increased fees
-
ఉన్నత చదువులకు.. యూఎస్ బాట
అధిక ప్యాకేజీలిచ్చే సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్య అవసరమని యువత భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ విద్యార్థులు విదేశాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో విద్యనభ్యసించేందుకు భారతీయ యువత ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే 2023–24లో అమెరికా వర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. – సాక్షి, అమరావతిదేశీయంగా పరిమిత సంఖ్యలోనే సీట్లుదేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఎక్కువ మంది యూఎస్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో అధిక కటాఫ్‌లు, రిజర్వేషన్ విధానాలు, అవినీతి ఘటనల కారణంగా చాలామంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన దేశీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందలేకపోతున్నారు. అత్యంత పోటీ ఉండే ఐఐటీల్లో లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు, అడ్వాన్స్‌కు హాజరవుతుంటే.. కేవలం వేలల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు.కొన్ని సందర్భాల్లో జనరల్ కేటగిరీల్లో అత్యధిక స్కోర్ సాధించిన విద్యార్థులకు సైతం సీట్లు దక్కడం లేదు. తత్ఫలితంగా దేశంలో అగ్రశ్రేణి సంస్థల్లో అత్యంత పోటీ వాతావరణం చాలామంది విద్యార్థులను విదేశాల్లో చదువులను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు భారత్‌లోని కొన్ని అగ్రశ్రేణి సంస్థల ఫీజులతో సమానంగా ఉంటోంది. ఒకప్పుడు తక్కువ ఖర్చులు అధిక నాణ్యత కలిగిన విద్యను అందించిన ప్రసిద్ధ ఐఐటీలు ఇటీవల ఫీజులను పెంచేశాయి. అందుకే చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అగ్రశ్రేణి వర్సిటీలకు నిలయం అత్యాధునిక పరిశోధన అవకాశాలు, సౌకర్యాలు అందిస్తూ.. అంతర్జాతీయంగా జర్నల్స్‌ను ప్రచురించే అగ్రశ్రేణి వర్సిటీలకు అమెరికా నిలయంగా మారింది. భారతదేశంలో విద్య కొంతవరకు సాపేక్షంగా ఉన్నప్పటికీ ఐఐటీలు, ఐఐఎంల వంటి అగ్రశ్రేణి సంస్థలు యూఎస్ వర్సిటీలను అందుకోలేపోతున్నాయి. పైగా ఇటీవల కాలంలో ఐఐటీలు, ఐఐఎంల్లో ఫీజులు గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రవేశాలు పొందే అవకాశాలు మరింత సన్నగిల్లాయి.మరోవైపు అమెరికా వర్సిటీలు విదేశీ విద్యార్థులకు సైతం అనుకూలమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. తద్వారా విద్యా, కెరీర్ వృద్ధికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆ దేశం మారింది. ఈ క్రమంలోనే అమెరికాలో 42.9 శాతం మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్, 24.50 శాతం మంది ఇంజనీరింగ్, 11.20 శాతం మంది బిజినెస్ మేనేజ్మెంట్, 5.40 శాతం మంది ఫిజికల్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చేస్తున్నారు. దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో 2023–24లో 3.31 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఇది అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ అగ్రస్థానంలో నిలబెట్టింది. యూఎస్‌లో ఉద్యోగ అవకాశాలు జాబ్ మార్కెట్లో ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు మెకిన్సే, గూగుల్, అమెజాన్, యాపిల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి అగ్ర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎఫ్–1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 41శాతం పెరిగింది. -
వాహనదారులపై రవాణా బాదుడు
భారీగా ఫీజులు పెంచిన రవాణా శాఖ ఎల్ఎల్ఆర్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపైనా వడ్డన విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వం ప్రజల నెత్తిన మరోభారం మోపింది. రవాణా శాఖలో నిర్వహించే వివిధ పనులకు సంబంధించి చార్జీలను అమాంతం పెంచేసింది. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు.. డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. పెరుగుదల వివరాలు.. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసిన వారి నుంచి ఎల్ఎల్ఆర్ నిమిత్తం రూ.90 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.260కు పెంచారు. ఇది టూవీలర్ ఎల్‌ఎల్‌ఆర్‌కు మాత్రమే. అదనంగా ఫోర్ వీలర్‌కు గానీ, ఆటోరిక్షాకు గానీ ఎల్ఎల్ఆర్ కావాలంటే.. ఒక్కోదానికీ రూ.150 చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్సు ఫీజు రూ.550 ఉండేది. దాన్ని రూ.960కి పెంచారు. లైసెన్సు రెన్యువల్‌కు రూ.485 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660కి పెంచారు. చిరునామా మార్పునకు గతంలో రూ.560 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660 మొత్తానికి పెంచారు. అదేవిధంగా ఎండార్స్‌మెంట్‌కు గతంలో రూ.560ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1260కుపెంచారు. టూవీలర్ రిజిస్ట్రేషన్‌కు గతంలో రూ.445 ఉంటే.. దాన్ని రూ.685 కు పెంచారు. కారుకు గతంలో రూ.735 ఉంటే దాన్ని ఇప్పుడు 1135కు పెంచారు. వాహనాన్ని బదిలీ చేయడానికి గతంలో టూవీలర్‌కు రూ.410 ఉంటే.. ఇప్పుడు అది రూ.535కు పెరిగింది. కారుకు గతంలో రూ.635ఉంటే ఇప్పుడు రూ.835కు పెరిగింది. ఏడాదికి రూ.80 కోట్ల మేర అదనపు భారం ప్రభుత్వం రవాణా చార్జీలు పెంచడం వల్ల జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.కోట్లలో భారం పడనుంది. అన్ని రకాల సేవలు ఫీజులు, చార్జీలు పెరగడం వల్ల ఏడాదికి అదనంగా సుమారు రూ.80 కోట్ల వరకు భారం పడనుంది. -
చదువు‘కొనే’ మాసంపెట్టు‘బడి’
12న పాఠశాలల పునః ప్రారంభం భారీగా పెరిగిన ఫీజులు, పుస్తకాల ధరలు పిల్లలకు పెట్టు‘బడి’ పెట్టాల్సిందే జూన్ అంటే హడలుతున్న తల్లిదండ్రులు ప్రతి ఏటా జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. విద్యా వ్యాపారం జోరందుకుంటుంది. అదే సందర్భంలో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతుంది. భారీగా పెరిగిన ఫీజులు, చదువుకు అవసరమైన వస్తువుల ధరలు చూసి సాధారణ, మధ్యతరగతి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈసారి ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, షూలు, బ్యాగులు తదితరాల ధరలు భారీగానే పెరిగాయి. పట్టణ వాసులే కాకుండా గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. మొత్తం మీద వీరి ఆసక్తిని గుర్తించిన ప్రైవేటు యాజమాన్యాలు ఏటా ఫీజులు మోత మోగిస్తున్నాయి. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే ఏడాదికి రూ.50 వేలకు పైగా అవసరమవుతోంది. సామాన్యుడికి ఇది చాలా భారమైనప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని కష్టాలను మోస్తూనే ఉన్నారు. ఈసారి 20 వేల కొత్త అడ్మిషన్లు విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 824 ఉన్నా యి. గత ఏడాది ఈ పాఠశాలల్లో 2.5 లక్షల మంది విద్యను అభ్యసించారు. ఈసారి మరో 20 వేల కొత్త అడ్మిషన్లు ఖాయంగా కనిపి స్తోంది. ఆ లెక్కన 2.7 లక్షల మంది విద్యార్థు లు ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్య ను అభ్యసించనున్నట్టు అంచనా. ఈ లెక్కల తో గణన చేస్తే జిల్లాలో విద్యా వ్యాపారం కోట్లలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. పెరిగిన ఫీజులు స్కూళ్లను బట్టి ఎల్కేజీకి రూ.5 వేల నుంచి 25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక అడ్మిషన్ ఫీజులైతే భారీగానే ఉన్నాయి. 7 నుంచి 10 తరగతులకు రూ.20 వేల నుంచి రూ. 50 వేలకు పైగా ఫీజు వసూలు చేస్తున్నా రు. గత టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పాఠశాలల్లో అయితే ఈసారి భారీగా ఫీజులు పెంచేశారు. స్కూల్ వ్యాను ఫీజులు ఓ విద్యార్థికి నెలకు రూ.2వేల పైమాటే. ఆ లెక్కన ఓ విద్యార్థికి సగటున అయ్యే ఖర్చు ఏడాదికి రూ. 30 నుంచి 50 వేల వరకు అవుతోంది. రైతన్నలకు పెద్ద భారం ఓ వైపు ఖరీఫ్ సీజన్లో పంట సాగుకు పెట్టుబడి పెట్టాలి. మరోవైదు పాఠశాల లు తెరుస్తుండడంతో పిల్లల చదువులకు వ్యయం చేయాలి. రైతులకు ఈనెల పెద్ద భారంగా మారింది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులకు ఈ కష్టాలు మరింత పెరిగాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైతులు కొత్త అప్పులకు సైతం వెళ్లాల్సిన పరిస్థితి. ఏదేమైనా అందరికంటే ఎక్కువగా నలిగి పోతున్నది సామాన్య రైతన్నలే.