breaking news
India first innings
-
గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్‌తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్‌బాస్టన్‌లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్‌కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్‌దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్‌పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్‌హామ్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్‌బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్‌కు సుందర్‌తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్‌తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్‌కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్‌లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్‌కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్‌ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్‌కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్‌కు 4.6 రన్‌రేట్‌తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్‌ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్‌దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్‌ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్‌దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్‌దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0. -
తొలి రోజు మనదే!
స్వల్పకాలిక వైఫల్యం తర్వాత గత మ్యాచ్‌లోనే తన క్లాస్ చూపించిన విరాట్ కోహ్లి ఇప్పుడు అదే ఫామ్‌ను మరో మ్యాచ్‌కు పొడిగించాడు. విదేశాల్లో అదరగొడుతున్నా... సొంతగడ్డపై 17 ఇన్నింగ్సలుగా అందని శతకాన్ని ఇప్పుడు సాధించి ఆ వెలితిని దూరం చేసుకున్నాడు. మొదటి రోజే బ్యాటింగ్‌కు ఇబ్బందిగా కనిపించిన పిచ్... మరోవైపు ప్రత్యర్థి బౌలర్లు విసురుతున్న బంతులు అనూహ్యంగా ఇబ్బంది పెడుతున్న స్థితిలో అతను తనలోని అసలు సిసలు టెస్టు బ్యాట్స్‌మన్‌ను బయటకు తెచ్చాడు. తొలిసారి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన చారిత్రక మైదానంలో అపూర్వ ఇన్నింగ్స ఆడిన విరాట్... రహానే సహకారంతో తన జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆట మళ్లీ రీప్లేలా కనిపించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఒక దశలో చక్కటి బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేయడం, ఆ తర్వాత పట్టు సడలించి కోలుకునే అవకాశం ఇవ్వడం... వెరసి ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా తొలి రోజు ఆట సాగింది. రెండో రోజూ భారత బ్యాట్స్‌మెన్ చెలరేగితే ఇక ఆ జట్టు ఆశలు వదులుకోవాల్సిందే. భారత్ 267/3 విరాట్ కోహ్లి సెంచరీ రాణించిన రహానే న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ఇండోర్: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా భారత్ తొలి అడుగును విజయవంతంగా వేసింది. మొదటిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఇక్కడి హోల్క ర్ మైదానంలో అభిమానులకు గుర్తుండిపోయే ఆరంభాన్ని అందించింది. కివీస్‌తో శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్సలో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (191 బంతుల్లో 103 బ్యాటింగ్: 10 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. అతని కెరీర్లో ఇది 13వ సెంచరీ కాగా... ఈ సిరీస్‌లో ఇరు జట్ల తరఫున ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. కోహ్లికి అండగా నిలిచిన అజింక్య రహానే (172 బంతుల్లో 79 బ్యాటింగ్: 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 167 పరుగులు జోడించారు. మన మిగతా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉండటంతో భారత్ రెండో రోజు ఆదివారం భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. స్కోరు వివరాలు భారతదేశం తొలి ఇన్నింగ్స్ : విజయ్ (సి) లాథమ్ (బి) పటేల్ 10; గంభీర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 29; పుజారా (బి) సాన్‌ట్నర్ 41; కోహ్లి (బ్యాటింగ్) 103; రహానే (బ్యాటింగ్) 79; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1-26; 2-60; 3-100.; బౌలింగ్: బౌల్ట్ 16-2-54-1; హెన్రీ 20-3-65-0; పటేల్ 24-3-65-1; సాన్‌ట్నర్ 19-3-53-1; నీషమ్ 11-1-27-0. తొలి సెషన్: ఓపెనర్లు విఫలం ధావన్ గాయపడటంతో రెండేళ్ల తర్వాత గౌతమ్ గంభీర్‌కు టెస్టు ఆడే అవకాశం దక్కగా... గాయపడిన భువనేశ్వర్ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేశారు. కివీస్ జట్టులో కూడా కెప్టెన్ విలియమ్సన్తో పాటు నీషమ్ తుది జట్టులోకి వచ్చారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్ మొదలు ఇప్పటివరకు ఆడిన 7 టెస్టులలోనూ కోహ్లి టాస్ గెలవడం విశేషం. ఇన్నింగ్స ఆరంభంలోనే హెన్రీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది గంభీర్ (53 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించాడు. కానీ ఐదో ఓవర్లోనే స్పిన్నర్‌ను బౌలింగ్‌కు దింపి కివీస్ ఫలితం సాధించింది. జీతన్ పటేల్ తన తొలి ఓవర్లోనే విజయ్ (10)ను అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో గంభీర్, పుజారా మరో 15 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడి 34 పరుగులు జోడించారు. అయితే తనకు దక్కిన అవకాశాన్ని గంభీర్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. క్రీజ్‌లో నిలదొక్కకున్న తర్వాత కూడా అతను పరుగులు చేయడంలో తడబడ్డాడు. చివరకు బౌల్ట్ వేసిన చక్కటి బంతికి గంభీర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఓవర్లు: 26, పరుగులు: 75, వికెట్లు: 2 రెండో సెషన్: కట్టడి చేసిన బౌలర్లు లంచ్ తర్వాత కివీస్ బౌలింగ్ మరింత పదునెక్కింది. ఒకవైపు పిచ్ కూడా అనుకూలిస్తుండగా స్పిన్నర్లు సాన్‌ట్నర్, పటేల్ మంచి టర్నింగ్ రాబట్టారు. దాంతో అప్పటి వరకు చక్కగా ఆడుతూ వచ్చిన పుజారా (108 బంతుల్లో 41; 6 ఫోర్లు) కూడా ఏకాగ్రత కోల్పోయాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో అతను బౌల్డ్ కావడంతో సరిగ్గా 100 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో కోహ్లి, రహానే జత కలిశారు. వీరిద్దరు చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్‌సను చక్కదిద్దే ప్రయత్నంలో చేశారు. గత రెండు టెస్టులలో తాను వెనుదిరిగేందుకు కారణమైన షాట్లకు దూరంగా ఈ సారి కోహ్లి నియంత్రణతో ఆడాడు. అయితే కివీస్ పేసర్లు కూడా కొద్దిసేపు బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. హెన్రీ, నీషమ్ విసిరిన బంతులు రహానే శరీరాన్ని బలంగా తాకినా అతను పట్టుదల ప్రదర్శించాడు. కివీస్ ఫీల్డర్ల ఏమరుపాటుతో కోహ్లి, రహానే ఒక్కోసారి అవుటయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు. కొన్ని ఉత్కంఠభరిత క్షణాలు ఎదురైనా మన బ్యాట్స్‌మెన్ ప్రమాదం లేకుండా సెషన్‌ను ముగించారు. ఓవర్లు: 30, పరుగులు: 73, వికెట్లు: 1 మూడో సెషన్: తిరుగులేని బ్యాటింగ్ విరామం తర్వాత మాత్రం భారత బ్యాట్స్‌మెన్ తమదైన శైలిలో దూసుకుపోయారు. స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝళిపించారు. ఈ క్రమంలో ముందుగా 108 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 123 బంతుల్లో రహానే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శతథా ప్రయత్నించినా ఈ జోడీని విడదీయడంలో కివీస్ బౌలర్లు విఫలం కావడంతో సరిగ్గా 80 ఓవర్లకే ఆ జట్టు కొత్త బంతిని తీసుకుంది. కానీ అది కూడా ప్రభావం చూపించలేకపోయింది. హెన్రీ వేసిన 85వ ఓవర్లో బంతిని పాయింట్ దిశగా నెట్టిన కోహ్లి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా స్టంప్స్‌ను తాకింది. డైవ్ చేస్తూ క్రీజ్‌లోకి చేరిన కోహ్లి ఒక వైపు నమ్మకంతో ఉండగా, మరో వైపు కివీస్ కూడా వికెట్ దక్కిందని సంబరపడింది. రీప్లేలో అది నాటౌట్ అని తేలడంతో కోహ్లి సెంచరీ పూర్తయింది. దాంతో కెప్టెన్ తన సహచరుల వైపు చూస్తూ విజయగర్వం ప్రదర్శించాడు. తొలి రెండు సెషన్లలో భారత్ ఇన్నింగ్స నెమ్మదిగా సాగినా... చివరి సెషన్లో వేగంగా పరుగులు వచ్చాయి. ఓవర్లు: 34, పరుగులు: 119, వికెట్లు: 0 నా స్ట్రరుుక్ రేట్‌పై విమర్శలు అర్థరహితం. టెస్టుల్లో స్ట్రరుుక్ రేట్ ముఖ్యం కాదు. ఇలాంటి వికెట్‌పై ఎవరూ 70-80 స్ట్రరుుక్ రేట్‌తో పరుగులు చేయలేరు. టీం మేనేజ్మెంట్ అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం ప్రధానం. పరిస్థితులకు అనుగుణంగా, జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడాలి. కోహ్లి, రహానే చాలా బాగా ఆడారు. వీరిద్దరు ఇదే జోరును రెండో రోజూ కొనసాగించాలి. సాధ్యమైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి కనీసం 400 పరుగులు చేయాలని భావిస్తున్నాం. పిచ్ ఇలాగే ఉంటే మన అశ్విన్ చెలరేగిపోగలడు. -పుజారా కెప్టెన్‌గా కోహ్లికిది ఆరో సెంచరీ. 2003 తర్వాత భారత కెప్టెన్ ఒకరు కివీస్‌పై శతకం సాధించడం ఇదే తొలిసారి. 2000 రహానే టెస్టుల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
పుజారా సెంచరీ
రంజీ సెమీస్ మ్యాచ్ వడోదర: అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆధిపత్యం కనబరుస్తోంది. చతేశ్వర్ పుజారా (116 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించడంతో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరాష్ట్ర 20 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు 193/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. కటక్‌లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటైంది. -
రాహుల్ జిగేల్.. కోహ్లి కమాల్
కళ్లెదురుగా కొండంత స్కోరు కనిపిస్తోంది... అనుభవం చూస్తే ఒక్కటే టెస్టు... కొత్త కుర్రాడు... అయినా లోకేశ్ రాహుల్ బెదరలేదు, తడబడలేదు. ఆసీస్ పేసర్ల యుక్తులకు తన టెక్నిక్‌తో జవాబు చెప్పాడు. ఆడుతున్న రెండో టెస్టులోనే ఆసీస్ గడ్డపై సెంచరీతో రాహుల్ ద్రవిడ్ వారసుడిలా కనిపించాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రస్తుతం ఆపేవాళ్లే కనిపించడం లేదు. సిరీస్‌లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా నాలుగో సెంచరీ బాదాడు. కళ్లు చెదిరే షాట్లతో అజేయ సెంచరీ చేసి ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. రాహుల్, కోహ్లిల శతకాలతో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా బదులిచ్చింది. అయితే ఇక్కడితో కథ ముగియలేదు. మరో రెండు రోజుల ఆట మిగిలింది. భారత్ ఇంకా ఫాలోఆన్ మార్కునూ దాటలేదు. కోహ్లితో పాటు క్రీజులో ఉన్న సాహాను మినహాయిస్తే... ఇక మిగిలిన వాళ్లంతా బౌలర్లే. కాబట్టి కోహ్లి మరింత బాధ్యతగా ఆడాలి. నాలుగో రోజు కనీసం రెండు సెషన్లు క్రీజులో నిలబడితే ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకోవచ్చు. శతకంతో చెలరేగిన కెప్టెన్ * సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ * తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 342/5 * ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ దీటుగా జవాబిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (214 బంతుల్లో 140 బ్యాటింగ్; 20 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (262 బంతుల్లో 110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీల మోత మోగించడంతో గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 115 ఓవర్లలో 5 వికెట్లకు 342 పరుగులు చేసింది. కోహ్లితో పాటు సాహా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.రోహిత్ (53) ఫర్వాలేదనిపించినా... రహానే (13), రైనా (0)లు విఫలమయ్యారు. వికెట్ నుంచి సహకారం లేకపోవడంతో తొలి రెండు సెషన్లలో పెద్దగా ప్రభావం చూపని ఆసీస్ బౌలర్లు చివరి గంటలో చకచకా మూడు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రస్తుతం భారత్ ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు:- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) అండ్ (బి) స్టార్క్ 110; రోహిత్ (బి) లయోన్ 53; కోహ్లి బ్యాటింగ్ 140; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) వాట్సన్ 13; రైనా (సి) హాడిన్ (బి) వాట్సన్ 0; సాహా బ్యాటింగ్ 14; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (115 ఓవర్లలో 5 వికెట్లకు) 342. వికెట్ల పతనం: 1-0; 2-97; 3-238; 4-292; 5-292 బౌలింగ్: స్టార్క్ 21-4-77-2; హారిస్ 23-6-63-0; హాజెల్‌వుడ్ 20-5-45-0; లయోన్ 32-7-91-1; వాట్సన్ 15-4-42-2; స్మిత్ 4-0-17-0. కోహ్లి రికార్డుల మోత * ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (639). గతంలో ద్రవిడ్ (619) టాప్ స్కోరర్. అయితే ద్రవిడ్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులను కోహ్లి ఏడో ఇన్నింగ్స్‌లలోనే అధిగమించాడు. * జట్టు కెప్టెన్‌గా తన తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ విరాట్. గతంలో గ్రెగ్ చాపెల్ రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు చేశాడు. * ఒక టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో 1978-79లో వెస్టిండీస్‌పై గవాస్కర్ ఈ ఘనత సాధించారు. * ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో విదేశీ క్రికెటర్ విరాట్. గతంలో ఇంగ్లండ్ క్రికెటర్ సట్‌క్లిఫ్ (1924-25), దక్షిణాఫ్రికా క్రికెటర్ హామండ్ (1928-29) మాత్రమే ఈ ఘనత సాధించారు. * ఆస్ట్రేలియా గడ్డపై నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ కోహ్లి. సెషన్-1: నత్త నడక 71/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన రోహిత్, రాహుల్ ఒక్కో పరుగు జోడించుకుంటూ వెళ్లారు. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కడా లైన్ తప్పకుండా ఓపిగ్గా బౌలింగ్ చేశారు. ఈ జోడి తొలి గంటలో 15 ఓవర్లలో మూడు బౌండరీలతో 19 పరుగులు మాత్రమే చేసింది. అయితే రెండో గంటలో మాత్రం పరుగుల వేగం పెరిగింది. మరోవైపు బౌన్స్‌ను, టర్న్‌ను సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్ లయోన్ 44వ ఓవర్లో రాహుల్‌ను అవుట్ చేసినంత పని చేశాడు.షార్ట్‌లెగ్‌లో బంతి బర్న్స్‌ను తాకుతూ వెళ్లడంతో బ్యాట్స్‌మన్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే అదే ఓవర్ నాలుగో బంతిని స్వీప్ చేయబోయిన రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన కోహ్లి ఎదుర్కొన్న తొలి బంతిని కాస్త తడబడుతూ ఆడాడు. అయితే అప్పటికే సగం పిచ్ వరకు పరుగెత్తుకుంటూ వచ్చిన రాహుల్‌ను వెనక్కి పంపాడు. అయితే కమిన్స్ మరో ఎండ్ వైపు త్రో విసరడంతో రాహుల్ బతికిపోయాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్ క్యాచ్ మిస్ చేయడంతో బయటపడ్డ రాహుల్ 161 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని లంచ్‌కు వెళ్లాడు. ఓవర్లు: 30; పరుగులు: 51; వికెట్లు: 1 సెషన్-2: రాహుల్ జోరు బౌలర్లకు సహకారం లేకపోవడం, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రాహుల్, కోహ్లి నింపాదిగా ఆడారు. లంచ్‌కు ముందు కేవలం 51 పరుగులు మాత్రమే చేసిన భారత్... ఆ తర్వాత వేగంగా ఆడింది. తొలి గంటలో 45, రెండో గంటలో 67 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న కోహ్లి దూకుడుగా ఆడాడు. 108 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు.ఈ జంటను విడదీసేందుకు బౌలర్లను పదేపదే మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు అలవోకగా పరుగులు చేయడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే రెండో కొత్త బంతిని తీసుకున్న తర్వాత 83వ ఓవర్లో విరాట్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్టార్క్ వేసిన బంతి కోహ్లి బ్యాట్‌ను తాకుతూ వెళ్లినా.. రెండో స్లిప్‌లో స్మిత్ దాన్ని అందుకోలేకపోయాడు. రెండు ఓవర్ల తర్వాత రాహుల్ 253 బంతుల్లో కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. ఓవర్లు: 30; పరుగులు: 112; వికెట్లు: 0 సెషన్-3: ఆకట్టుకున్న కోహ్లి దాదాపుగా తొలి రెండు సెషన్లలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన భారత్‌ను టీ తర్వాత ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. చివరి గంటలో చకచకా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. టీ తర్వాత రెండో ఓవర్లోనే లోకేశ్‌ను అవుట్ చేసి బౌలర్లు పైచేయి సాధించారు. విరాట్, రాహుల్ మధ్య మూడో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. తర్వాత వచ్చిన రహానే (13)ను నిలబెట్టి కోహ్లి వేగంగా ఆడాడు. దీంతో నాలుగో వికెట్‌కు 54 పరుగులు పూర్తయ్యాయి. ఇక్కడ భారత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. వాట్సన్ వరుస బంతుల్లో రహానే, రైనా (0)లను పెవిలియన్‌కు పంపాడు. సహచరులు వెనుదిరిగినా జోరు తగ్గకుండా ఆడిన కోహ్లి కెరీర్లో 10వ సెంచరీ పూర్తి చేశాడు. చివరి వరకు జాగ్రత్తగా ఆడిన ఈ జోడి మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. ఓవర్లు: 30; పరుగులు: 108; వికెట్లు: 3 స్పైడర్కామ్తోనే ఇబ్బంది! మూడో రోజు ఆట కంటే స్మిత్ క్యాచ్ మిస్ చేసిన తీరుపైనే ఎక్కువ చర్చ నడిచింది. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ వేసిన బంతి రాహుల్ బ్యాట్‌ను తాకి గాల్లో చాలా పైకి లేచింది. స్లిప్‌లో ఉన్న స్మిత్ వెనక్కి పరుగెత్తుతూ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి కోసం పైకి చూస్తున్న క్రమంలో కంటికి స్పైడర్‌కామ్ తీగ ఒకటి అడ్డుగా వచ్చింది. దీంతో కెప్టెన్ తడబడి క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇదే విషయంపై అంపైర్ రిచర్డ్ కెటిల్బోర్గ్తో కెప్టెన్ చర్చించాడు. అయితే బంతి కెమెరాకుగానీ, వైర్లకు గానీ తాకలేదని సీఏ, నైన్ నెట్వర్క్ ఓ ప్రకటనను విడుదల చేశాయి. స్మిత్ కంటికి వైర్ అడ్డుగా వచ్చిందని స్పష్టం చేశాయి. ఫీల్డింగ్ చేసేటప్పుడు స్పైడర్‌కామ్ అడ్డుగా ఉందని ఏ ఆటగాడైనా భావిస్తే దాన్ని అక్కడి నుంచి పక్కకు జరపమని అంపైర్‌ను అడగొచ్చు. ఒకే సిరీస్‌లో ఇద్దరు కెప్టెన్లు కలిసి ఆరు సెంచరీలు చేయడం సరికొత్త రికార్డు (కెప్టెన్‌గా కోహ్లి మూడు, స్మిత్ మూడు శతకాలు చేశారు) ఒకే సిరీస్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ (కోహ్లి, స్మిత్) నాలుగు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ‘సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెల్‌బోర్న్‌లోనే ఇది రావాల్సి ఉంది. ఇదే నా తొలి మ్యాచ్ అన్న తరహాలో బ్యాటింగ్ చేశా. బ్యాటింగ్ ఆర్డర్లో పైకి రావడంతో కుదురుకోవడానికి మంచి సమయం లభించింది. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. ఆసీస్ బౌలర్లు వికెట్ల కోసం చాలా ప్రయత్నించారు. సెషన్ల వారిగా బ్యాటింగ్ చేయాలని భావించా. ఈ టెస్టుకు జట్టులో చోటు అంత సులభంగా దక్కలేదు.కోహ్లితో పాటు నాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. నెట్స్‌లో ఫ్లెచర్, శాస్త్రి అద్భుతమైన సలహాలు ఇచ్చారు. క్యాచ్ ఇచ్చినందుకు బాధగా లేదు. అయితే నిర్లక్ష్యపు షాట్ ఆడినందుకు నిరాశపడుతున్నా. ఇక నుంచి షాట్ల ఎంపికపై చాలా జాగ్రత్తగా ఉంటా. శుక్రవారం మేం మెరుగ్గా బ్యాటింగ్ చేసి బౌలర్లు కష్టపడితే మ్యాచ్ గెలిచే అవకాశాలున్నాయి.’ -రాహుల్ (భారత్ బ్యాట్స్‌మన్)