India road network
-
చండీగఢ్ జనాభా కంటే ఎక్కువ.. రోడ్డు ప్రమాదాల్లో పదేళ్లలో 15 లక్షల మంది మృతి
మనదేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో 15.3 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. భువనేశ్వర్ నగర జనాభాకు దాదాపు సమానం. దీన్నిబట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎంత ఎక్కువ స్థాయిలో ప్రజలను బలిగొంటున్నాయో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపడుతున్నా, అఖరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.50 లక్షల మంది క్షతగాత్రులు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. మనదేశంలో 10 వేల కిలోమీటర్లకు సగటు మరణాల సంఖ్య 250. చైనాలో పది వేల కిలోమీటర్లకు 117, అమెరికాలో 57, ఆస్ట్రేలియాలో 11 మరణాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలం (2014-23)లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో 15.3 లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు దశాబ్దం (2004-13)లో 12.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-23 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు 45.1 లక్షలు కాగా, 2004-13లో ఏకంగా 50.2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.రెండింతలైన వాహనాలుజనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రహదారులు విస్తరించడం కూడా ఎక్కువ మరణాలకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టలేదని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో రిజిస్టర్డ్ వాహనాలు 15.9 కోట్లు కాగా, 2024 నాటికి రెండింతలు పైగా పెరిగి 38.3 కోట్లకు చేరుకున్నాయి. 2012 నాటికి 48.6 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్న రహదారులు.. 2019 నాటికి 63.3 లక్షల కిలోమీటర్లకు చేరాయి.యాక్సిడెంట్ కేసులపై శీతకన్నుఅయితే రోడ్డు ప్రమాదాలకు వాహనాలు, రహదారులు పెరగడం ఒక్కటే కారణం కాదని.. రహదారి భద్రత అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విభాగాలు, వాహనదారులు, లాభాపేక్షలేని సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు. యాక్సిడెంట్ కేసులను పోలీసులు సరిగా విచారణ జరపడం లేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, అన్ని దర్యాప్తు సంస్థలు యాక్సిడెంట్ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.ఘోర ప్రమాదం.. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీ; ఆరుగురి మృతిహత్య కేసులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. రోడ్డు ప్రమాదాలు, మరణాల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని ఐపీఎస్ మాజీ అధికారి, ఎంపీ టి కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టాలని భావిస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. మనదేశంలో సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య.. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కంటే చాలా ఎక్కువని ఆయన తెలిపారు. -
సెప్టెంబర్‌లో ఐపీవోల జాతర!!
♦ పబ్లిక్ ఇష్యూకి రానున్న నాలుగు కంపెనీలు ♦ రూ. 2,500 కోట్ల సమీకరణ ∙ ♦ లిస్టులో మ్యాట్రిమోనీడాట్‌కామ్ కూడా న్యూఢిల్లీ: మెరుగుపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఊతంతో ఇటీవలి కాలంలో కంపెనీలు మళ్లీ ఐపీవోల బాట పట్టాయి. సెప్టెంబర్‌లో నాలుగు సంస్థలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. రూ. 2,500 కోట్లు సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఆన్లైన్ వివాహ సేవల సంస్థ మ్యాట్రిమోనీడాట్‌కామ్, భారత్ రోడ్ నెట్వర్క్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్, నిర్మాణ రంగ కంపెనీ కెపాసిటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నాలుగూ వచ్చే నెల ఐపీవోకి రాబోతున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిధులను ప్రధానంగా విస్తరణ ప్రణాళికలకోసం, రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈసారి మెరుగే..: గతేడాది మొత్తం 26 కంపెనీలు మొత్తం రూ. 26,000 కోట్లు సమీకరించాయి. ఐపీవోలకి సంబంధించి ఆరేళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఐపీవో విభాగం గతేడాది కన్నా మెరుగ్గానే ఉండగలదని పరిశీలకులు భావిస్తున్నారు. మధ్యమధ్యలో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికీ .. మార్కెట్లో బులిష్ సెంటిమెంట్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు ఇరవైకి పైగా కంపెనీలు సెబీకి ఐపీవో ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 17 కంపెనీలు ఇనీషియల్ షేర్ సేల్ ఆఫర్ల ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాయి. ఇందులో బీఎస్ఈ, అవెన్యూ సూపర్‌మార్ట్స్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో), ఎరిస్ లైఫ్‌సైన్సెస్, కొచిన్ షిప్‌యార్డ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఐపీవోల వివరాలు.. 1. భారత్ రోడ్ నెట్వర్క్ శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కి సంబంధించిన ఈ సంస్థ ఐపీవో సెప్టెంబర్ 6–8 మధ్యలో రానుంది. రూ. 10 ముఖవిలువ చేసే 29.30 లక్షల ఈక్విటీ షేర్లను ఈ సందర్భంగా విక్రయించనున్నారు. రూ. 1,200 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. 2. డిక్సన్ టెక్నాలజీస్.. సుమారు రూ. 600–650 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షేర్ హోల్డర్లు 37,53,739 షేర్లను విక్రయించనుండగా, కొత్తగా మరో రూ. 60 కోట్ల విలువ చేసే షేర్లను ఐపీవోలో జారీ చేయనున్నారు. ఈ ఇష్యూ కూడా సెప్టెంబర్ 6న మొదలై 8తో ముగియనుంది. 3. మ్యాట్రిమోనీడాట్‌కామ్.. భారత్‌మ్యాట్రిమోనీ బ్రాండ్ కింద ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక సేవలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 350 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్ ఫర్ సేల్ కింద 37,67,254 షేర్లను, కొత్తగా రూ. 130 కోట్లు విలువ చేసే షేర్లను జారీ చేయనుంది. 4. కెపాసిటీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.400 కోట్లు సమీకరించవచ్చని అంచనా.