st atrocity
-
టీడీపీ నేతల దాడి కేసులో.. వారికి ‘సెక్షన్–41ఏ’ నోటీసులివ్వండి
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసులో ముందు వారికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు గురువారం తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులిచ్చారు. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇతర నేతలు, కార్యకర్తలు ఈ నెల 17న కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద శాంతియుతంగా ధర్నాకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, వారు తీసుకొచ్చిన కిరాయి రౌడీలు ఎమ్మెల్యే తదితరులపై దాడిచేశారు. దీనిపై జోగి రమేష్ డ్రైవర్ తాండ్ర రాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, అధికార ప్రతినిధి పట్టాభితో పాటు ఇతర నేతలు నాగుల్‌మీరా, సుంకర విష్ణుకుమార్, జంగాల సాంబశివరావు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు
అనంతపురం సెంట్రల్ : తమ భూమిని అమ్మలేదని అక్రమంగా ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించారని ముదిగుబ్బ మండలం ఎనుముల వారిపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి, ఆయన భార్య, కొడుకు(పుట్టకతో మూగవారు) జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... సర్వేనెంబర్ 302, 304లో 2.84 ఎకరాలు, సర్వేనెంబర్ 302 బీ1లో 72 సెంట్లు 2014లో కదిరికి చెందిన మట్రా పార్వతికి రిజిస్టర్ చేయించామని తెలిపారు. అయితే ఆమె గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో తామే భూమిని సాగు చేస్తున్నామని వివరించారు. ఇటీవల వచ్చి తన భూమి తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాగా తాము విక్రయించమని, అప్పట్లో ఇచ్చిన డబ్బును కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పామన్నారు. దీంతో ఆమె స్వయంగా గాయపర్చుకొని కదిరి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ కేసు తమపై పెట్టిందని వివరించారు. తమతో పాటు గ్రామస్తులైన బయపరెడ్డి, కోటేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డిలను కేసులో అక్రమంగా ఇరికించారని తెలిపారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారని బాధితులు వివరించారు.