illicit liquor case
-
‘సారా తాగితే చస్తారు’.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్
పట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. శరన్ జిల్లాలో బుధవారం కల్తీ సారా కాటుకు 21 మంది బలవగా.. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. వారంతా మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. సారాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష బీజేపీ సభ్యులు ఆరోపించారు. వారిపై సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు. తాగిన వారు చస్తారు.. జాగ్రత్త కల్తీసారా అంశంపై అసెంబ్లీ వేదికగా విపక్షాలపై మడ్డిపడ్డ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మద్యం తాగుతారో వారు చనిపోతారు అంటూ పేర్కొన్నారు. ఛాప్రా కల్తీ సారా ఘటనపై మీడియాతో మాట్లాడారు నితీశ్. ‘లిక్కర్ తాగే వారు చనిపోతారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాపు(మహాత్మా గాంధీ) ఏం చెప్పారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నాం. చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజలే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. నిషేధం ఉన్న చోట లిక్కర్ అమ్ముతున్నారంటే.. అందులో ఏదో ఉన్నట్లు అర్థం. కొందరు తెలిసి తప్పులు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు నితీశ్ కుమార్. ఇదీ చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా నిర్మూలనకు పోలీసులు కదం తొక్కారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా కేంద్రాలపై పోలీసు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుండి దాడులు చేస్తున్నారు. పదివేల మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగుతున్నాయి. వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సీఐలు,ఎస్సైలు, పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు జరుగుతున్నాయి. నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాలను జల్లెడపడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేస్తున్నారు. -
కల్తీ మద్యం ఘటన : 133కు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఆదివారం 133కు చేరింది. జోర్హాత్ జిల్లాలోని మారుమూల గ్రామాలతో పాటు, సల్మోరా టీ ఎస్టేట్‌లో గురువారం రాత్రి కల్తీ మద్యం సేవించి పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా, కల్తీ మద్యం, తయారీలో పాలుపంచుకున్న పది మందిని అరెస్ట్ చేశామని అదనపు డీజీపీ ముఖేష్ అగర్వాల్ తెలిపారు. లిక్కర్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపామని, నివేదిక కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఎక్సైజ్ చట్ట ఉల్లంఘన, మద్యం అక్రమ తయారీ, విక్రయాలకు సంబంధించి మొత్తం 90 కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 22 నుంచి తాము 4860 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. మరోవైపు కల్తీ మద్యంతో తీవ్ర అస్వస్ధతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జోర్హాత్ మెడికల్ కాలేజ్‌లో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ పరామర్శించారు. కల్తీ మద్యం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ రెండు లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు. -
'కావలి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదు'
నెల్లూరు: నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నెల్లూరు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు, చానల్స్‌ల్లో వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. కేసు నమోదు చేసినట్లు వచ్చిన కథనాలు అవాస్తవాలని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.