impotency of husband
-
సంసారానికి పనికిరాకున్నా.. ఘరానా మొగుడు
సాక్షి, పాకాల : నపుంసకత్వాన్ని కప్పిపుచ్చి ఒక యువతిని వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా అదనపు వరకట్నం కోసం చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టిన ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. సంసార జీవితానికి పనికిరాడనే విషయంపై భర్తనపు నిలదీయడంతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. దీంతో బాధితురాలు మరో యువతి బలి కారాదనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు పంచాయతీ మొరవపల్లెకు చెందిన వ్యవసాయ నేపథ్యం కలిగిన ఉషారాణి, రాజేంద్రనాయుడు(లేట్) దంపతుల కుమార్తె బి.దీపిక ఎంబీఏ చదివింది. చిత్తూరు రామ్నగర్ కాలనీలో నివాసం ఉం టున్న సుజాత, గోవిందస్వామినాయుడుల కుమారుడు ఎం.జి.శ్యాంప్రసాద్ (సాఫ్ట్వేర్ ఉద్యోగి)తో 2017 ఆగస్టు 13న తిరుమలలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేశారు. వరకట్నంగా రూ.2 లక్షలు, అదనంగా మరో లక్షతోపాటు, శ్యాంప్రసాద్కు 25 గ్రాముల బంగారు నగలు ఇచ్చారు. శ్యాంప్రసాద్, దీపిక ఇద్దరూ బెంగళూరులోనే ఉద్యోగం చేస్తుండడంతో అక్కడే కాపురం పెట్టారు. బండారం బట్టబయలు అయితే, శ్యాంప్రసాద్ సంసార జీవితానికి పనికిరాడని రోజుల వ్యవధిలోనే దీపిక తెలుసుకుంది. అతని వద్ద కొన్ని రకాల మాత్రల ప్రిస్కిప్షన్ లభించడంతో ఆమె అనుమానించింది. ఆ మాత్రలు పుంసత్వం కోసం వాడతారని, అతను గుట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుసుకుంది. ఇదే విషయమై భర్తతోపాటు అత్తమామలను నిలదీసింది. తమ కుమారుడు సంసార జీవితానికి పనికిరాడని వారు వెల్లడించారు. ఈ విషయం చెప్పి పరువు తీయొద్దని ప్రాధేయపడటంతో బాధను దిగమింగింది. తన జీవితాన్ని నాశనం చేశారంటూ దీపిక అసలు విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. దిగ్భ్రాంతికి గురైన ఆమె తమ బంధువులతో వియ్యంకులను ఈ విషయంగా ప్రశ్నించడంతో వారు దీపికపై కక్ష కట్టారు. అదనపు కట్నం మరో లక్ష రూపాయలు తేవాలంటూ అత్తమామలు వేధించసాగారు. భర్త ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించాడు. మరో పెళ్లి చేసుకుంటానని, దిక్కున్న చోట చెప్పుకో అంటూ దాష్టీకం ప్రదర్శించేవాడు. వారి బాధలు పడలేక దీపిక పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న రూపంలో ఇచ్చిన లాంఛనాలతో పాటు వివాహానంతరం జీతం తాలూకు సొమ్మును ఇప్పటివరకు దాదాపు 3లక్షల రూపాయలు భర్తకు ఇచ్చానని, వాటన్నింటికీ ఇప్పించాలని, తనను వేధిస్తున్న భర్త, అత్తమామలు, మరదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. నిందితులను అరెస్ట్ చేశామని, వారిపై చార్జిషీటు దాఖలు చేయనున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
సాఫ్ట్వేర్ మొగుడు కాదు.. శాడిస్ట్ మొగుడు..
-
సాఫ్ట్వేర్ భర్త శాడిజం
సాక్షి, కర్నూలు : తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడతానని కట్టుకున్న భార్యను బెదిరించాడు ఓ సాఫ్ట్వేర్ భర్త. తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి భార్యకు టీబీ రోగం ఉందని ప్రచారం చేశాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి, హైదరాబాద్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాచాని రాజేంద్రప్రసాద్తో గత ఏడాది ఆగస్టు 2న వివాహం అయింది. కట్నంగా 45లక్షల రూపాయలు, వివాహనంతరం మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా పెళ్లైన మొదటిరోజే రాజేంద్రప్రసాద్ తేడాగా వ్యవహరించాడు. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. తాను నపుంసకుడినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అతడి అమ్మమ్మకు తెలుపగా ఆమె కూడా తన మనవడు నపుంసకుడేనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించింది. దీంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కుంగిపోయానంటూ బాధితురాలు మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. టీబీ రోగం ఉందని ప్రచారం అత్తింటి వారి ఆగడాలు భరించలేక బయటకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలికి టీబీ రోగం ఉందని రాజేంద్రప్రసాద్ ప్రచారం చేశాడు. ‘ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఏ రోగం లేదని డాక్టర్లే నిర్ధారించారు. నా భర్తకు పరీక్షలు చేయించమని అత్తింటివారిని అడగ్గా.. అతడు ఎక్కడికి రాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించారు. అమ్మనాన్నలకు చెప్పి పెద్దల సమక్షంలో నిలదీస్తే ఏమి స్పందించకుండా వెళ్లిపోయారు’అని ఆమె అవేదన వ్యక్తం చేశారు. మరో పెళ్లికి రెడీ ఇదిలా ఉండగా మాచాని రాజేంద్రప్రసాద్ మరో పెళ్లికి రెడీ అయ్యారు. సమాచారం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వద్దలొద్దు అంటూ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి శిక్ష పడిన తర్వాతే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అని పెళ్లి చేశాం : బాధితురాలి తండ్రి మంచి సంబంధం, సాఫ్ట్వేర్ ఉద్యోగమని తమ కూతురుకి డిగ్రీ సెకండియర్లోనే వివాహం చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు. 45 లక్షలు కట్నంగా, మరో 10లక్షలు అదనంగా ఇచ్చామన్నారు. కానీ అబ్బాయి ఇలాంటివాడు అనుకోలేదని మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వారి ఇంటికెళ్లిన తన తమ్ముడిని తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దీంతో విధిలేక పోలీసులను ఆశ్రయించామన్నారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన రాజేంద్రప్రసాద్కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భర్త మగాడు కాదంటూ.. విడాకులు!
సాధారణంగా భారతీయ మహిళలు భర్త నుంచి విడాకులు కావాలంటే కట్నం కోసం వేధిస్తున్నాడనో.. మరేదైనా కారణం చెబుతారు. కానీ పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన ఓ కొత్త పెళ్లి కూతురు మాత్రం తన భర్త మగాడు కాదని, అందువల్ల అతడి నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు, తాను పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చిన రూ. 55వేల నగదుతో పాటు రూ. 55 వేల విలువగల ఆస్తులను కూడా తిరిగి ఇప్పించాలని కోరింది. ఈ కేసులో ఆమె విజయం సాధించింది కూడా. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను పిలిపించి వాళ్ల సమక్షంలోనే విచారణ జరిపారు. 18 ఏళ్ల యువతికి రెండు వారాల క్రితమే పెళ్లయింది. కొన్నాళ్ల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కొంతమంది అల్లుడి ఇంటికి వెళ్లగా, అప్పుడే వాళ్లలో కొందరికి అతగాడికి పుంసత్వ సమస్య ఉన్నట్లు తెలిసింది. కానీ, పెళ్లికూతురు అప్పటికి ఏమీ చెప్పలేక ఊరుకుంది. పుట్టింటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భోరుమంది. స్ట్రీట్ సర్వైవర్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షబ్నమ్ రామస్వామి వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకొంది. ఇంతకుముందు కూడా తమ గ్రామంలో చాలామంది అమ్మాయిలు విడాకులు తీసుకున్నారని, కానీ ఏ ఒక్కరూ భర్తకు పుంసత్వ సమస్య ఉందని ధైర్యంగా చెప్పలేకపోయారని ఆమె తెలిపింది. తనకు మాత్రం భయం లేదని చెప్పింది. చివరకు కోర్టులో ఆమెకు విడాకులు మంజూరయ్యాయి.