Immunodeficient
-
నోట్లో వేలు.. ఎంతో మేలు !
వెల్లింగ్టన్ : ‘ఒరేయ్ నోట్లో వేలు తీయ్..ఇదేం అలవాటు’? చిన్న పిల్లలు ఉన్న ప్రతీ ఇంట్లో ఇది పాపులర్ డైలాగే ! నోట్లో వేలు పెట్టుకుని పిల్లలు కనిపిస్తే వారిని తల్లిదండ్రులు మందలించడం షరామామూలే..అయితే నోట్లో వేలు పెట్టుకోవడమేమీ చెడ్డ అలవాటు కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. గోర్లు కొరకడం, బొటనవేలు నోట్లో పెట్టుకునే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట! ఈ అలవాట్లు పెరిగే క్రమంలో దీర్ఘకాలంలో అలర్జీలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని ఒటాగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఇంట్లోని దుమ్ము, ధూళి, కుక్క, పిల్లిలాంటి పెంపుడు జంతువుల వెంట్రుకల ద్వారా వచ్చే అలర్జీల నుంచి కాపాడుకునేందుకు సరిపడే శక్తి నోట్లో వేలు పెట్టుకోవడంతో వస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. -
శిశువులకు అన్నం వద్దు
వాషింగ్టన్: ఏడాదిలోపు వయసున్న శిశువులకు అన్నం పెట్టడం మంచిది కాదని అమెరికా శాస్త్రజ్ఞులంటున్నారు. అన్నం తినే పిల్లల మూత్రంలో ఆర్సెనిక్ గాఢత ఎక్కువగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. గర్భంలో ఉన్న పిండంపై, శిశువు జన్మించాక తొలినాళ్లలో కూడా రోగనిరోధక శక్తి, నరాల అభివృద్ధిపై ఆర్సెనిక్ వ్యతిరేక ప్రభావం చూపుతుందని గత పరిశోధనలు తేల్చాయి. పాలిష్ పట్టిన బియ్యంలో ఆర్సెనిక్ గాఢత, శిశువులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 200 నానోగ్రామ్/గ్రామ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఒక ఏడాది వరకు వయసున్న పిల్లలు తినే అన్నం, మూత్రంలో ఆర్సెనిక్ గాఢతల మధ్య సంబంధాన్ని డార్ట్మౌత్ కళాశాల పరిశోధకులు పరిశీలించారు. 2011-2014 దాకా న్యూహాంప్షైర్లో జన్మించిన 759 మంది శిశువులపై అధ్యయనం చేశారు.