Indian Army Officer
-
వారు సరిహద్దు దాటాలని చూస్తున్నారు : ఆర్మీ అధికారి
జమ్ము కశ్మీర్ : ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని వేర్వేరు శిబిరాల్లో దాదాపు 500 వందల మంది ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నారని నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ తెలిపారు. అంతేకాక, ఆంక్షలు సడలిస్తే అశాంతి రేపడానికి రెండు నుంచి మూడొందల మంది తీవ్రవాదులు కశ్మీర్‌లోనే ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం మీడియాతోమాట్లాడుతూ ఆయన ఈ విషయాలు ధృవపరిచారు. సరిహద్దు అవతల ఉన్నవారికి పాక్ సైన్యమే ఆయుధాలను, నిధులను సమకూర్చుతూ లాంచ్పాడ్ శిక్షణను కూడా ఇస్తున్నట్టు తమకు గట్టి సమాచారం ఉందని రణబీర్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల పాక్ నుంచి పంజాబ్‌లోకి డ్రోన్లు రావడంపైనా ఆయన స్పందించారు. ఎలాగైనా జమ్ము కశ్మీర్లో అలజడులు సృష్టించాలనే లక్ష్యంతో దాయాది దేశం వేస్తున్న కొత్త తరహా ఎత్తుగడలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను ధ్వంసం చేసే శక్తితో పాటు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్ధ్యం మన సైన్యానికుందని వెల్లడించారు. పాకిస్తాన్ ఎలాంటి కుట్ర పన్నినా, ఎంతగా ప్రయత్నించినా వారి ఆటలు సాగనివ్వమని సింగ్ స్పష్టం చేశారు. -
కాంగోలో భారత ఆర్మీ అధికారి మృతి
కిన్షాసా: ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా డీఆర్ కాంగోలో విధులు నిర్వహిస్తున్న భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ్ సోలంకి మృతిచెందారు. ఈ నెల 8న కయాకింగ్కు దగ్గర్లోని చెగెరా ద్వీపం వద్ద ఆయన కనిపించకుండా పోయారు. ఆయన కోసం తీవ్రంగా గాలించిన అధికారులు గురువారం కివూ నదిలో ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. కాగా ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలో మిలిటరీ స్టాఫ్ అధికారిగా పనిచేస్తున్న భారత ఆర్మీ అధికారి గత నాలుగు రోజుల నుంచి ఆర్మీ శిబిరంలో కనిపించకుండా పోయారని కాంగో ఆర్మీ అధికారులు ప్రకటించారు. దీంతో అతని ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తప్పిపోయిన అధికారి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ్ సోలంకిగా గుర్తించారు. అయితే ఈ నెల 8న కాంగోలోని టెచెరా ద్వీపానికి సమీపంలో ఉన్న కివు సరస్సులోకి కాంగో ఆర్మీ బృందం బోటింగ్‌కు వెళ్లింది. ఆ బృందంలో గౌరవ్ సోలంకి కూడా ఉన్నారు. కివు సరస్సులో అధికారులంతా బోటింగ్ చేశారు. బోటింగ్ ముగిసిన అనంతరం ఆ ఆర్మీ అధికారుల బృందం తిరగి కాంగోకి చేరుకుంది. కానీ, శనివారం ఆర్మీ శిబిరంలో అధికారులకు సోలంకీ కనిపించకపోవడంతో ఆయన తప్పిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే బోటింగ్‌కు వెళ్లిన ప్రాంతంలోనే తప్పిపోయి ఉంటారని అధికారులు భావించి.. కివు సరస్సులో హెలికాప్టర్లు, స్పీడ్ బోట్లను ఉపయోగించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దీంతో గురువారం ఉదయం పదకొండు గంటలకు టెచెరా ద్వీపంలోని కివు సరస్సులో సుమారు కిలోమీటరు దూరంలో సోలంకీ మృతదేమం లభ్యమైంది. దీంతో కాంగో ఆర్మీ అధికారులు సోలంకి మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. దాంతోపాటు భారత ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు. -
భారత ఆర్మీ ఆఫీసర్‌కు తై చీ నేర్పిస్తున్న చైనా సోల్జర్
-
వైరల్ : ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌కు చైనా సోల్జర్ పాఠాలు..!!
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం ప్రతిష్టంభన భారత్ చైనాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షడు జిన్‌పింగ్‌ల మధ్య కొద్ది నెలల క్రితం జరిగిన చర్చలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు దోహదం చేశాయి. కాగా, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. భారత్, చైనా సంబంధాలు మెరుగయ్యాయనే విషయానికి అద్దం పడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది. చైనా సోల్జర్ ఒకరు భారత ఆర్మీ ఆఫీసర్‌కు తై చీ నేర్పిస్తున్న వీడియో అది. కాగా, తై చీ చైనా ప్రాచీన యుద్ధకళ పద్ధతి. ఇది యుద్ధకళ మాత్రమే కాదు. శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాల్లో ఒకటి. దీంతో శరీరంపై చక్కని నియంత్రణ వస్తుంది. తై చీ పద్ధతిలో శరీర బరువును నెమ్మదిగా ఒక కాలి మీది నుంచి మరో కాలి మీద పడేలా లయబద్ధంగా కదులుతూ ఉంటారు. ఇది శరీర నియంత్రణకు తోడ్పడుతుందనీ, ఫలితంగా కింద పడిపోయే ముప్పు తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గతేడాది డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా రక్షణ బలగాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. డోక్లాం తమదేనని అటు చైనా, ఇటు భూటాన్ వాదించాయి. భూటాన్ వాదనకు భారత్ మద్దతివ్వడంతో పరిస్థితి మరోలా మారింది. దాంతో భారత్, చైనాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగింది. -
పతాన్ కుమార్ బెయిల్ పై విడుదల
-
'నన్ను ఎవరో చాకచక్యంగా ఇరికించారు'
హైదరాబాద్ : సైనిక రహస్యాలను ఉగ్రవాదులకు చేరవేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న సైనికోద్యోగి పటన్ కుమార్ పొద్దార్ (40) గురువారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆగస్టు 3న అతన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయడం, బుధవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిలటరీ అధికారి మేజర్ రంజిత్ సంతకం చేసిన కీలక డాక్యుమెంట్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరాయి. ఈ డాక్యుమెంట్లను ఈ-మెయిల్ ద్వారా ఈ ఏడాది జూన్ 7న అనుష్క అగర్వాల్‌కు పటన్ పంపినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలోతేలింది. అనుష్క, పటన్లు ఉపయోగించిన ఫోన్ నంబర్లు ఎవరి పేర్లపై తీసుకున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కీలక ర హస్యాలను పటన్, అనుష్కకు చేరవేసినట్టు గుర్తించారు. ప్రతిఫలంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మంగళ్గిరి ఎస్బీఐ బ్రాంచ్‌లో ఉన్న అతని అకౌంట్‌కు దశలవారీగా అనుష్క అగర్వాల్ డబ్బులు పంపినట్లు తేలింది. ఆమె ఆదేశాల మేరకు పటన్ అకౌంట్లోకి డబ్బులు వేసిన ఆసీఫ్ అలీ మాత్రమే పోలీసులకు చిక్కాడు. మిగతా చోట్ల నుంచి పటన్ అకౌంట్లోకి డబ్బులు వేసిన వారు ఇంకా చిక్కలేదు. నన్ను ఇరికించారు: పటన్ నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తున్న తనను ఎవరో చాకచక్యంగా ఈ కేసులో ఇరికించారని జైలు నుంచి విడుదలైన పటన్ కుమార్ పొద్దార్ 'సాక్షి' వద్ద వాపోయాడు. తన అకౌంట్లో ఎవరు డబ్బులు వేశారో తెలియదన్నారు. తనతో వెబ్ కెమెరాలో మాట్లాడినదీ, ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసినదీ ఒకే యువతని చెప్పాడు. కాగా ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు మన సైన్యానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చేరినట్టు తెలిసింది. దీంతో పాటు 'స్వీట్స్' అనే పదానికి అర్థాన్నీ మన పోలీసులు కనుగొన్నారు. దేశ సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేసిన కేసులో పట్టుబడిన పటన్ కుమార్ పొద్దార్, పాక్ ఐఎస్ఐ ఉగ్రవాది అనుష్క అగర్వాల్‌ల ఈ మెయిల్ సంభాషణలను పరిశీలించి... 'స్వీట్స్' అనే పదానికి మన పోలీసులు అర్థాన్ని తెలుసుకున్నారు. సైనిక రహస్యాలను పంపినందుకు పటన్ బ్యాంక్ అకౌంట్‌కు అనుష్క అగర్వాల్ జూలై 22న 2014 సంవత్సరంలో రూ.20వేలు పంపించింది. అదే రోజు రాత్రి 11.30 గంటలకు చాటింగ్‌లో మాట్లాడుతూ తాను 'స్వీట్స్ పంపించాను చేరాయా?' అని అనుష్క అడిగింది. అందుకు పటన్ సమాధానం చెబుతూ సరే చూస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు తన అకౌంట్లో డబ్బులు ఉండడంతో ఆ విషయాన్ని చాటింగ్‌లో ఆమెకు చేరవేశాడు. ఈ సంభాషణతో 'స్వీట్స్' అనే పదానికి అర్థం 'డబ్బులు' అని తేలింది. -
నగ్న చిత్రాలు పంపితే సమాచారమిస్తా...
హైదరాబాద్: పాకిస్తాన్ యువతి మోజులో పడి దేశభద్రత విషయాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్నాడన్న అనుమానంతో పతక్ కుమార్‌ను అనే భారత సైనికాధికారిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పతక్కుమార్ రిమాండ్‌కు తరలించారు. అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ యువతితో పతక్ కుమార్ రెండేళ్లుగా చాటింగ్చ చేస్తున్నట్టు గుర్తించారు. నగ్న చిత్రాలు పంపితే తమ దేశ భద్రతకు చెందిన సమాచారం ఇస్తానని సదరు యువతితో పతక్ కుమార్ సందేశం పంపినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఐబీ సమాచారంతో ఆర్మీ అప్రమత్తమై హైదరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మిగతా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.