India and Pakistan
-
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
...అలా పంచుకున్నారు!
1947. బ్రిటిష్ వలస పాలన నుంచి మనకు విముక్తి లభించిన ఏడాది. అఖండ భారతదేశం రెండుగా చీలిన ఏడాది కూడా. ఒక రాష్ట్ర విభజన జరిగితేనే ఆస్తులు, అప్పులు తదితరాల పంపకం ఓ పట్టాన తేలదు. అలాంటి దేశ విభజన అంటే మాటలా? అది కూడా అత్యంత ద్వేషపూరిత వాతావరణంలో జరిగిన భారత్, పాకిస్తాన్ విభజన గురించైతే ఇక చెప్పేదేముంటుంది! ఆస్తులు, అప్పులు మొదలుకుని సైన్యం, సాంస్కృతిక సంపద దాకా అన్నీ రెండు దేశాల మధ్యా సజావుగా పంపకమయ్యేలా చూసేందుకు నాటి పెద్దలంతా కలిసి భారీ యజ్ఞమే చేయాల్సి వచి్చంది. రేపు దేశమంతా 78వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో దేశ విభజన జరిగిన తీరుతెన్నులపై ఫోకస్... ముందుగానే కమిటీ విభజన సజావుగా సాగేలా చూసేందుకు స్వాతంత్య్రానికి ముందే 1947 జూన్ 16న ‘పంజాబ్ పారి్టషన్ కమిటీ’ ఏర్పాటైంది. తర్వాత దీన్ని విభజన మండలి (పారి్టషన్ కౌన్సిల్)గా మార్చారు. ఆస్తులు, అప్పులతో పాటు సైన్యం, ఉన్నతాధికారులు మొదలుకుని కార్యాలయ సామగ్రి, ఫరి్నచర్ దాకా అన్నింటినీ సజావుగా పంచడం దీని బాధ్యత. కమిటీలో భారత్ తరఫున కాంగ్రెస్ నేతలు సర్దార్ వల్లబ్బాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్; పాక్ తరఫున ఆలిండియా ముస్లిం లీగ్ నేతలు మహ్మదాలీ జిన్నా, లియాకత్ అలీ ఖాన్ ఉన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని కేవలం 70 రోజుల్లో ముగించాల్సిన గురుతర బాధ్యత కమిటీ భుజస్కంధాలపై పడింది! హాస్యాస్పదంగా భౌగోళిక విభజన! దేశ విభజనలో తొట్టతొలుత తెరపైకొచి్చన అంశం భౌగోళిక విభజన. ఈ బాధ్యతను బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించారు. ఆ మహానుభావుడు హడావుడిగా కేవలం నాలుగే వారాల్లో పని ముగించానని అనిపించాడట. బ్రిటిష్ ఇండియా మ్యాప్‌ను ముందు పెట్టుకుని, తనకు తోచినట్టుగా గీత గీసి ‘ఇదే సరిహద్దు రేఖ’ అని నిర్ధారించినట్టు చెబుతారు. దాన్నే రాడ్‌క్లిఫ్ రేఖగా పిలుస్తారు. ముస్లిం సిపాయిలే కావాలన్న పాక్...కమిటీ ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్లలో సాయుధ బలగాల పంపిణీ ఒకటి. చర్చోపచర్చల తర్వాత దాదాపు మూడింట రెండొంతుల సైన్యం భారత్‌కు, ఒక వంతు పాక్‌కు చెందాలని నిర్ణయించారు. ఆ లెక్కన 2.6 లక్షల బలగాలు భారత్‌కు దక్కాయి. పాక్‌కు వెళ్లిన 1.4 లక్షల మంది సైనికుల్లో అత్యధికులు ముస్లింలే ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. తమ వంతుకు వచి్చన కొద్ది మంది హిందూ సైనికులను కూడా పాక్ వీలైనంత వరకూ వెనక్కిచ్చి బదులుగా ముస్లిం సిపాయిలనే తీసుకుంది. సైనిక పంపకాలను పర్యవేక్షించిన బ్రిటిష్ సైనికాధికారుల్లో జనరల్ సర్ రాబర్ట్ లాక్హార్ట్ భారత్‌కు, జనరల్ సర్ ఫ్రాంక్ మెసెర్వీ పాక్‌కు తొలిసైన్యాధ్యక్షులయ్యారు!...బగ్గీ భారత్‌కే! భారత్, పాక్ మధ్య పురాతన వస్తువులు, కళాఖండాల పంపకం ఓ పట్టాన తేలలేదు. మరీ ముఖ్యంగా బంగారు తాపడంతో కూడిన వైస్రాయ్ అందాల గుర్రపు బగ్గీ తమకే కావాలని ఇరు దేశాలూ పట్టుబట్టాయి. దాంతో చివరికేం చేశారో తెలుసా? టాస్ వేశారు! అందులో భారత్ నెగ్గి బగ్గీని అట్టిపెట్టుకుంది!80:20 నిష్పత్తిలో చరాస్తులు ఆఫీస్ ఫర్నిచర్, స్టేషనరీ వంటి చరాస్తులన్నింటినీ భారత్, పాక్ మధ్య 80:20 నిష్పత్తిలో పంచారు. చివరికి ఇదే నిష్పత్తిలో కరెంటు బల్బులను కూడా వదలకుండా పంచుకున్నారు! ఆస్తులు, అప్పులు ఆస్తులు, అప్పుల పంపకంపై కమిటీ తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. చివరికి బ్రిటిíÙండియా తాలూకు ఆస్తులు, అప్పుల్లో 17.5 శాతం పాక్‌కు చెందాలని తేల్చారు. దీనికి తోడు అదనంగా కొంత నగదు చెల్లించాల్సిందేనంటూ పాక్ భీషి్మంచుకుంది. అందుకు పటేల్ ససేమిరా అన్నారు. కశీ్మర్ పూర్తిగా భారత్‌కే చెందుతుందంటూ ఒప్పందంపై సంతకం చేస్తేనే నగదు సంగతి చూస్తామని కుండబద్దలు కొట్టారు. కానీ గాంధీ మాత్రం ఒప్పందం మేరకు పాక్‌కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. దాంతో పటేల్ వద్దని మొత్తుకుంటున్నా 1947 జనవరి 20వ తేదీనే నెహ్రూ తాత్కాలిక సర్కారు పాక్‌కు రూ.20 కోట్లు చెల్లించింది. కానీ కశీ్మర్‌పై పాక్ దురాక్రమణ నేపథ్యంలో మరో రూ.75 కోట్ల చెల్లింపును నిలిపేసింది.ఇప్పటికీ ఒకరికొకరు బాకీనే! అప్పటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు 1948 మార్చి 31 దాకా ఇరు దేశాల్లోనూ చెల్లేలా ఒప్పందం జరిగింది. కానీ ఐదేళ్ల దాకా రెండు కరెన్సీలూ అక్కడా, ఇక్కడా చెలామణీ అవుతూ వచ్చాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నగదు పంపకాల గోల ఇప్పటికీ తేలలేదు! రూ.300 కోట్ల ‘విభజన ముందటి మొత్తం’ పాక్ బాకీ ఉందని భారత్ అంటోంది. 2022–23 కేంద్ర ఆర్థిక సర్వేలో కూడా ఈ మొత్తాన్ని పేర్కొనడం విశేషం. కానీ భారతే తనకు రూ.560 కోట్లు బాకీ అన్నది పాక్ వాదన!జోయ్‌మొనీ, ద ఎలిఫెంట్! జంతువులను కూడా రెండు దేశాలూ పంచేసుకున్నాయి. ఈ క్రమంలో జోయ్‌మొనీ అనే ఏనుగు పంపకం ప్రహసనాన్ని తలపించింది. దాన్ని పాక్‌కు (తూర్పు బెంగాల్‌కు, అంటే నేటి బంగ్లాదేశ్‌కు) ఇచ్చేయాలని నిర్ణయం జరిగింది. దాని విలువ ఓ రైలు బోగీతో సమానమని లెక్కగట్టారు. అలా ఓ రైలు బోగీ భారత్‌కు దక్కాలన్నది ఒప్పందం. కానీ విభజన వేళ జోయ్‌మొనీ మాల్డాలో ఉండిపోయింది. ఆ ప్రాంతం భారత్ (పశి్చమబెంగాల్) వాటాకు వచ్చింది. దాంతో అది భారత్‌కే మిగిలిపోయింది.కొసమెరుపుభారత్, పాక్ విభజన ‘పగిలిన గుడ్లను తిరిగి అతికించడ’మంత అసాధ్యమంటూ అప్పట్లో ఓ ప్రఖ్యాత కాలమిస్టు పెదవి విరిచారు. అంతటి అసాధ్య కార్యం ఎట్టకేలకు సుసాధ్యమైంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
తీర ప్రాంతంలో దాడి ముప్పు: రాజ్‌నాథ్
కొల్లాం/న్యూఢిల్లీ: భారత్ పశ్చిమ తీరప్రాంతం వెంబడి పాకిస్తాన్ ఉగ్రదాడులకు దిగే అవకాశాలను కొట్టి పారేయలేమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే పాక్ ఎలాంటి దాడులకు పాల్పడినా తిప్పికొట్టడానికి తీరప్రాంత నిఘా దళాలు, నావికాదళ భద్రతా అధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేరళలో కొల్లామ్‌లో శుక్రవారం జరిగిన మాతా అమృతానందమయి 66వ పుట్టినరోజు ఉత్సవాలకు హాజరైన సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడారు. ‘‘కచ్ నుంచి కేరళ వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంతం వెంబడి పొరుగు దేశం ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడులకు దిగొచ్చు. రక్షణ మంత్రిగా నేను గట్టి హామీ ఇస్తున్నాను. పాక్ కుయుక్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా మన నావికా దళానికి ఉంది‘‘ అని అన్నారు. తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు పుల్వామా దాడులు జరిగాయని ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ఘటనతో భారత్ చేతులు ముడుచుకొని కూర్చోలేదని బాలకోట్ వైమానికి దాడులకు దిగి పాక్‌కు గట్టి బుద్ధి చెప్పిందని అన్నారు. మనం ఎవరి జోలికి వెళ్లమని కానీ అవతలి పక్షం ఆ పనిచేస్తే వారి అంతుచూస్తామని హెచ్చరించారు. సైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోని దేశాలకు అంతర్జాతీయంగా గౌరవం లభించదని అన్నారు. పంజాబ్‌లో దొరికిన మరో పాక్ డ్రోన్ భారత్, పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ఆయు ధాలను సరఫరా చేయడానికి వినియోగించిన ఒక పాకిస్తాన్ డ్రోన్ పంజాబ్‌లోని అటారిలో లభిం చింది. పాక్ నుంచి ఆయుధాలు సరఫరాకి వచ్చిన ఈ డ్రోన్ సాంకేతిక లోపాలతో అటారి వద్ద కుప్పకూలిందని సీనియర్ పోలీసు అధికారి బల్బీర్ సింగ్ వెల్లడించారు. వరి పొలంలో గడ్డి కుప్ప మాటున ఎవరికీ కనిపించకుండా ఆ డ్రోన్‌ను దాచి ఉంచారు. గత 10 రోజుల్లోనే దాదాపుగా ఈ తరహాలో 8 డ్రోన్ ఘటనలు జరిగాయి. ఈ డ్రోన్లు 5 కేజీల బరువును మోసుకొని రాగలవు. -
వాళ్లిద్దరూ కలిసి పనిచేయాలి
న్యూయార్క్: కశ్మీర్ సమస్య పరిష్కారంలో భారత్, పాక్ ప్రధానులిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, పాక్‌తో చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఐరాస సమావేశాల అనంతరం మంగళవారం ట్రంప్, భారత ప్రధాని మోదీ మరోసారి భేటీ అయ్యారు. అనంతరం మోదీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్‌లు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అనంతరం ప్రకటించిన ట్రంప్ ఈ విషయమై అడిగిన ప్రశ్నకు స్పందించారు.. ‘కశ్మీర్ విషయంలో పొరుగుదేశాల నేతలిద్దరూ కలిసి చర్చించుకుంటే బాగుంటుంది. వారు చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నా’ అని అన్నారు. పాక్ గడ్డపై ఉగ్ర స్థావరాలు, సైన్యానికి ఉగ్ర లింకులపై భారత విలేకరి అడిగిన ప్రశ్నపై ట్రంప్.. ‘మీకు చాలా సమర్థుడైన ప్రధాని ఉన్నారు. అవన్నీ ఆయన చూసుకుంటారు’ అని బదులిచ్చారు. భారత్– అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామన్నారు. ‘మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రజలకు మోదీ ఎంతో అభిమానం. భారతీయులకు ఎల్విస్ ప్రెస్లీ లాంటి వారు’ అని హ్యూస్టన్‌లో ఆహూతులు చూపిన అభిమానాన్ని ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు హౌడీ మోదీ కార్యక్రమం ఫొటోను బహూకరించారు. భారత్‌కు రండి! ట్రంప్‌ను ఆహ్వానించిన మోదీ కశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ తో చర్చలు జరగాలంటే ముందుగా ఆ దేశం నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉందని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. కుటుంబంతో భారత్‌కు రావాలని ట్రంప్‌ను మోదీ మరోసారి ఆహ్వానించారు. వాణిజ్యం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తదితర అంశాలపై ఇద్దరు నేతలు 40 నిమిషాల పాటు చర్చించారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా గత 30 ఏళ్లలో 42వేల మందికి పైగా చనిపోయారని ట్రంప్‌కు ప్రధాని వివరిం చారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఢిల్లీలో మీడియాకు తెలిపారు. కనీస భద్రత మధ్య మోదీ 2015లో లాహోర్‌లో పర్యటించారనీ, ఆ వెంటనే పఠాన్‌కోట్‌పై సైనిక స్థావరంపై ఉగ్ర దాడి జరిగిందని వివరించారన్నారు. ఉగ్రదాడులన్నీ ఒకటే! మంచి, చెడు.. చిన్న, పెద్ద ఉండదు: మోదీ మంచి, చెడు.. చిన్న, పెద్ద.. అంటూ ఉగ్రవాద దాడులను వర్గీకరించడం సరికాదని మోదీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఏ స్థాయి దాడైనా.. ఉగ్రదాడిని ఉగ్రవాద చర్యగానే పరిగణించాలని ప్రపంచదేశాలకు స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదంపై నాయకుల వ్యూహాత్మక స్పందన’ అంశంపై ఐక్యరాజ్యసమితిలో మంగళవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రపంచదేశాలు పరస్పర సహకారాన్ని వివిధ స్థాయిల్లో వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో మిత్ర దేశాలతో కలిసి పనిచేసేందుకు, ఆయా దేశాల సామర్ధ్య పెంపులో సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అలాగే, ఉగ్రవాదులు నిధులు, ఆయుధాలు సమకూర్చుకోకుండా చూడాల్సి ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు సహకారం, సమాచార పంపిణీ.. తదితరాలపై ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలను ఏర్పర్చుకోవాల్సి ఉందన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల్ని ఎదుర్కొనేందుకు భారత్ ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంపై గౌరవం, సమ్మిళిత అభివృద్ధి మొదలైన కీలక ఆయుధాలను ఉపయోగిస్తోందని మోదీ వివరించారు. ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఐరాస ఆంక్షలు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్.. మొదలైన వాటిని రాజకీయం చేయొద్దని సూచించారు. ఆన్లైన్లోని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సమర్ధించే సమాచారాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన క్రైస్ట్‌చర్చ్ పిలుపునకు మోదీ మద్దతు పలికారు. -
భారత్-పాక్ సంబంధాల కోసం యువత కృషి చేయాలి: అక్తర్
ఇస్లామాబాద్ : భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ దేశానికే చెందిన మరో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం ఇరు దేశాల సత్సంబంధాల కోసం యువత కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పటికే ద్వేషంతో ఇరు దేశ ప్రజలు 70 ఏళ్లు జీవించారని, ఇలా మరో 70 ఏళ్లు నివసించడానికి సిద్దంగా ఉన్నారా అని ట్విటర్ వేదికగా యువతను ప్రశ్నించాడు. ‘భారత్-పాక్ సంబంధాల కోసం ఇరు దేశాల యువత కృషి చేయాలి. గత డెబ్బై ఏళ్లుగా మన హక్కులను, పెండింగ్‌లో ఉన్న హామీలను ఎందుకు పరిష్కరించలేకపోయారనే కఠినమైన ప్రశ్నలతో అధికారులను నిలదీయండి. ఇరు దేశాల మధ్య ద్వేషంతో మరో 70 ఏళ్లు బతకడానికి సిద్దంగా ఉన్నారా’ అని ట్వీట్ చేశాడు. శుక్రవారం బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై విధించిన శిక్షపై విచారం వ్యక్తం చేసిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. శనివారం బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశాడు. Both side of youth need to stand up for India & Pak relationship & ask authorities a right & difficult questions that why we haven’t even able to sort out our pending issues for last 70 years I ask you are you ready to live another 70 year of your lives with this hatred — Shoaib Akhtar (@shoaib100mph) 7 April 2018 Finally Salman gets a relief from honourable court I wish 1 day in my life time i get a news of Kashmir Palestine Yemen Afghanistan & all the troubled area of the world are free bcoz my heart bleeds for humanity & loss of innocent life .. — Shoaib Akhtar (@shoaib100mph) 7 April 2018 -
భారత్-పాక్ పోరును చూడలేమా!
⇒ ఐసీసీ టోర్నీల్లో పాక్, భారత్ లను ఒకే పార్శంలో వేయవద్దు: బీసీసీఐ దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల క్రికెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రపంచంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ తర్వాత, క్రికెట్ ప్రేమికులకు ఎక్కువ జోష్ నిచ్చే ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్. అయితే ఇకనుంచి దాయాదుల పోరు చూసే అవకాశాన్ని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇకపై నిర్వహించే అంతర్జాతీయ టోర్నీలలో పాక్ జట్టు ఉన్న గ్రూపు, లేక పార్శంలో టీమిండియాను ఉంచరాదని బీసీసీఐ సభ్యులు ఐసీసీని కోరారు. ముంబైలో శుక్రవారం నాడు సాధారణ సమావేశం తర్వాత బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్, బోర్డు సభ్యులతో కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ టోర్నీల్లో దాయాది జట్టుతో ఆడేందుకే భారత్ విముఖత వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ద్వైపాక్షిక సిరీస్ లు కొన్నేళ్లపాటు ఆడే అవకాశం ఉండదు. మరో 7 నెలల్లో నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీనే మేజర్ టోర్నీ. ఆ టోర్నీలో ఒకే గ్రూపులో ఉన్న భారత్, పాక్ లు తమ తొలి మ్యాచ్ దాయాది జట్టుతోనే ఆడనుండటం గమనార్హం. అయితే బీసీసీఐ తాజాగా ఐసీసీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మార్పులు ఉంటాయన్నది తెలియాలంటే కొన్నిరోజుల వరకు వేచిచూడక తప్పదు. జమ్ముకశ్మీర్ లో పాక్ ఉడీ ఉగ్రదాడికి పాల్పడ్డ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటున్నాయి -
ఉగ్రవాదం ఆపేస్తే చాలు..
తరువాతే చర్చలకు రండి పాకిస్తాన్‌కు సుష్మ సూచన ఇరు దేశాల మధ్య చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవు నవాజ్ చెప్పిన నాలుగు సూత్రాలు అవసరం లేదు ఐరాస సర్వసభ్య సభలో విదేశీ వ్యవహారాల మంత్రి ప్రసంగం ఐక్యరాజ్యసమితి:చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని భారతదేశం పాకిస్తాన్‌కు తేల్చిచెప్పింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్యల కోసం ఆ దేశ ప్రధాని చెప్పిన నాలుగు సూ త్రాలు అవసరం లేదని.. ఉగ్రవాదాన్ని నిలిపివేసి చర్చలకు రావటమన్న ఒకే ఒక్క సూత్రం చాలునని పేర్కొంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ముంబై దాడుల సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వివరించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న, సాయపడుతున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. పాక్‌తో ఉగ్రవాదం అంశంతో పాటు.. భద్రతా మండలి సంస్కరణలు, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాలనూ ప్రస్తావించారు. ఆమె ప్రసంగంలో ఉగ్రవాదానికి సంబంధించి ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ఆ దేశాలపై చర్యలు చేపట్టాలి: ఐక్యరాజ్యసమితికి భారత్ చాలా అందించింది. శాంతి పరిరక్షణ మిషన్లకు భారత్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. 8,000 మంది సైనికులు, పోలీసు సిబ్బంది పది దేశాల్లో పని చేస్తున్నారు. కానీ.. శాంతిపరిరక్షకులని అందించే దేశాలు నిర్ణయాలు తీసుకునే దేశాలు కాకపోవటం విచారకరం. శాంతిపరిరక్షణ ఆపరేషన్లకు భారత్ 25 ఏళ్లుగా దళాలు అందిస్తోంది. భారత్ 25 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. న్యూయార్క్ కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. నేడు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు.. ఉగ్రవాదానికి మనం ఎలా స్పందిస్తాం అనే దానిపై అంతర్జాతీయ సమాజం భవిష్యత్తు ఇప్పుడు ఆధారపడి ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే, వారికి శిక్షణనిచ్చే లేదా వారి దాడులు నిర్వహించేందుకు సాయం చేసే దేశాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి నిలబడాలి. భారీ మూల్యం చెల్లించేలా అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు కింద ఒక అంతర్జాతీయ విధానాన్ని ఇక ఎంత మాత్రమూ జాప్యం చేయకూడదు. జమ్మూకశ్మీర్ కోసమే ఈ దాడులన్నది అందరికీ తెలుసు: సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించటంలో గతంలో ఇచ్చిన హామీలను పాకిస్తాన్ నిలబెట్టుకోలేదు. 2008 నాటి ముంబై దాడుల్లో పౌరులు మాత్రమే కాదు.. పర్యాటకులూ చనిపోయారు. ఈ ఘోరమైన చర్య సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం ఇద్దరు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నాం. భారత్‌ను అస్థిరపరచటానికి, భారత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాలు, మిగతా భాగాలపై హక్కు కోరటానికి ఈ దాడులు జరుగుతున్నాయని మనకందరికీ తెలుసు. ఉగ్రవాదం నిలిపివేసి.. చర్చించుకుందాం రండి: చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. కానీ చర్చలు-ఉగ్రవాదం ఒకేసారి సాగలేవు. కొత్తగా శాంతి చర్యల కోసం నవాజ్‌షరీఫ్ నిన్న నాలుగు సూత్రాలు చెప్పారు. నాలుగు సూత్రాలు అవసరం లేదు.. కేవలం ఒక్కటి చాలు. ఉగ్రవాదాన్ని నిలిపివేయండి.. కూర్చు ని చర్చించుకుందాం రండి. మా ప్రధానమంత్రికి, మీకు మధ్య ఉఫాలో చర్చలు జరిగాయి. ఎన్ఎస్ఏలు కూడా చర్చించాల్సి ఉండింది. ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపై ఆ చర్చలు జరగాలని మేం కోరుకుంటున్నాం. అలాగే డీజీఎంఓల భేటీ కూడా త్వరగా జరగాలని కోరుతున్నాం. ఆ చర్చల్లో విశ్వసనీయత కనబరిస్తే.. మిగతా వివాదాలన్నిటినీ చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మేం సిద్ధం. -
పాక్ పటాస్
ఈమధ్య టీవీలో మీరు ఈ టీజర్ చూసే ఉంటారు. 1992- 2011 మధ్య ఇండియా-పాక్‌లు తలపడిన ఐదు సందర్భాల్లోనూ గెలుపుపై ఆశలుపెట్టుకొని సంబరాలకు పటాసులు రెడీ చేసుకొన్న ఓ పాక్ అభిమాని... తీరా తమ జట్టు ఓడిపోయే సరికి వాటిని అటకెక్కించేస్తుంటాడు. సగటు పాక్ జట్టు అభిమానిని ఉడికిస్తున్నట్టుగా ఉన్న ఆ తొలి టీజర్ ఇండియన్ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా అలరించింది. అయితే ముందుగానే టీజర్లను డిజైన్ చేసుకున్నారో ఏమో కానీ స్టార్ టీవీ వాళ్లు పాక్‌తో మ్యాచ్ అనంతరం ఇండియన్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ అతడి చేతిలో పటాస్‌లు ఉంచారు. ప్రపంచకప్‌లో అంతవరకూ దక్షిణాఫ్రికాపై గెలిచిన చరిత్రే లేని ఇండియన్ టీమ్‌కు అది దెప్పిపొడుపులా అనిపించింది. తీరా దక్షిణాఫ్రికాపై ఇండియన్ టీమ్ నెగ్గేసరిగి తిరిగి ఆ టీజర్‌ను పాక్ వైపు మళ్లించారు. తమ జట్టు ఇండియాపై గెలవకపోవడంతో పటాసులను పేల్చే అవకాశం రాని బాధలో ఉన్న పాకిస్తాన్ అభిమాని దక్షిణాఫ్రికా అయినా ఇండియాని ఓడిస్తుందనే ఆశలు పెట్టుకున్నట్టుగా మూడో టీజర్లో చూపారు. అందులో దక్షిణాఫ్రికా జెర్సీని ధరించిన పాక్ అభిమాని ఆ జట్టుకు మద్దతునిస్తాడు. అయితే ఈసారి కూడా ఆశాభంగమే! ఈ అసహనంతో ఉడికిపోతున్న అతడికి యూఈఏ ఫ్యాన్ తమ దేశ జెర్సీని అందిస్తాడు. ప్రస్తుతం స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతున్న ఈ టీజర్లో ఇండియాను యూఏఈ ఓడిస్తుందన్న ఆశతో ఆ దేశపు జెర్సీతో రెడీగా ఉంటాడు పాక్ అభిమాని. యూఏఈ ఒక అనామక జట్టు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలను చిత్తు చేసిన ఇండియన్ టీమ్‌ను ఓడించి పాక్ అభిమానిచేత పటాసులు కాల్పించేంత సీన్ ఆ జట్టుకు ఉంటుందా? ఏదేమైనా ఈ పటాసులు మోగనంత వరకే మనకు ఆనందం. కాబట్టి అవి శాశ్వతంగా పాక్ అభిమాని చేతిలోనే పదిలంగా ఉండాలని... ఈ ప్రపంచకప్ ముగిశాక కూడా అతడు వాటిని అటకెక్కించాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశ! - జీవన్ -
అందరి చూపు ఆట వైపు..
నేటి నుంచి ప్రపంచ క్రికెట్ పోటీలు ఆదివారం భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ జోరందుకోనున్న బెట్టింగులు ఆన్లైన్ బెట్టింగులకే ప్రాధాన్యం చిత్తూరు : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభంకానున్నాయి. తొలిరోజు న్యూజిలాండ్-శ్రీలంక,ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పోరు మొదలు కానుంది. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ దాయాదుల పోరు ఆదివారం అడిలైడ్‌లో జరగనుంది. ఆ తరువాత భారత్ ఈ నెల 22న దక్షిణాఫ్రికాతో,28న యుఏఈతో,మార్చి 6న వెస్టిండీస్‌తో,10న ఇంగ్లండ్‌తో,14న జింబాబ్వేతో తలపడనుంది. మార్చి 29న ప్రపంచకప్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. నాలుగేళ్లకొకసారి జరిగే ప్రపంచకప్ పోటీల కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసినా క్రికెట్ చర్చే. గత ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత్ ఈ ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంటుందా.. అందుకు అవసరమైన బలముందా..ప్రస్తుతం ఆటగాళ్ల ఆటతీరు ఎలా ఉంది..ఈ ప్రపంచకప్‌లో ఎవరు ఫేవరెట్‌గా నిలువబోతున్నారు తదితర అంశాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏ నలుగురు యువకులు కలిసినా ఇదే చర్చ. మొత్తంగా ప్రపంచకప్ క్రికెట్ పండుగ సందడి షురూ అయింది. మరోవైపు మార్చిలోనే ఇంటర్,పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ మొదలయ్యాయి. ఆ తరువాత డిగ్రీ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఇదే సమయంలో ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరగనుండడంతో విద్యార్థులు చదువుపై సరిగా దృష్టి పెట్టే పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జోరందుకోనున్న బెట్టింగులు.. జిల్లాలో క్రికెట్ బెట్టింగులు జోరందకోనున్నాయి.మదనపల్లె,తిరుపతి పలమనేరుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలుప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ మేరకు పోలీసులు బెట్టింగు రాయుళ్లపై కేసులు సైతం నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రపంచకప్ సందడి నేపధ్యంలో జిల్లాలో బెట్టింగులు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు క్రికెట్ బెట్టింగులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల తాకిడి తప్పించుకునేందుకు బుకీలు ఆన్లైన్ బెట్టింగులకు తెరలేపారు. అన్ని లావాదేవీలు ఆన్లైన్లో సాగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు బుకీలు గతంలోలాగా హోటళ్లు లాడ్జీలలోనేకాక అపార్ట్మెంట్లు,ఇళ్లలోనే క్రికెట్ బెట్టింగులు నడిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్
కఠ్మాండు: భారత్-పాకిస్తాన్ల మధ్య చర్చల పునరుద్ధరణ అంశం భారత్ చేతిలోనే ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం గురించి విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించ గా గతంలో భారత ప్రభుత్వమే విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను ఏకపక్షంగా రద్దు చేసిందని...దీనిపై భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. -
కాశ్మీరొక్కటే సమస్య కాదు
భారత్‌తో సంబంధాలపై పాక్ హైకమిషనర్ బాసిత్ హైదరాబాద్: భారత్, పాక్‌ల మధ్య కాశ్మీర్ అంశం ఒక్కటే సమస్య కాదని, పది వివిధ అంశాలపై చర్చలు జరగాల్సిన అవసరముందని భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. గతంలో కాశ్మీర్ వివాదం పరిష్కారమయ్యే వరకు మిగతా చర్చలకు ఆస్కారం లేని పరిస్థితి ఉండేదని, అప్పటితో పోల్చితే ఇప్పుడెంతో ముందడుగు వేశామని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్, పాక్ మధ్య గత ఆగస్టులో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం రద్దయినప్పటినుంచీ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని గుర్తు చేశారు. పాక్‌ను ఉగ్రవాదపీడిత దేశంగా అభివర్ణించారు. ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ 2015 నుంచి మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లోగా ఆరు సిరీస్‌ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, జర్నలిస్టు నాయకుడు దేవుల పల్లి అమర్, ప్రెస్‌కౌన్సిల్ సభ్యుడు అమర్నాథ్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఆతిథ్యాన్ని మరిచిపోలేను హైదరాబాద్ నగరం తానూహించిన దానికంటే ఎంతో అందంగా ఉందంటూ బాసిత్ కితాబిచ్చారు. ‘‘భారత్‌లో బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నగరానికొచ్చాను. ఇక్కడి సంస్కతీ సంప్రదాయాలకు నగరం అద్దం పడుతోంది. మరచిపోలేనంత ఆత్మీయంగా ఆతిథ్యమిచ్చింది. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, ఇతర వంటకాల రుచిని ఎప్పటికీ మరిచిపోలేను’’ అన్నారు. ఆదివారం ఇండో అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ నివాసంలో ఏర్పాటు చేసిన విందులో బాసిత్ పాల్గొన్నారు. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోనూ మాట్లాడారు.