అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు | illegally cases file on sc, st atrocity | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు

Published Tue, Jul 26 2016 11:32 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

తమ భూమిని అమ్మలేదని అక్రమంగా ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించారని ముదిగుబ్బ మండలం ఎనుముల వారిపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి, ఆయన భార్య, కొడుకు(పుట్టకతో మూగవారు) జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.

అనంతపురం సెంట్రల్‌ : తమ భూమిని అమ్మలేదని అక్రమంగా ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించారని ముదిగుబ్బ మండలం ఎనుముల వారిపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి, ఆయన భార్య, కొడుకు(పుట్టకతో మూగవారు) జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు...  సర్వేనెంబర్‌ 302, 304లో 2.84 ఎకరాలు, సర్వేనెంబర్‌ 302 బీ1లో 72 సెంట్లు 2014లో కదిరికి చెందిన  మట్రా పార్వతికి రిజిస్టర్‌ చేయించామని తెలిపారు. అయితే ఆమె గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో తామే భూమిని సాగు చేస్తున్నామని వివరించారు.


ఇటీవల వచ్చి తన భూమి తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోందని తెలిపారు. కాగా తాము విక్రయించమని, అప్పట్లో ఇచ్చిన డబ్బును కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పామన్నారు. దీంతో ఆమె స్వయంగా గాయపర్చుకొని కదిరి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ కేసు తమపై పెట్టిందని వివరించారు. తమతో పాటు గ్రామస్తులైన బయపరెడ్డి, కోటేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డిలను కేసులో అక్రమంగా ఇరికించారని తెలిపారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారని బాధితులు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement