణ్‌సందేశ్ తొలిసారిగా త్రిభాషా చిత్రం చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఆ సినిమా పేరు ‘నాతో వస్తావా’. రవిరాజ్ దర్శకుడు. అజయ్ సూర్య, మణికుమార్ నిర్మాతలు. సంగీత దర్శకుడు చక్రికి ఇది వందో సినిమా కావడం విశేషం. బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాక చోప్రా కజిన్ బార్బీ చోప్రా ఇందులో కథానాయికగా చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే ప్రేమకథ ఇది. బెంగళూరులో తొలి షెడ్యూల్‌నీ, వైజాగ్ రామానాయుడు స్టూడియోలో మలి షెడ్యూల్ చేశాం. వరుణ్‌సందేశ్, బార్బీ చోప్రా, సుమన్‌శెట్టి, కొండవలస, పావలా శ్యామల తదితరులపై వైజాగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ముఖ్యంగా రియల్ తుఫానులో తీసిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. కష్టమైనా ఎంతో ఇష్టంగా చేసిన వరుణ్‌సందేశ్‌కి కృతజ్ఞతలు. మూడో షెడ్యూల్‌ని ఈ నెల 18 నుంచి చెన్నైలో 10 రోజులు చేస్తాం. సంక్రాంతికి పాటలను, ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: రాఘవేంద్ర, సమర్పణ: వివేక్నాయుడు, అర్జున్ కిషన్. నిర్మాణం: శ్రీ లక్ష్మీనరసింహ మూవీస్, బెంచ్‌మార్క్ మూవీస్. -
తప్పుడు కేసులు ఎత్తివేయాలి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పీఎంకే నేతలపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ రవిరాజ్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లాలోని పీఎంకే నేతలు బాలయోగి, వెంకటేషన్, దినేష్‌కుమార్‌తో పాటు ఇతర పార్టీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయనున్నారని, ఇందు కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేసారని ఆరోపిస్తూ పీఎంకే నేతలు కలెక్టర్ వీరరాఘవరావు, ఎస్పీ రూపేష్‌కుమార్ మీనాను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పీఎంకే రాష్ర్ట ఉపాధ్యక్షుడు రవిరాజ్, రాష్ట్ర కార్యదర్శి శివగోవిందరాజన్తో పాటు ఇతర పార్టీ నేతలతో కలిసి దాదాపు వెయ్యి మంది ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రంలో, తాము పీఎంకేలో చురుగ్గావ్యవహరిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని వారు వాపోయారు. కేసులు నమోదుకు కారణాలు ఉండాలని, అయితే పోలీసులు ఎందుకు కేసులు పెడుతున్నారో అర్ధం కావడం లేదని వారు వాపోయారు. రాత్రి సమయంలో నేతల ఇళ్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారని, అర్ధరాత్రి సమయంలో తమ ఇంటి తలుపులు తడుతున్నారని ఎస్పీ, కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో వారు ఆరోపించారు. తమపై మంత్రులు, అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసులు పెడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. త్వరలో పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. కాగా పీఎంకే నేతల నుంచి వినతి పత్రం స్వీకరించిన కలెక్టర్ వీరరాఘవరావు, ఎిస్పీ మీనా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
రవిరాజ్ ఆల్‌రౌండ్ ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: రవిరాజ్ (82 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్యూ గ్రూప్ 9 వికెట్ల తేడాతో మై హోమ్ గ్రూప్‌పై ఘనవిజయం సాధించింది. కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మై హోమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అభినవ్ 38, వికాస్ 42 పరుగులు చేశారు. రవిరాజ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన స్యూ గ్రూప్ కేవలం 8.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రవిరాజ్ మెరుపులు మెరిపించాడు. 28 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అతను భారీ సిక్సర్లు, బౌండరీలతో అజేయ అర్ధసెంచరీ చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఠ సిటీ బ్యాంక్: 136/8 (వికాస్ 34, ముకేశ్ 24, చందు 27; శ్రీకాంత్ 3/20, అరుణ్ 2/28), డాక్టర్ రెడ్డీస్: 138/5 (మన్‌ప్రీత్ 56 నాటౌట్, సుబ్బు 18; ముకేశ్ 2/28). ఠ హెచ్డీఎఫ్సీ: 114/6 (తృంగున 38, విక్రమ్ 21; శ్రీకాంత్ 2/15), లక్ష్య్ కన్సల్టింగ్: 115/1 (షేన్ 81 నాటౌట్, వెంకట్ 25).