Improvements
-
గృహ రుణాల్లో 8–10 శాతం వృద్ధి
ముంబై: గృహ రుణ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర వృద్ధిని సాధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో హెచ్ఎఫ్సీలు అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఎటువంటి వృద్ధిని నమోదు చేయలేదని.. రుణాల మంజూరు, వసూళ్ల సామర్థ్యంపై కరోనా రెండో విడత ప్రభావం ఉందని ఇక్రా పేర్కొంది. అయినప్పటికీ సానుకూల పరిస్థితుల మద్దతుతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి సాధ్యమేనని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను సోమవారం విడుదల చేసింది. అయితే జూన్ చివరి నుంచి వసూళ్ల సామర్థ్యం తిరిగి పుంజుకుందని.. అది సెప్టెంబర్ త్రైమాసికంలో మరింత మెరుగుపడిందని తెలిపింది. పరిశ్రమలో డిమాండ్ బలంగా ఉండడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, టీకాల కార్యక్రమం విస్తృతం కావడం అన్నవి హెచ్ఎఫ్సీల నుంచి స్థిరమైన రుణాల మంజూరుకు సాయపడతాయని ఇక్రా పేర్కొంది. ‘‘హెచ్ఎఫ్సీల పోర్ట్‌ఫోలియో (ఆన్బుక్/పుస్తకాల్లోని రుణాలు) 2021 జూన్ చివరికి రూ.11 లక్షల కోట్లుగా ఉంది. గృహ రుణాలు, ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు, నిర్మాణ రుణాలు, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ వీటిల్లో ఉన్నాయి’’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సచిన్ సచ్దేవ తెలిపారు. కరోనా కారణంగా 2020–21 సంవత్సరంలో హెచ్ఎఫ్సీల పోర్ట్‌ఫోలియో 6 శాతమే వృద్ధి చెందడం గమనార్హం. -
పుంజుకున్న తయారీ రంగం
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న దాఖలాలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారీ రంగం గత నెల మళ్లీ కాస్త పుంజుకుంది. ఏప్రిల్‌లో 51.8 పాయింట్లుగా ఉన్న నికాయ్ ఇండియా తయారీ రంగ సూచీ (పీఎంఐ) మే నెలలో 52.7 పాయింట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. పీఎంఐ 50 పాయింట్ల పైన కొనసాగడం ఇది వరుసగా 22వ నెల కావడం గమనార్హం. పీఎంఐ 50కి పైన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. ‘కొత్త ఆర్డర్ల రావడం మొదలు కావడంతో, డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాయి. దీంతో తయారీ రంగంలో ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది‘ అని పీఎంఐ సూచీ నిర్వహించే ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త, నివేదిక రూపకర్త పోల్యానా డి లిమా పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు వస్తుండటం, ఉత్పత్తి పెంపుపై కంపెనీలు ఆశావహంగా ఉండటం వంటి అంశాలతో తయారీ రంగంలో మరింత మందికి ఉపాధి కల్పన జరిగినట్లు వివరించారు. ధీమాగా కంపెనీలు ఏప్రిల్ నుంచి సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ ఉత్పత్తి పెంపుపై దేశీ తయారీ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ వ్యూహాలు, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, సానుకూల ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలు ఈ ఆశావహ దృక్పధానికి కారణమని నివేదికలో వెల్లడైంది. ద్రవ్యోల్బణ కోణంలో చూస్తే ధరలపరమైన ఒత్తిళ్లు పెద్దగా పెరగలేదని, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల స్వల్పంగానే ఉండటం వల్ల కంపెనీలు రేట్లను పెద్దగా మార్చలేదని లిమా తెలిపారు. -
దళిత,మైనార్టీ వార్డులను అభివృద్ది చేయండి
* మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఐఎం నాయకులు * కమిషనర్‌కు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలుకుతున్న ఎంఐఎం వైస్ చెర్మైన్,ఎంఐఎం నాయకులు ఆదిలాబాద్ కల్చరల్: దళిత,మైనార్టీ వాడల అభివృద్ది కోసం పాటుపడాలని మున్సిపల్ కమిషనర్ కె.అలువేల మంగతాయారును కలిసి ఎంఐఎం మున్సిపల్ వైస్‌చెర్మైన్ ఫారూక్ అహ్మద్, నాయకులు కలిసిపుష్పగుచ్చాలనందజేశారు. ఈ సందర్బంగా పలు అంశాలను కమిషనర్ దృష్ఠికి తీసుకెళ్లారు. పట్టణంలో దళిత మైనార్టీ వార్డులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని, ఆయా వార్డులను అభివృద్ది చేసెందుకు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. పురపాలక సంస్థ అభివృద్దికి తమవంతుగా సహకారం అందజేస్తామన్నారు. కాలనీలలో పర్యటించి వార్డుల్లో ఉన్న సమస్యల , పేరుకుపొయిన సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్ని రంగాలలో మున్సిపాలిటి అభివృద్దికి పాటుపడాలని చెప్పారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ మున్సిపాలిటి సంస్థ అభివృద్ది చేసెందుకు తనవంతుగా కృషి చేస్తామని , నిబంధనలననుసరించి నడుచుకుంటామని చెప్పారు. ఇందులో ఎంఐఎం పార్టీ నాయకులు నజీర్, సలీం, మహ్మద్రోహిత్, షేక్మొయిద్, తదితరులు ఉన్నారు.