India Companies
-
Shombi Sharp: ప్రపంచానికి భారత్ అవసరం
న్యూఢిల్లీ: సామాజిక అంశాలపై పెట్టుబడుల పరంగా భారత్ కంపెనీలు ముందున్నందున ప్రపంచానికి భారత్ అవసరం ఎంతో ఉందని ఐక్యరాజ్యసమితి భారత రెసిడెంట్ కోర్డినేటర్ శొంబిషార్ప్ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఢిల్లీలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)పై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శొంబి మాట్లాడారు. భారత ప్రయాణంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత అనివార్యమంటూ.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో వ్యాపారాలు ముందున్నట్టు చెప్పారు. సీఎస్ఆర్ విషయంలో, భారత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టు తెలిపారు. ‘‘ప్రపంచంలో సగానికి సగం దేశాలు విద్య, ఆరోగ్యం కంటే తమ అప్పులు తీర్చడానికే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఇటీవలి జీ20 సదస్సు సందర్భంగా భారత్ నాయకత్వ పాత్ర పోషించింది’’అని శొంబి పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం లాభాల్లోని కంపెనీలు క్రితం మూడేళ్ల కాలంలోని సగటు లాభాల నుంచి 2 శాతాన్ని సామాజిక కార్యక్రమాల కోసం (సీఎస్ఆర్) వ్యయం చేయాల్సి ఉంటుంది. -
300 కోట్ల డాలర్ల కొనుగోలు ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్‌లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం చైనా కంపెనీలు 650 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. అంతేకాకుండా భారత కంపెనీలతో 300 కోట్ల డాలర్ల విలువైన కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల చైనా అధ్యక్షుడు ఝి జిన్‌పింగ్ భారత పర్యటనలో ఈ మేరకు ఒప్పందాలు జరగనున్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. వాణిజ్యం, ఆర్థిక వృద్ధి, ఫార్మా, తదితర రంగాల్లో 16 వరకూ ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆటోమొబైల్ పారిశ్రామిక పార్క్‌ను, గుజరాత్లో విద్యుత్ ట్రాన్సిమిషన్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని చైనా ప్రతిపాది స్తోంది. ఈ పర్యటనలో భాగంగా సముద్ర ఆహారం, కాటన్ నూలు, పారిశ్రామిక ఉప్పు, పాలీప్రొపలీన్, కాపర్ కాధోడ్ తదితర వస్తువుల కొనుగోళ్ల కోసం భారత కంపెనీలు 12కు పైగా చైనా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.