
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. 280 బంతులు ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్లతో ఈ సిరీస్‌లో రెండో శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో 17 సెంచరీలు పూర్తిచేసిన పుజారాకు ఆసీస్‌పై ఇది నాలుగో శతకం. విరాట్ కోహ్లి కూడా పుజారాకు చక్కటి తోడ్పాటు అందిస్తున్నాడు. వీరిద్దరు నిలకడగా ఆడుతుండటంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. ఓవర్ నైట్ స్కోరు 215/2తో రెండో రోజు బ్యాటింగ్ దిగిన టీమిండియా లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా(103), కోహ్లి(69) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment