illigal tranfort
-
గంజాయి సరఫరా: ఇద్దరు కానిస్టేబుళ్ల కీలక పాత్ర
ఖమ్మం క్రైం: గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయా ల్సిన పోలీసులే ఆ పనికి తెగబడ్డారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన జీఆర్పీ కానిస్టేబుల్ ఒకరు గంజాయి రవాణాలో చిక్కిన విషయం తెలిసిందే. ఇది మరువకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యవహారం పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తోంది. ఈ దందాలో ఓ జైలు వార్డర్ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఘటనలో ఐదుగురి పాత్ర ఉండగా.. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఈ కానిస్టేబుళ్లు భారీ ఎత్తున స్మగ్లింగ్ సాగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పరారీలో ముగ్గురు.. ఖమ్మం పోలీసు హెడ్ క్వార్టర్లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, భద్రాద్రి కొత్తగూడెంలోని హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న మరో ఏఆర్ కానిస్టేబుల్ కొంత కాలంగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఖమ్మం మమత రోడ్డులోని హార్వెస్ట్ స్కూల్ సమీపంలో మంగళవారం గంజా యి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం అర్బన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరి వద్ద తనిఖీ చేయగా ఐదు కేజీల గంజాయి లభించినట్లు ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. వీరిని విచారించగా.. ఖమ్మంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కొండ సతీశ్, కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన రైతు పల్లెబోయిన వెంకటేశ్వరుగా తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తమ సమీప బంధువైన కారేపల్లి మండలం తుడితెలగూడెంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొనుగోలు చేసిన ఐదు కేజీల గంజాయిని కానిస్టేబుల్ సతీష్‌కు ఇచ్చినట్లు వెంకటేశ్వర్లు తెలిపాడు. ఈ కేసులో భద్రాద్రి జిల్లా కానిస్టేబుల్, విద్యార్థితో పాటు ఖ మ్మం జైలు వార్డర్ కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం. వీరిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. జైలుకు వచ్చే నేరస్తులతో పరిచయం ఓ కానిస్టేబుల్, రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా ఖమ్మం జైలు వార్డర్‌తోపాటు మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో జైలు వార్డర్.. జైలుకు వచ్చిన స్మగ్లర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా ఈ దందాలోకి దిగినట్లు సమాచారం. ఇద్దరు కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వీరి మధ్య స్నేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత నేరస్తుల ద్వారా గంజాయి ఎక్కడ కొనాలి, ఏయే మార్గాల్లో తరలిస్తే సాఫీగా రవాణా సాగుతుందో తెలుసుకుని వీరు గంజాయి దందా చేస్తునట్లు సమాచారం. భారీగా స్మగ్లింగ్..? గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ భారీ ఎత్తున దందా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా వీరు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారని తెలిసింది. వీరికి స్థానికంగా ఉండే గంజాయి అమ్మకందారులతో కూడా పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది. గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకోవాల్సిన పోలీసులే స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడంతో పోలీసు శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
అడ్డదారిలో అక్రమ కిక్కు..!
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సరిహద్దు ప్రాంతాల నుంచి పండ్లు, పాలు, కూరగాయల మాటున పొరుగు రాష్ట్రాల మద్యాన్ని అడ్డదారుల్లో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు. చదవండి: తిరుమల లడ్డూల కోసం పర్యావరణహిత సంచి.. కర్నూలు: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏడు అంతర్రాష్ట్ర, పది జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులున్నాయి. వీటిలో సెబ్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి భారీగా మద్యం తరలివస్తోంది. పోలీసులు నాలుగు కేసులు పట్టుకుంటే 40 కేసుల మద్యాన్ని జిల్లాకు తీసుకొస్తున్నారు. కొందరు ఇదే వృత్తిగా మార్చుకుని పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కర్ణాటక, తెలంగాణల రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చేందుకు పలు అడ్డదారులున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై, కాలినడకన నెత్తిన పెట్టుకుని పొరుగు మద్యాన్ని జిల్లాలోకి తీసుకొస్తున్నారు. సెబ్ అధికారులు ప్రధాన రోడ్లపైనే దృష్టి సారిస్తుండటంతో అడ్డదారుల్లో అక్రమదందా సాగిస్తున్నారు. గతంలో మద్యం దుకాణాలు నిర్వహించిన వారు తమ అనుచరుల ద్వారా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు సమీపంలోని పంచలింగాల, ఈ. తాండ్రపాడు, తిమ్మనదొడ్డి, చిన్న దన్వాడ, కేశవరం, రాజోలి నుంచి తెలంగాణ మద్యం కర్నూలుకు వస్తోంది. అలాగే చిన్న మంచాల, పుల్లాపురం, గుండ్రేవుల, చెట్నేపల్లి నుంచి కర్ణాటక మద్యం తరలుతోంది. మహిళలు, యువకుల ద్వారా.. విడతల వారీగా మద్య నిషేధం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. అలాగే దుకాణాలను సైతం తగ్గించింది. పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో జిల్లాలోకి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు మద్యం అక్రమ రవాణాలో మహిళలను సైతం ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి 8 నెలల వ్యవధిలో జిల్లాలో 22 మంది మహిళలు మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. అక్రమ మద్యం వ్యాపారులు నిరుద్యోగ యువకులకు సైతం వల వేస్తున్నారు. వారికి ద్విచక్ర వాహనాలిచ్చి మద్యం తీసుకొస్తే విడతకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెబుతున్నారు. కడప రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇద్దరు, డిగ్రీ చదువుతున్న మరొకరు, అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలానికి చెందిన ఎంబీఏ విద్యార్థి డబ్బు కోసం ఆశపడి మద్యం రవాణా చేస్తూ తనిఖీల్లో దొరికిపోయారు. ఒప్పంద కూలీల వ్యవహారం వీరి ద్వారా బయటపడటంతో తనిఖీ అధికారులే విస్తుపోయారు. ఇలా పట్టుబడిన వారిలో జిల్లాకు చెందిన విద్యార్థులతో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఎనిమిది నెలల వ్యవధిలోనే 56 మంది విద్యార్థులు, వందల సంఖ్యలో యువకులు పొరుగు మద్యం రవాణా చేస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ నెల 11వ తేదీన మిరపకాయల మాటున మినీలారీలో అక్రమంగా తరలిస్తున్న 90 బాక్సుల కర్ణాటక మద్యాన్ని కోడుమూరులోని పత్తికొండ రోడ్డులో సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12వ తేదీన కర్నూలు ముజఫర్ నగర్‌కు చెందిన షేక్ హుస్సేన్ తన కారులో 10 కాటన్ బాక్సుల్లో 360 తెలంగాణ మద్యం బాటిళ్లు తీసుకొస్తుండగా తనిఖీ చేసి సీజ్ చేశారు. సెబ్ ఏర్పడినప్పటి నుంచి నమోదైన కేసుల మద్యం అక్రమ రవాణా నమోదైన కేసులు 6,529 పట్టుబడిన మద్యం(లీటర్లలో) 1,39,686 పట్టుబడిన బీర్లు (లీటర్లలో) 1,098.44 అరెస్ట్ అయిన వారి సంఖ్య 9,962 సీజ్ చేసిన వాహనాలు 3,775 పీడీ యాక్టు అమలు చేస్తాం మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. రవాణాదారులతో పాటు సహకరించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించేందుకు వెనుకాడం. విద్యార్థులు, ఉద్యోగులు ఇలాంటి కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అసాంఘిక కార్యకలాపాలపై 7993822444 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వండి. – తుహిన్ సిన్హా, సెబ్ జేడీ చదవండి: నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో తరగతులు -
ఘంటసాల మండలంలో ఉద్రిక్తత
అవనిగడ్డ: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ఇసుక అడ్డగోలు తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన ఉధృతరూపం దాలుస్తోంది. దీంతో అక్కడ పోలీసులు బుధవారం ఉదయం నుంచి 144 సెక్షన్‌ను విధించారు. 150 మంది పోలీసులు గ్రామంలో మోహరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, సాయంత్రం 6 గంటల తర్వాత అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసి, ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై చర్యలు తీసుకునే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. మరో వైపు గ్రామంలోని ఇసుకరీచ్ వద్ద పోలీసు పహారా నడుమ అధికారులు ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేయిస్తున్నారు. -
ఇసుక అక్రమాలపై ధర్నా
అవనిగడ్డ: అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలపై కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం వాసుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద తవ్వకాలకు అనుమతి ఉండగా... అర్థరాత్రి వరకు కూడా యధేచ్చగా తవ్వకాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇసుక తరలించే వాహనాలు వేగంగా వెళుతూ గ్రామస్తుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నరంటూ వారు సోమవారం ఉదయం ఇసుక రీచ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, ఇటీవల ఇసుక వాహనం ఢీకొని మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, లెసైన్స్ లేని డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.