* మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఐఎం నాయకులు
* కమిషనర్‌కు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలుకుతున్న ఎంఐఎం వైస్ చెర్మైన్,ఎంఐఎం నాయకులు
ఆదిలాబాద్ కల్చరల్: దళిత,మైనార్టీ వాడల అభివృద్ది కోసం పాటుపడాలని మున్సిపల్ కమిషనర్ కె.అలువేల మంగతాయారును కలిసి ఎంఐఎం మున్సిపల్ వైస్‌చెర్మైన్ ఫారూక్ అహ్మద్, నాయకులు కలిసిపుష్పగుచ్చాలనందజేశారు. ఈ సందర్బంగా పలు అంశాలను కమిషనర్ దృష్ఠికి తీసుకెళ్లారు. పట్టణంలో దళిత మైనార్టీ వార్డులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని, ఆయా వార్డులను అభివృద్ది చేసెందుకు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు.
పురపాలక సంస్థ అభివృద్దికి తమవంతుగా సహకారం అందజేస్తామన్నారు. కాలనీలలో పర్యటించి వార్డుల్లో ఉన్న సమస్యల , పేరుకుపొయిన సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్ని రంగాలలో మున్సిపాలిటి అభివృద్దికి పాటుపడాలని చెప్పారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ మున్సిపాలిటి సంస్థ అభివృద్ది చేసెందుకు తనవంతుగా కృషి చేస్తామని , నిబంధనలననుసరించి నడుచుకుంటామని చెప్పారు. ఇందులో ఎంఐఎం పార్టీ నాయకులు నజీర్, సలీం, మహ్మద్‌రోహిత్, షేక్‌మొయిద్, తదితరులు ఉన్నారు.
దళిత,మైనార్టీ వార్డులను అభివృద్ది చేయండి
Published Sat, Jul 16 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement