india hockey
-
అరంగేట్రంలోనే అదరగొట్టారు.. చైనాకు షాకిచ్చిన భారత అమ్మాయిలు
FIH Pro League 2021-22: ఒమన్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్(అంతర్జాతీయ హాకీ సమాఖ్య) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు శుభారంభం లభించింది. సోమవారం చైనాను 7-1 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడించిన భారత మహిళా జట్టు.. ప్రో లీగ్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టింది. సుశీల చాను(47వ నిమిషం, 52వ నిమిషం) రెండు గోల్స్‌తో రాణించగా.. నవనీత్ కౌర్, నేహా, వందనా కటారియా, షర్మిలా దేవీ, గుర్జీత్ కౌర్ తలో గోల్ చేశారు. చైనా తరఫున జు డెంగ్ 43వ నిమిషంలో గోల్ సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రో లీగ్ 2021-22 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. After our resounding win over 🇨🇳, we have jumped up to the 3️⃣rd place on the FIH Hockey Pro League 2021/22 (Women) points table! 👊#IndiaKaGame pic.twitter.com/yP8DMrX4uf — Hockey India (@TheHockeyIndia) January 31, 2022 చదవండి: విండీస్‌తో సిరీస్‌కు రెడీ.. బయో బబుల్‌లోకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు -
పాకిస్థాన్‌తో ఓటమిని ఎప్పడూ ఊహించం
న్యూఢిల్లీ: ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్మమెంట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించడం చాలా ప్రత్యేకమైనదని భారత హాకీ జట్టు సీనియర్ ఆటగాడు సర్ధార్ సింగ్ అన్నాడు. పాక్‌తో ఎప్పుడు ఆడినా చావోబతుకో లాంటి పరిస్థితి ఉంటుందని, ఒత్తిడి అధిగమించడం గురించి జూనియర్ ఆటగాళ్లకు చెప్పామని తెలిపాడు. పాకిస్థాన్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో కూడా ఓడిపోవాలని భావించమని చెప్పాడు. క్వాంటాన్ (మలేసియా)లో జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో పాక్‌ను మట్టికరిపించి ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. భారత జట్టు మంగళవారం ఢిల్లీకి వచ్చింది. ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలవడమిది రెండోసారి. తాజా టోర్నీలో భారత్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్ దశలో పాక్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లోనూ పాక్‌కు షాకిచ్చింది. -
భారత్‌కు కాంస్య పతకం
ఇఫో: అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది. ఆదివారం ఇఫో (మలేసియా)లో కాంస్య పతకం కోసం జరిగినే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో మ్యాచ్‌లో భారత జట్ట.. దక్షిణ కొరియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో భారత్, కొరియా 2-2తో సమంగా నిలిచాయి. అనంతరం భారత్ 4-1తో కొరియాను ఓడించింది. -
భారత హాకీ ప్లేయర్‌కు ‘కామన్వెల్త్’ అక్రిడిటేషన్ నిరాకరణ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత హాకీ జట్టు ఆటగాడు హర్బీర్‌సింగ్ సంధూకు నిర్వాహకులు అక్రిడిటేషన్ నిరాకరించారు. అయితే ఇందుకు వారు ఎటువంటి కారణాలూ చూపలేదు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హాకీ ఇండియా (హెచ్ఐ) అవసరమైతే కామన్వెల్త్ పోటీల నుంచి వైదొలుగుతామంటూ నిరసన తెలిపింది. ఈ మేరకు హెచ్ఐ ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్రా.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.రామచంద్రన్, రాజీవ్ మెహతాలకు లేఖ రాశారు. 24 ఏళ్ల హర్బీర్ సింగ్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేకపోయినా... అక్రిడిటేషన్ నిరాకరించడం భారత్‌కు అవమానకరమని, విషయాన్ని వెంటనే కామన్వెల్త్ క్రీడల నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, లేదంటే పోటీల నుంచి పురుషుల జట్టును ఉపసంహరించడం మేలని లేఖలో బాత్రా పేర్కొన్నారు.