రంజీ సెమీస్ మ్యాచ్
వడోదర: అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆధిపత్యం కనబరుస్తోంది. చతేశ్వర్ పుజారా (116 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించడంతో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరాష్ట్ర 20 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు 193/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది.
కటక్‌లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటైంది.
పుజారా సెంచరీ
Published Mon, Feb 15 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement
Advertisement