Immoral Traffic Prevention Act
-
సెక్స్ రాకెట్.. ముగ్గురు నటీమణులకు విముక్తి
ముంబై : నగరంలోని ఓ త్రీ స్టార్ హోటల్ల్లో సాగుతున్న హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టును ముంబై పోలీసులు ఛేదించారు. ఈ రాకెట్‌కు నిర్వహిస్తున్న ప్రియా శర్మను(29) పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వ్యభిచార కూపం నుంచి ముగ్గురు అమ్మాయిలకు పోలీసులు విముక్తి కల్పించారు. వారు ముగ్గురు కూడా నటీమణులే కాగా.. అందులో ఓ మైనర్ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ..‘సిటీ పోలీసు సోషల్ సర్వీసు బ్రాంచ్ తూర్పు అంధేరిలోని ఓ హోటల్‌పై గురువారం దాడులు చేపట్టింది. హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రియా శర్మను అరెస్ట్ చేశాం. అలాగే ముగ్గురు అమ్మాయిలను రక్షించాం. అందులో ఒకరు మైనర్ ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా బలవంతంగా వ్యభిచార కూపంలోకి తీసుకువచ్చినట్టుగా గుర్తించాం. ప్రియా శర్మ కందివాలి తూర్పులో టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మేము కాపాడినవారిలో ఒకరు ఓ ప్రముఖ టీవీ చానల్ నిర్వహించే క్రైమ్ షోలో పనిచేశారు. మరోకరు మరాఠీ చిత్రాల్లో, సీరియల్స్‌లో నటిస్తున్నారు. మైనర్ నటి ఓ వెబ్ సిరీస్‌లో నటించారు’ అని తెలిపారు. కాగా, ఇటీవల సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్‌ను కూడా ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
సెక్స్ రాకెట్; ప్రొడక్షన్ మేనేజర్ అరెస్ట్
ముంబై: సెక్స్ రాకెట్ నడుపుతున్న బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ ఒకరిని అరెస్ట్ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. జుహు సబర్బన్‌లోని జెడ్ లగ్జరీ రెసిడెన్సీ హోటల్‌పై సోషల్ సర్వీస్(ఎస్ఎస్) అధికారులు దాడి చేసి బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజేశ్ కుమార్ లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ నుంచి ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను కాపాడారు. లాల్ సహకారంతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా అనే మహిళ ఈ రాకెట్‌ను నడిపిస్తోందని పోలీసులు వెల్లడించారు. విదేశాల నుంచి మహిళలను ముంబైలోని స్టార్ హోటల్స్‌కు పంపిస్తూ ఒక్కొక్క కస్టమర్ నుంచి రూ.80 వేలకు వసూలు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద లాల్‌పై కేసు నమోదు చేశారు. జరీనాను ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. -
వేశ్యాగృహాల నుంచి తరలింపును అడ్డుకోజాలరు
సెక్స్ వర్కర్ల పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: వేశ్యాగృహాల నుంచి తరలింపును అడ్డుకునేందుకు సెక్స్ వర్కర్లు చట్టాలను ఉపయోగించుకోజాలరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ దోషిగా తేలినా.. లేక పోలీసులకు చిక్కకపోయినా వారిని వేశ్యాగృహాల నుంచి తరలించకుండా చట్టప్రకారం రక్షణ పొందే అవకాశం సెక్స్ వర్కర్లకు లేదని పేర్కొంది. వేశ్యా గృహం నుంచి తరలించడానికి ముందుగా అక్కడున్న వారికి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వాలన్న సెక్స్ వర్కర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. చట్ట ప్రకారం అందరికీ నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదంది. ముగ్గురు ఢిల్లీ సెక్స్ వర్కర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్లను కోర్టు శుక్రవారం తిరస్కరించింది. వేశ్యాగృహాలను మూసేయాలని, అక్కడ ఉండే పరిస్థితుల బట్టి సెక్స్ వర్కర్లను తరలించాలని చట్టంలోని సెక్షన్ 18 చెపుతోందని పేర్కొంది.