incarnation day
-
నవరత్నాలు ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం: గవర్నర్ అబ్దుల్ నజీర్
-
ఏపీ అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
CM Jagan: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కోసం వెళ్లారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఉత్సవంగా అవతరణ వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు (ఫొటోలు)
-
సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు
-
ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళులర్పించారు. అభివృద్ధి పథంలో రాష్ట్ర ప్రభుత్వం పురోగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, పేదలకు అనుకూలమైన చర్యలను ప్రారంభించడం ద్వారా అభివృద్ధి పథంలో భారీ పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి మనిషికి అందేలా చూడాలనే లక్ష్యంతో ప్రజాకేంద్రీకృత విధానాన్ని కొనసాగించాలన్నారు. ఏ ప్రభుత్వమైనా విజయం సాధించాలంటే ప్రజల సంతోషమే బారోమీటర్ అని అన్నారు. సామాన్యుల కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నానని గవర్నర్ తెలిపారు. -
‘సంచలనాత్మక నిర్ణయాలు అమలు చేశారు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు, విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రం.. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటుకు మహానుభావుడు పొట్టి శ్రీరాములు చేసిన కృషి అనిర్వచనీయం అని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని నేడు స్మరించుకోవాల్సిన రోజు అని అన్నారు. సంచలన నిర్ణయాలు అమలు చేశారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే సంచలనాత్మమైన నిర్ణయాలు అమలు చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా సచివాలయాల ఉద్యోగాల భర్తీ అత్యంత చారిత్రాత్మకం అని కొనియాడారు. గత నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని వెల్లడించారు. పాడేరులో త్వరలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు కాబోతోందని తెలిపారు. విశాఖ నగర వాసులకి తాగునీటి సమస్య తీర్చేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. విశాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించింది.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమరజీవి పొట్టి శ్రీరాములను స్మరించుకోవడానికే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. నేడు తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజు అని వెల్లడించారు. పవిత్రదినంగా పాటించాలి.. ఆంధ్రులకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. నవంబర్ 1ని పవిత్ర దినంగా పాటించాలని సూచించారు. చరిత్రలో నిలిచిపోయిన రోజు.. ‘నవంబర్ 1’ చరిత్రలో నిలిచిపోయిన రోజు అని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. నాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖపట్నం అభివృద్ధి జరిగిందని గుర్తుచేశాడు. నేడు సీఎం వైఎస్ జగన్ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ప్రతి ఏటా స్మరించే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్ కల్పించారన్నారు. -
త్యాగ ధనులను స్మరించుకుందాం
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విజయవాడ బాపు మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెలలో ప్రారంభిస్తారని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మ్యూజియం ప్రజలకు అందుబాటులో రానుందని చెప్పారు. ఈ వేడుకల్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేసి జాతికి ఇక్కడ నుంచే అందించారని పేర్కొన్నారు. దేశం గర్వించేలా తెలుగు జాతి కీర్తిని పింగళి వెంకయ్య దశదిశలా వ్యాపింప చేశారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన విక్టోరియా మ్యూజియం అభివృద్ధికి అన్ని విధాల సహకరించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన త్యాగ ధనుల ప్రాణ త్యాగాలను అందరూ స్మరించుకునేలా ఈ వేడుకలు జరగాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని మంత్రి కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదు.. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నవంబర్ 1 అనగానే రాష్ట్ర ప్రజలకు పొట్టి శ్రీరాములు గుర్తుకు వస్తారని చెప్పారు. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సమావేశాల పేరుతో విద్యార్థులను ఎండల్లో కూర్చోపెట్టారని.. నవ నిర్మాణ దీక్షల పేరుతో వేల కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. 1921 ఏప్రిల్ 1న విక్టోరియా మ్యూజియంలో జాతీయ జెండా రూపకల్పనకు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. పింగళి వెంకయ్య ఈ మ్యూజియంలో తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీకి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మ్యూజియంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తామని మల్లాది విష్ణు వెల్లడించారు. -
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతన్నారు. ఈ నేపథ్యంలో గుంటురు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించి రాష్ట్రావతరణ వేడుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అయిదేళ్లపాటు చంద్రబాబు రాష్ట్రానికి అవతరణ దినోనత్సవం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. నవ నిర్మాణ దీక్షల పోరాటం పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్యు చేశారని, రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన పొట్టి శ్రీరాములుకు నివాళ్లు అర్పించే అవకాశాన్ని చంద్రబాబు పోగొట్టారని మండిపడ్డారు. నూతన ప్రభుత్వంగా ఏర్పడిన అనంతరం మళ్లీ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలు జరుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారని. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా సీఎం జగన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీ రాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #APFormationDay — YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2019 పశ్చిమగోదావరి గణపవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅవతరణ దినోత్సవ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే నర్సాపురం ఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యపాన నిషేధానికి నాంది పలుకుతూ 20% శాతం దుకాణాలను తొలగించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మహిళలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి మెయిన్ రోడ్డులో ఎంపీ మార్గాని భరత్, కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల సత్యనారాయణ పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు : బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నివాళులు అర్పించారు. అలాగే సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర వేడుకల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు..తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సబ్ కలెక్టర్ కె.దినేష్ కుమార్ పొట్టిశ్రీరాముల విగ్రహానికి పాలభిషేకం చేసి, నివాళులర్పించారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవి క్రిష్ణ రెడ్డి...చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మ్మెల్యే విడదల రజిని పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణాజిల్లా ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పామర్రు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన శ్రీ పొట్టి శ్రీ రాములుకు నెల్లూరులో ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కావలిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్య వైశ్య సంఘం మహా సభ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారాకానాథ్ ఆధ్వర్యంలో స్టోన్ హౌస్ పేట లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చరిత్రను భావితరాలకు అందివ్వాలని ఆర్య వైశ్య సంఘం నేతలు సూచించారు. పొట్టి శ్రీరాములు సేవలను చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర రాష్ట్ర అవతరణను జరపడం హర్షణీయమన్నా ప్రకాశం ఒంగోలులోని ఎన్టీఆర్ కళా పరిషత్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, కందుల నాగార్జున రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయనగరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంపురస్కరించుకొని గుర్ల మండలం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విజయనగరం రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మజ్జి చిన్న శ్రీను పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరిపారు. అధే విధంగా సాలూరు పట్టణ మెయిన్ రోడ్లో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విశాఖపట్నం గాజువాకలో ఆర్యవ్తెశ్య సంఘం ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కులుకూరి మంగరాజు, కారమూరి మహేష్ పాల్గొన్నారు. వైయస్సార్ జిల్లా రాయచోటిలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ రోడ్డులో పోట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తహశీల్దారు కార్యాలయంలో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గోస్ఫాడు మోడల్ స్కూల్ లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిత్తూరు. జిల్లాలోని వైఎస్ఆర్సీపీ పార్లమెంటు కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి చేసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌తోపాటు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీంఅహ్మద్.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారికంగా నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బీబీ హరిచందన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల మొదటి రోజు హస్తకళలు, చేనేత కళల ప్రదర్శన, రెండో రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన, లలిత, జానపద కళల ప్రదర్శనలు, సురభి నాటకాలు ప్రదర్శించబడతాయి. మూడవ రోజు తెలుగు సంప్రదాయలు, ఆహర ఉత్పత్తుల ప్రదర్శన జరగనుంది. -
భయాందోళనలు సృష్టించేందుకే ఎన్నార్సీ
కోల్‌కతా: దేశ లౌకిక విలువల్ని ధ్వంసం చేసి, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నార్సీ, పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భారత జాతీయతా భావం స్థానంలో హిందూ జాతీయతా భావాన్ని చొప్పించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీపీఐ 100వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మత శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ), పౌరసత్వ (సవరణ)బిల్లును తీసుకువచ్చింది. కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని విభజనలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని ఆరోపించారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు చేస్తున్న ఈ కుట్ర రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. కాగా, ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో 1920 అక్టోబర్ 17వ తేదీన భారతీయ నాయకుల నేతృత్వంలో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ(ఐసీపీ)అవతరించింది. -
ప్రకాశమేదీ..?
ఒంగోలు టౌన్: ప్రకాశం జిల్లా ఆవిర్భవించి ఐదు దశాబ్దాలవుతోంది. అయినా నేటికీ వెనుకబాటుతనమే వెంటాడుతోంది. పేరులోనే ప్రకాశం తప్పితే అభివృద్ధిలో అంథకారం మిగిలింది. జిల్లాకు సంబంధించి చెప్పుకోదగ్గ అభివృద్ధి భూతద్దం వేసినా కనిపించదు. మూడేళ్లుగా వరుస కరువు వెంటాడుతున్నా జిల్లాపై ప్రభుత్వానికి కనికరం కలగ లేదు. రైతులు పంటలను పూర్తిగా కోల్పోయారు. కూలీలకు పనులు లేవు. పనుల కోసం ఊళ్లకు ఊళ్లు వలసలు వెళుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన జిల్లాల జాబితాలో ఇంతవరకు ప్రకాశంకు చోటు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనివర్సిటీల్లో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రతి ఏటా జిల్లా పరిస్థితి దిగజారడం తప్పితే అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. అన్నింటా వెనుకబాటుతనమే.. వెనుకబడిన జిల్లాల నుంచి ఏర్పడిన ప్రకాశం అన్నింటా వెనుకబడే ఉంది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలన్నింటిని కలిపి 1970 ఫిబ్రవరి 2వ తేదీ ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 33,92,764 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఏటా 11శాతం జనాభా పెరుగుతోంది. 55శాతం కుటుంబాలు కేవలం ఒక్క గదిలోనే తలదాచుకుంటున్నాయి. స్నానాల గదులు కూడా లేని కుటుంబాలు 36 శాతం ఉన్నాయి. 52 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంట వండుకునేందుకు కట్టె పుల్లలనే ఉపయోగిస్తుస్తున్నాయి. 70 శాతం మంది అత్వల్ప ఆదాయంతో కుటుంబాలను భారంగా నెట్టుకు వస్తున్నారు. ఫ్లోరైడ్ నుంచి విముక్తి లేదు జిల్లాలోని 43 మండలాల ప్రజలపై ఫ్లోరైడ్ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికీ 729 గ్రామాల్లో ప్రజలు తాగే నీటిలో హానికరమైన 1.2పీపీఎం ఫ్లోరోసిస్ ఉంది. 38 మండలాల్లోని 187 గ్రామాల్లో ప్రజలు తాగే నీటిలో అత్యంత ప్రమాదకరమైన 5 పీపీఎం ఉన్నట్లు ప్రభుత్వమే గుర్తించింది. ఈ 38 మండలాల్లో వేలాది మంది కిడ్నీ బాధితులు. సకాలంలో డయాలసిస్ చేయకపోవడంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డయాలసిస్ కేంద్రాలను బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు అత్యంత ప్రమాదకరమైన ఫ్లోరిన్ ఉన్న నీటినే తాగుతున్నారు. దాంతో బాల్యం నుంచే అక్కడి పిల్లలు ఫ్లోరిన్ బారిన పడుతున్నారు. జిల్లాలో 2333 నివాస ప్రాంతాలు ఉంటే, వాటిలో 1162 ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం లేదు. ఆ ప్రాంతాల పరిధిలోని 42 పథకాల ద్వారా తాగునీటిని అందించేందుకు గత 15 ఏళ్ల కాలంలో దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చు చేసినట్టు అధికారికంగా గణాంకాలు చెబుతున్నప్పటికీ తగిన ఫలితాలు మాత్రం రాలేదు. ఏటా 4 లక్షల కుటుంబాలు వలస ప్రతి ఏటా జిల్లా నుంచి పనుల కోసం 4 లక్షల కుటుంబాలు వలస వెళుతున్నాయంటే కరువు తీవ్రత ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో దాదాపు 8.5లక్షల కుటుంబాలు ఉంటే అందులో సగం కుటుంబాలు పనుల కోసం సొంత ఊళ్లు, సొంత ఇళ్లను వదులుకొని వెళుతున్నాయి. ఆ కుటుంబాలు తమ ఇళ్లల్లో ఉండేది మూడు నాలుగు నెలలు మాత్రమే. మిగిలిన కాలమంతా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో పనుల కోసం వలసలు వెళుతుంటాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో కూలీలకు పనులు కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. కూలీలతో పనులు చేయించకుండా అనేకచోట్ల యంత్రాలను వాడుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ పోలప్ప స్వయంగా అంగీకరించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అనేక కుటుంబాల్లో కేవలం వృద్ధులు మాత్రమే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ కనిపిస్తుంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశానికి చోటు లేకపోవడంతో వలసలకు అడ్డుకట్ట పడటం లేదు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన కేంద్రం వాటన్నింటికంటే అన్ని విధాలుగా వెనుకబడిన ప్రకాశంను చిన్నచూపు చూస్తూనే ఉంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రకాశంను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి పర్సనల్ పనులకు ఇస్తున్న ప్రాధాన్యత జిల్లాపై చూపించకపోవడంతో అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉంది. వర్షపాతం లోటు = జిల్లా పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. గత 45 ఏళ్ల కాలంలో జిల్లాలో సగటు వర్షపాతం పరిశీలిస్తే కేవలం 15 ఏళ్లు మాత్రమే చెప్పుకోదగ్గ వర్షాలు కురిశాయి. మిగిలిన 30 ఏళ్లు అతి తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో 19 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 14 లక్షల ఎకరాలు వినియోగంలో ఉంటుంది. అయితే ఈ 14లక్షల ఎకరాల్లో కేవలం 3లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదికూడా నాగార్జునసాగర్, కొమ్మమూరు కాలువల ద్వారానే. కొన్ని సందర్భాల్లో నాగార్జునసాగర్ నుండి కూడా వాటా ప్రకారం నీరు రాకపోవడంతో పంట పొలాలు బీళ్లుగా మారిపోయి రైతాంగం మరింత నష్టపోవడం సర్వసాధారణమైంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో వరుసగా మూడో ఏడాది కూడా కరువు నెలకొంది. కరువు జిల్లాగా ప్రభుత్వాలు ప్రకటనలు చేయడం, కేంద్ర బృందాలు తాము వచ్చిన సమయంలో ఉన్న భూములను పరిశీలించి వెళ్లడం తప్పితే జిల్లా రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. కరువు సహాయం కోసం రైతులు ఎదురుచూడటం తప్పితే ప్రభుత్వాల పరంగా ఎలాంటి సహాయం అందడం లేదు. -
చికాగోలో తెలంగాణ అవతరణ దినోత్సవం
చికాగో: పదిహేను నెలల క్రితం పురుడు పోసుకున్న అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఏటీఏ) చికాగో మహా నగరంలోని స్థానిక రామదా ఇన్ బాంకెట్స్ హాల్లో అధికారికంగా మూడవ తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ఇందులో ఆమెరికా నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా సంఘ సభ్యులు, పలు తెలంగాణ సంఘ సభ్యులు, చికాగో నివాసులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని గణపతి ప్రార్థనతో ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపక పితామహుడు శ్రీ మాధవ రెడ్డి బొబ్బిలి, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు శ్రీ విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యులు శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంతాపము తెలిపి నివాళులు అర్పించారు. మొదటగా అధ్యక్షులు రామ్మోహన్ కొండా, కన్వీనర్ వినోద్ కుకునూర్, తోటి కార్యవర్గ సభ్యులు గత సంవత్సరము ప్రపంచ తెలంగాణ మహా సభలు నిర్వహించడానికి సహకరినించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని/పండుగలను బావి తరాలకు చాటి చెప్పే కొన్ని కార్యక్రమాలను రూపొందించుకొని ప్రతిఏట ప్రపంచ నలుమూలాల నిర్వహించాలని సూచించారు. తరువాత సత్య కందిమళ్ల గారు మాట్లాడుతూ సంఘంలో అందరు కలిసికట్టుగా పని చేయాలనీ, కన్వెన్షన్ తో పాటు సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా అన్ని నగరాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కార్యదర్శి రవి ఉపాధ్యాయ కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో మరియు నూతన అధ్యక్షులు సత్య కందిమళ్ల గార్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే నూతన కార్యవర్గ సభ్యులు అందరు ఏకగ్రీవంగా కార్యదర్శిగా విష్ణు మాధవరం , కోశాధికారిగా ప్రతాప్ చింతలపని , సహాయ కార్యదర్శిగా రఘు మరిపెద్ది , సహాయ కోశాధికారిగా మహీధర్ రెడ్డి , 2019-20 అధ్యక్షులుగా వినోద్ కుకునూర్ , చైర్మన్ గా కరుణాకర్ మాధవరంను ఎన్నుకున్నారు. 2018 జూన్ 29 , 30 , జులై 1 జరుపుకునే రెండవ ప్రపంచ తెలంగాణ మహా సభలను మూడు నగరాలను పరిశీలించి చివరగా టెక్సాస్ రాష్ట్రములోని హౌస్టన్ నగరములో జరుపుకోవాడని ఏకగ్రీవంగా నిర్ణయించారు. దానికి కన్వీనర్ గా బంగారు రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అట పాటలతో, నృత్య ప్రదర్శనల తో చిన్నారులు అందరిని ఆకట్టుకున్నారు. ప్రవీణ్ జాలిగామ గారి నేతృత్వములో తెలంగాణ పాటలతో జానపద కళాకారుడు జనార్దన్ పన్నెల తమ పాటలతో జనాల్లో జోష్ నింపారు. కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రవీణ్ జాలిగామ, జానపద కళాకారుడు జనార్దన్ పన్నెలను గ్యాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టూరిజం అండ్ కల్చరల్ శాఖ వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు.