ప్రణాళికా సంఘం పరిశీలనలో ఏపికి ప్రత్యేక హోదా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రతిపాదనను ప్రణాళికా సంఘం పరిశీలిస్తోందని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ ఈరోజు రాజ్యసభలో తెలిపారు. అభివద్ధి ప్యాకేజీ రూపొందించే బాధ్యతను ప్రణాళికా సంఘంలోని ప్రత్యేక విభాగానికి అప్పజెప్పినట్లు ఆయన ఒక రాతపూర్వక సమాదానంలో వివరించారు.
ఏపిలో వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వడానికి ఈ ఏడాది మార్చి 25న ప్రణాళికా సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి అధ్యక్షతన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.