జీఎస్టీ ఎఫెక్ట్: ఐ ఫోన్, ఐ ప్యాడ్ ధరల్లో కోత
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నేటి(జూలై 1) నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను ఇండియాలో గణనీయంగా తగ్గించింది. ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ లపై గరిష్ట రిటైల్ ధరల్లో తగ్గింపును ప్రకటించింది. దాదాపు7.5 శాతం ధరలను తగ్గించి భారతీయులకు జీఎస్టీ గిఫ్ట్ అందించింది. కొన్ని మినహాయింపులతో మాక్ లైన్ కంప్యూటర్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
భారతదేశంలో ఐఫోన్ ధరలు ఎలా మారాయో ఇక్కడ చూడండి
ఐఫోన్ ఎస్ ఈ
32 జీబీ అసలు ధరరూ. 27,200 ప్రస్తుత ధర రూ. 26,000
128 జీబీ అసలు ధర రూ. 37,200 ప్రస్తుత ధర రూ. 35,000
ఐఫోన్ 6ఎస్
32 జీబీ అసలు ధర రూ. 50 వేలు, ప్రస్తుత ధర రూ. 46, 900
128 జీబీ అసలు ధర రూ. 60 వేలు ప్రస్తుత ధర రూ. 55,900
ఐఫోన్ 6 ఎస్ ప్లస్
32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 100
128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65వేలు
ఐఫోన్ 7
32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 200
128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65,200
256 జీబీ అసలు ధర రూ. 80 వేలు ప్రస్తుత ధర రూ.74,400
ఐఫోన్ 7 ప్లస్
32 జీబీ అసలు ధర రూ. 72వేలు, ప్రస్తుత ధర రూ. 67, 300
128 జీబీ అసలు ధర రూ. 82 వేలు ప్రస్తుత ధర రూ. 76,200
256 జీబీ అసలు ధర రూ. 92 వేలు ప్రస్తుత ధర రూ.85,400