India history
-
Chess Olympiad 2024: చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో...
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. మన గ్రాండ్ మాస్టర్లు ఏళ్ల తరబడి పోటీ పడుతున్నా అందని ద్రాక్షగానే ఉన్న బంగారు పతకం ఎట్టకేలకు దక్కే అవకాశం వచి్చంది. టోర్నీ చరిత్రలో తొలిసారి భారత పురుషుల జట్టు విజేతగా నిలవడం దాదాపుగా ఖాయమైంది. అడుగడుగునా హేమాహేమీ గ్రాండ్‌మాస్టర్లు, క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైన ఈ మెగా టోరీ్నలో మన ఆటగాళ్లు చిరస్మరణీయ విజయం సాధించారు. పది రౌండ్ల తర్వాత 19 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలవగా చైనా ప్రస్తుతం 17 పాయింట్లతో ఉంది. చివరి రౌండ్లో భారత్ ఓడి చైనా గెలిస్తేనే ఇరు జట్ల సమమై టై బ్రేక్‌కు దారి తీస్తుంది. అయితే మన టీమ్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఓటమి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి స్వర్ణం లాంఛనమే కావచ్చు. బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత పురుషుల జట్టు పది రౌండ్ల తర్వాత అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ కీలకమైన ఆఖరి పోరులో విజయం సాధించడంతో భారత్‌కు పసిడి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత్ బృందం మరో రౌండ్ మిగిలుండగానే విజేతగా మారే స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా ఆడిన పది రౌండ్లలో ఏకంగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఒక్క 9వ రౌండ్లో మాత్రం ఉజ్బెకిస్తాన్ భారత్‌ను డ్రాలతో నిలువరించింది. దీంతో ఈ మ్యాచ్ 2–2తో ‘టై’గా ముగిసింది. శనివారం జరిగిన పదో రౌండ్లో భారత ఆటగాళ్లు 2.5–1.5తో అమెరికాను ఓడించారు. దీంతో భారత్ 19 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆఖరిరౌండ్ ఉన్నప్పటికీ భారత్‌ను చేరుకునే జట్టే లేకపోవడంతో పసిడి పతకం వశమైంది. దొమ్మరాజు గుకేశ్...ఫాబియానో కరువానాపై గెలిచి మంచి ఆరంభమిచ్చాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో ఆర్.ప్రజ్ఞానంద... వెస్లి సో చేతిలో ఓడిపోవడంతో స్కోరు సమమైంది. ఈ దశలో విదిత్ గుజరాతి... లెవొన్ అరోనియన్‌తో గేమ్ డ్రా చేసుకోవడంతో మరోసారి 1.5–1.5 వద్ద మళ్లీ స్కోరు టై అయ్యింది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్... లినియార్ పెరెజ్‌పై గెలుపొందడంతో భారత్ ఈ టోరీ్నలో తొమ్మిదో విజయాన్ని సాధించింది. మహిళల విభాగంలో భారత బృందం చెప్పుకోదగ్గ విజయం సాధించింది. చదరంగ క్రీడలో గట్టి ప్రత్యర్థి అయిన చైనాకు భారత మహిళల బృందం ఊహించని షాకిచి్చంది. భారత్ 2.5–1.5తో చైనాను కంగుతినిపించింది. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... జూ జినర్‌తో, వంతిక అగర్వాల్... ల్యూ మియోయితో డ్రా చేసుకున్నారు. దివ్య దేశ్‌ముఖ్... ని షిఖన్ను ఓడించడంతో భారత్ విజయానికి బాటపడింది. ఆఖరి మ్యాచ్‌లో వైశాలి... గ్యూ కి గేమ్ డ్రా కావడంతో చైనా కంగుతింది. చివరిదైన 11వ రౌండ్ తర్వాతే మహిళల జట్టు స్థానం ఖరారవుతుంది. -
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్‌కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్‌కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్‌లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
చరిత్ర వక్రీకరణకు మథనం?!
ఉన్నట్టుండి ఇప్పుడు అకస్మాత్తుగా గుప్తుల పాలన ‘స్వర్ణయుగం’ అన్న స్పృహ పాలకులకు ఎందుకొచ్చినట్లు? నిజంగా గుప్తరాజుల కాలం ‘స్వర్ణయుగ’మేనా? స్వర్ణయుగం అన్న భావనే బ్రిటిష్ పాలకుల కల్పన. గుప్తరాజులూ సామ్రాజ్యవాదులే. గుప్తులు స్వయంగా పాలనాపరంగా తమ ముద్ర వేసుకొన్న భౌతికమైన ఆధారాలు లేవుగాక లేవు. గుప్తరాజులంతా సామ్రాజ్యాల విస్తరణలో సామాన్య ప్రజల్ని ఏదో ఒక రూపంలో దోచుకున్నవారే, వారి సంపదను కొల్లగొట్టి దాచుకుని, అనుభవించిన వారే. కుల వర్ణ వ్యవస్థలు వేళ్లూనుకున్న , బౌద్ధధర్మాన్ని ధ్వంసం చేసిన గుప్తుల కాలమే నేటి భారతదేశానికి ‘ఆదర్శ’మని భావించి, దానిని ‘జాతీయవాద పతాక’గా అభినవ భారత పాలకులు చెప్పదలిస్తే మాత్రం అంతకన్నా చరిత్ర వక్రీకరణ మరొకటి ఉండదేమో! ‘‘భారతదేశ చరిత్రను సవరించకుండా మమ్ములను అడ్డుకునేదెవరు? 1857 నాటి తిరుగుబాటుకు భారతీయ దృక్పథాన్ని అందించినవాడు వినాయక్ దామోదర్ సావర్కార్. ఆ తిరుగుబాటును తొలి స్వాతంత్య్ర సమరంగా ఆయన దర్శించకపోతే బ్రిటిష్ పాలకుల కళ్లతోనే ఆ సమరాన్ని చూడవలసి వచ్చేది. కాబట్టి మనం చరిత్రను తిరగరాయడానికి మనకు అడ్డొచ్చేదెవరు? పరదేశీయులైన హూణుల దండయాత్రల నుంచి దేశాన్ని కాపాడినవాళ్లు గుప్త రాజు వీరస్కంద గుప్త విక్రమాదిత్య. దురదృష్టవశాత్తు దేశ చరిత్రలో సుదీర్ఘకాలంపాటు ప్రజలు బానిసత్వాన్ని అనుభవించిన తరువాత కూడా సామ్రాట్ స్కందగుప్త గురించి మన పాఠ్యగ్రంథాలలో చదువుకోవడానికి నేడు పట్టుమని వంద పేజీలు కూడా దొరకని పరిస్థితి. కశ్మీర్‌కు స్వేచ్ఛను ప్రసాదించినవాడు స్కందగుప్తుడేనని నా నమ్మకం’’ – కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్నో సెమినార్లో ప్రకటన ‘‘గుప్త రాజుల పాలనా శకం ‘స్వర్ణయుగం’ అన్న భావన భార తీయులలో పుట్టింది కాదు, అది బ్రిటిష్ పాలకుల కల్పన. బ్రిటిష్ సివిల్ ఉద్యోగి, చరిత్రకారుడైన విన్సెంట్ స్మిత్ కల్పన. స్మిత్ భారతదేశ నాగరి కతకు చెందిన అనేకానేక అంశాలపట్ల ఎలాంటి ఆర్ద్రత, అనుకంపన లేనివాడు. అతడిది ఎంతసేపూ వలస పాలకుల దృష్టి, ఆ దృష్టినుంచే, వలస పాలనకు అనుకూలంగానే బ్రిటిష్ పెత్తనం కొనసాగించుకోవడా నికి వత్తాసుగా గుప్తుల కాలాన్ని స్తుతించాడు. ఎందుకంటే గుప్త రాజులూ సామ్రాజ్యవాదులే. గుప్తులు స్వయంగా పాలనాపరంగా తమ ముద్ర వేసుకొన్న భౌతికమైన ఆధారాలు లేవుగాక లేవు’’ – మైఖేల్ ఉడ్, చరిత్రకారుడు, ‘ది స్టోరీ ఆఫ్ ఇండియా’ 2007 దేశంలో ఇటీవలి కాలంలో బీజేపీ–ఎన్డీఏ పాలకులు ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ నినాదానికి క్రమంగా ఉద్యమరూపమిచ్చినప్పుడే, ‘ఒకే పార్టీ–ఒకే నేత’ అన్న అనంతర భావం రూపకల్పనకు కూడా నర్మ గర్భంగానే సమాయత్తమవుతున్నట్టు కన్పిస్తోంది. ఇప్పుడు అకస్మా త్తుగా గుప్తుల పాలన ‘స్వర్ణయుగం’ అన్న స్పృహ ఎందుకొచ్చినట్లు? నిజంగా గుప్తరాజుల కాలం ‘స్వర్ణయుగ’మేనా? ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పుకోవడానికి ముందు, ‘అవును– స్కందగుప్త విక్రమాది త్యుని’ చరిత్రలో ఆసక్తిని పునరుద్ధరించాల్సిందేనని అమిత్ షా ప్రకట నకు స్పందనగా, చరిత్రను తిరగరాసే కృషిలో భాగంగా స్కంద గుప్త చక్రవర్తి జీవిత చరిత్రను ఒక ఇతిహాసంగా రాసిన ఒక ప్రొఫెసర్ రాకేష్ ఉపాధ్యాయ గ్రంథం ప్రస్తావన కూడా ముందుకు దూసుకుని రావటం విశేషం. ముఖ్యంగా ‘జమ్మూ–కశ్మీర్’ ప్రత్యేక రాష్ట్ర ప్రతి పత్తిని రద్దుచేసి, ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని క్రమంగా ధ్వంసం చేస్తున్న ప్రస్తుత పాలకులకు, ఇప్పటిదాకా మనం ఎరుగని ఒక ఆచార్యుడు కొత్తగా స్కందగుప్త చక్రవర్తి చరిత్రలో పాఠకులకు ఆసక్తి ఎందుకు కలిగించాల్సి వస్తోంది? గుప్తుల పాలనా శకం క్రీ.శ. 300– 550 సంవత్సరాల మధ్య. ఆనాటి చక్రవర్తులు లేదా రాజులంతా సామ్రాజ్యాల విస్తరణలో సామాన్య ప్రజల్ని ఏదో ఒక రూపంలో దోచుకున్నవారే, వారి సంపదను కొల్లగొట్టి దాచుకుని, అనుభవిం చినవారే. విదేశీ దండయాత్రీకుల్నే గాదు, స్వదేశీ పోటీ రాచరిక శక్తుల్ని ఎదిరించి ధ్వంసం చేసి, తమ రాజ్యాల్ని విస్తరించుకున్నవారే. ఇరుగుపొరుగు ఆదివాసీ తెగల్ని, వారి ఆవాసాలను, భూములను ధ్వంసంచేసి, మూలవాసుల జానపద సంస్కృతీ మూలాల్ని అంది నంతమేరకు దోచుకుని ధ్వంసం చేసినవారే. ఈ స్వదేశీ దండయాత్ర లలో ఆరితేరిన వారిలో గుప్త రాజులు మినహాయింపు కారు. ఒక్క గ్రీకులే కాదు, హూణులే కాదు, పిండారులే కాదు, కాలానికి కత్తుల వంతెనలు కట్టిన నరహంతకులు దేశీయంగానూ ఉన్నారు. ఆమాట కొస్తే విదేశీ హూణులే కాదు, స్వదేశీ సంకర చక్రవర్తులు, రాజులు కూడా అనేక దేశీయ మూలవాసులైన ఆదివాసీ తెగలు సంస్కృతినీ, ఉనికినీ దెబ్బతీసినవారే. క్రీ.శ.455లో సామ్రాజ్య దండయాత్రలలో భాగంగా హూణులు జరిపిన దండయాత్రలతోపాటు, దేశీయంగా గుప్త రాజులు కూడా అసంఖ్యాక దేశీయ తెగలను, మూలవాసులను, వారి సంస్కృతిని ధ్వంసం చేసి భూములను స్వాధీనపరచుకుని అనుభవించినవారేనని మరచిపోరాదు. కొత్తగా అమిత్ షా చెబుతున్న చరిత్ర ‘పునరుద్ధరణ’ కృషికి తోడునీడగా ఆచార్య రాకేష్ ఉపాధ్యాయ తన గ్రంథం రాజకీయ ప్రయోజనం ఏమిటో ఇలా చెప్పక చెప్పుకున్నారు: ‘‘రాజకీయ అధి కారం లేకుండా దేశ సంస్కృతి లేదు, ఆ సంస్కృతి లేకుండా అధికా రమూ ఉండదు. అలాగే సంస్కృతిని కాపాడుకోవాలంటే రాజకీయం ఉండాలి, అలాగే సంస్కృతిని నిలబెట్టుకోకుండా రాజకీయానికి అర్థం లేదు’’. మరి ఏ ‘సంస్కృతి’ని ఏ ‘రాజకీయాన్ని’ కాపాడుకుందాం? రాచరికపు సంస్కృతినా, అరాచకపు రాజకీయాల్నా? అందుకే ప్రసిద్ధ చరిత్రకారుడు మైఖేల్ ఉడ్ (2007) గుప్తరాజులు ‘‘ఇవీ మేం స్వయంగా నెలకొల్పి, కాపాడిన భౌతిక సంపదకు దాఖలాలు అని చెప్పగల్గిన ఉదాహరణలేవి? అక్కడక్కడా చెదురుమదురుగా కని పించే చిన్న చిన్న గుళ్లు తప్ప మరెక్కడా ‘ఇదీ గుప్తుల వారసత్వ సంపద’ అని చెప్పదగిన వారెవరైనా ఉన్నారా? నిర్మించిన మహా ప్రాసాదాలు లేవు, ప్రజల ఆస్తులనదగిన పబ్లిక్ బిల్డింగ్స్ లేవు, కేవలం గుహలు, శిథిలమైన స్తూపాలు. అంతేగాని గుప్తుల దైనందిన జీవన విధానం గురించిగానీ, తమ సామ్రాజ్య పాలనా పద్ధతుల గురించిగానీ, న్యాయవ్యవస్థ తీరుతెన్నుల గురించిగానీ, పోనీ వారు దేశీయంగా లేదా విదేశాలతో జరిపిన వర్తక వాణిజ్యాల నిర్వహణ పద్ధతుల గురించిగానీ మనం తెలుసుకునేందుకు ఎలాంటి ఆనవాళ్లూ మనకు దొరకవు’ (ది స్టోరీ ఆఫ్ ఇండియా). ఈ పతనానికి కారణం ఏమై ఉంటుంది? స్కందగుప్తుడు క్రీ.శ. 5వ శతాబ్ది మధ్యలో ఆహార సేకరణలో ఉన్న అనేక తెగలను, ప్రాచీన జాతులను దారుణంగా అణచివేశాడని భారత్ సుప్రసిద్ధ చరిత్రకారుడు డి.డి. కోశాంబీ పేర్కొ న్నాడు (ఇంట్రడక్షన్ టు– స్టోరీ ఆఫ్ ఇండియా : 1956). గుప్తుల కాలంలోనే సమాజంలో సర్వమానవ సమానత్వాన్ని బోధించి, అమ లుచేస్తూ వచ్చిన బౌద్ధ ధర్మానికి ఆదరణ లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయి. మగధ ప్రాంతంలో మానవతావాదాన్ని ప్రబోధిస్తున్న బౌద్ధ మతం దెబ్బతినడానికి గుప్తులు కారణమయ్యారు. రాచరిక వ్యవస్థా రక్షణలో భాగంగా పితృస్వామిక వ్యవస్థను గుప్త రాజులు పెంచి పోషించారు. వీరి కాలంలోనే స్థానిక భాషల స్థానంలో సంస్కృ తానికి ప్రాధాన్యం పెరిగింది. యజ్ఞయాగాదులకు పెద్దపీట వేశారు గుప్తులు. అందుకే బహుశా ప్రాచీన తొలి మధ్య యుగ భారత చరి త్రలో కుషాణుల పాత్రను, కనిష్కుల శాసనాలను చూస్తే గుప్త రాజుల గుట్టు బయటపడుతుందని మరికొందరు చరిత్రకారుల భావన. అందుకే గుప్తుల ఈ ‘గుప్త’ చరిత్ర వెనుక దాగిన ‘గుట్టు’ను తెలుసుకోవడానికి ఒక పూర్తి జీవిత కాలం కూడా చాలదని చెబుతూ ఒక చరిత్రకారుడు ఇలా వ్యాఖ్యానించవలసి వచ్చింది: ‘భారత చరిత్రలోని పెక్కు ప్రసిద్ధ వంశ చరిత్రలకు జ్ఞాపకార్థం నిలబడే గుర్తులు ఉంటాయి, వాటిని మనం చూడొచ్చు. ఉదాహరణకు ఢిల్లీ లోని సుల్తానేట్, బ్రిటిష్ పాలనా చిహ్నాలు, ఆగ్రాలో మొగలాయి చిహ్నాలు, అశోకుడి స్థూపాలు, శాసనాలు చెక్కిన శిలలూ వగైరా, సారనాథ్‌లోని బుద్ధ సైకత శిలాస్థూపం, అజంతా గుహలలోని బౌద్ధ గుహారామాలు వగైరా... క్రీ.శ. 300– 500 శతాబ్దాల మధ్య తుది రోమన్ సామ్రాజ్య పాలకుల సమకాలికులుగా చెప్పుకునే గుప్తులు బంగాళాఖాతం నుంచి సింధునదీ ప్రాంతాల వరకు పాలించినట్టు చెప్పుకున్నారు’ అని రాశాడు. ఏది ఏమైనా గుప్త రాజులు మాత్రం వైష్ణవులేగానీ బౌద్ధ ధర్మావలంబికులు కారు. గుప్తుల కాలంలోనే కుల, వర్ణ వ్యవస్థలు వేళ్లూనుకున్నాయి. అంతేగాదు, గుప్త రాజుల ‘హద్దుమీరిన భోగ లాలసతను, లంపటత్వాన్ని విశాఖదత్తుని ‘ముద్రారాక్షసం’ ‘దేవి చంద్రగుప్త’ నాటకం, రాజశేఖరుని ‘కావ్య మీమాంస’ జల్లెడపట్టి చూపాయని మరికొందరు విమర్శకుల అభి ప్రాయం. ఇదే నేటి భారతదేశానికి ‘ఆదర్శ’మని భావించి, దానిని ‘జాతీయవాద పతాక’గా అభినవ భారత పాలకులు చెప్పదలిస్తే మాత్రం అంతకన్నా చరిత్ర వక్రీకరణ మరొకటి ఉండదేమో! పెక్కు మంది సమకాలీన గుప్త రాజులు మ్లేచ్ఛప్రాయులు (బార్బరస్), ద్రోహులు, అబద్ధాలకోరులు, పిసినారులు.. ఒక జాతిగా, ఒక తెగగా, ఒక కులంగా ఏ కోశానా గుప్తులకు గౌరవప్రదమైన పుట్టు పూర్వా లంటూ కనిపించవని డాక్టర్ డి.డి. కోశాంబి వివరించాడు. కనుక దేన్నిబడితే దాన్ని ‘స్వర్ణ యుగం’గా ముందే అభివర్ణించేకంటే కాలా నికి వ్యవధి ఇవ్వడం మంచిదేమో? ఎందుకంటే, సౌందర్యవంత మైన, నిజమైన స్వర్ణయుగావిష్కరణ కోసం మనం ఎప్పుడూ భవి ష్యత్తు మీదే నిఘా పెట్టి, ఇవాళ్టికంటే రేపే ఎంతో బాగుంటుందను కోవడమే ఆశాజీవుల ఎజెండా! ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రికార్డుల రాణి.. సుష్మ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ రికార్డుల ఖాతాలోకి మరొకటి చేరింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ చరిత్ర సృష్టించారు. గతంలో 25 ఏళ్ల చిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక రికార్డును, ఢిల్లీ తొలి మహిళా సీఎంగా మరో రికార్డును ఆమె సృష్టించిన విషయం తెలిసిందే. అన్ని పార్టీల్లోనూ.. మొదటి మహిళా అధికార ప్రతినిధి కూడా ఆమెనే కావడం విశేషం. ప్రపంచ రాజకీయాల్లో, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాల్లో భారత్ క్రియాశీల పాత్ర పోషించాల్సిన ప్రస్తుత తరుణంలో ఆమె విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పాకిస్థాన్, చైనాలతో సంబంధాలు విదేశాంగ మంత్రిగా ఆమెను కాలపరీక్షకు నిలబెట్టేవే. విదేశాంగ శాఖ మంత్రే కాకుండా, కార్యదర్శి కూడా మహిళే కావ డం విశేషం. ప్రస్తుతం సుజాతాసింగ్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.